‘రామాయణ’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

‘రామాయణ’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Mar 14, 2025 2:28 PM IST

బాలీవుడ్ సినిమా నుంచి రానున్న పలు భారీ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రామాయణ” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఇది వరకు మన ఇండియన్ సినిమా నుంచి రామాయణ గాథపై అనేక సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మరి మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది దీపావళికి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇపుడు ఈ సినిమాలపై లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారింది. పార్ట్ 1 షూటింగ్ ప్రస్తుతానికి పూర్తయ్యినట్టుగా

అలాగే పార్ట్ 2 కూడా షూటింగ్ స్టార్ట్ చేసి పార్ట్ 1 రిలీజ్ నాటికి అంటే వచ్చే ఏడాది నవంబర్ నాటికి పార్ట్ 2 షూటింగ్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసి ఆ సినిమాని విడుదల చేయనున్నట్టుగా ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు