పిక్ టాక్: ఒకే ఫ్రేమ్‌లో 2011 వరల్డ్ కప్ హీరోలు

పిక్ టాక్: ఒకే ఫ్రేమ్‌లో 2011 వరల్డ్ కప్ హీరోలు

Published on Mar 13, 2025 1:52 PM IST

భారత క్రికెట్ అభిమానుల చిరకాల కోరిక అయిన వరల్డ్ కప్ ట్రోఫీని 2011లో ఇండియన్ క్రికెట్ జట్టు చేజిక్కించుకుంది. 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. అయితే, 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచిందని చెప్పాలి.

ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు గౌతమ్ గంభీర్, ధోని వీరోచిత ఇన్నింగ్స్‌తో వరల్డ్ కప్‌ను ఇండియాకు అందించారు. అయితే, ఆ విజయంపై అప్పట్లో ధోనికే ఎక్కువ క్రెడిట్ దక్కడంతో గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వారిద్దరు కలిసింది చాలా తక్కువ. అయితే, తాజాగా ఇన్నేళ్లకు వారిద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక ముస్సోరిలో జరిగింది. ఈ వేడుకకు ధోనీతో పాటు గంభీర్ కూడా హాజరయ్యాడు. ఇలా ఇద్దరు కలిసి ఓ ఫోటోకు పోజివ్వడంతో ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు