సమీక్ష : ఆఫీసర్ ఆన్ డ్యూటీ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ !

సమీక్ష : ఆఫీసర్ ఆన్ డ్యూటీ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ !

Published on Mar 15, 2025 3:01 AM IST

officer on duty Movie Review In Telugu

విడుదల తేదీ :మార్చి 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : కుంచకో బోబన్, ప్రియమణి తదితరులు.
దర్శకుడు : జీతూ అష్రఫ్
నిర్మాతలు : మార్టిన్ ప్రక్కత్, సిబి చవర, రంజిత్ నాయర్

సంగీతం : జేక్స్ బిజా,య్

ఛాయాగ్రహణం : రాబి వర్గీస్ రాజ్
కూర్పు : చమన్ చక్కో

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

కుంచకో బోబన్ హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. ప్రియమణి హీరోయిన్ గా నటించింది. మలయాళంలో ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల చేశారు. తెలుగులో నేడు రిలీజ్ అయ్యింది.
మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

హరి శంకర్ (కుంచకో బోబన్) సీఐ. సస్పెన్షన్ తర్వాత డ్యూటీలో చేరతాడు. అతని ప్రవర్తనకు ఆ స్టేషన్ సిబ్బంది కూడా భయపడుతూ ఉంటారు. దీనికి తోడు హరి శంకర్ డ్యూటీలో జాయిన్ తొలిరోజు గోల్డ్ చైన్ కేసు వస్తుంది. ఆ కేసు విచారణలో భాగంగా ఓ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ కోసం స్టేషన్‌కు రమ్మని చెబితే… ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్యకు, బెంగళూరులోని ఓ పోలీస్ ఆత్మహత్యకు, కేసుకు సంబంధం ఉందని హరి శంకర్ కి డౌట్ వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన కుమార్తె మరణానికి హరి శంకర్ కారణం అని అమ్మాయి తండ్రి ఆరోపణలు చేస్తాడు. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది ?, హరి శంకర్ కూతురు చావుకి కారణం ఏమిటి?, అలాగే విచారణలో హరి శంకర్ ఏం చేశాడు? బెంగళూరు వెళ్లిన తర్వాత అతనిపై హత్యాయత్నం చేసిన గ్యాంగ్ సభ్యులు ఎవరు? వాళ్లకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి? హరి శంకర్ నుంచి భార్య గీత (ప్రియమణి) విడాకులు ఎందుకు కోరింది? డ్రగ్స్, న్యూడ్ వీడియోలు తీస్తూ అమ్మాయిలను రేప్ చేయడం ఏమిటి? చివరకు ఈ కేసును హరి శంకర్ ఎలా డీల్ చేశాడు?, ఆ కిల్లర్స్ ను ఎలా అంతం చేశాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ప్రారంభం నుంచి దర్శకుడు జీతూ అష్రఫ్ ఒక మూడ్‌లోకి తీసుకువెళ్ళారు. సినిమాలో పాత్రలు కూడా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పాత్రకు ఒక సమస్య ఉందని ముందు నుంచి చెబుతూ వచ్చి… ఆ సమస్య ఏమిటో రివీల్ చేస్తూ వెళ్లిన విధానం ఆకట్టుకుంది. చాలా సీన్లలో టెన్షన్ ను బిల్డ్ చేస్తూ దర్శకుడు సీన్స్ ను ఎలివేట్ చేయడం చాలా బాగుంది. నటీనటుల నటన విషయానికి వస్తే.. కుంచకో బోబన్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు.

ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రియమణి కూడా చాలా బాగా నటించింది. భార్య పాత్రలో ఆమె నిజంగా ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్స్ లో ప్రియమణి అద్భుతంగా నటించింది. మెయిన్ గా హీరో – విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ రాబీ వర్గీస్ రాజ్ పనితనం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఇన్వెస్టిగేషన్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా సాగిన
ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నా.. సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. జీతూ అష్రఫ్ దర్శకత్వ పనితనం బాగున్నా.. తీసుకున్న స్క్రిప్ట్ లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి గుడ్ పాయింట్ ఉన్నా గానీ, మెయిన్ గా కొన్ని సీన్స్ ఇంట్రస్ట్ గా సాగలేదు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో చాలా భాగం స్లోగా సాగింది. సెకెండ్ హాఫ్ లో ఆ సాగతీత సన్నివేశాలను తగ్గించాల్సింది.

నిజానికి ఓ సిఐకి ఎన్ని సమస్యలు ఉంటాయో.. వారి జాబ్ లో ఎంత రిస్క్ ఉంటుందో చాలా క్లారిటీగా చూపించారు. సినిమాలో అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. కథ అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. దీనికితోడు కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో హై యాక్షన్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ను రాసుకున్నా.. అవి కూడా పూర్తి సినిమాటిక్ గా సాగాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. రాబి వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. చమన్ చక్కో ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాతలు మార్టిన్ ప్రక్కత్, సిబి చవర, రంజిత్ నాయర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

ఆఫీసర్ ఆన్ డ్యూటీ అంటూ వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ లో.. ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా కూతురి సెంటిమెంట్ చాలా బాగుంది. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. కథాకథనాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, చాలా చోట్ల ప్లే స్లోగా సాగడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు