లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటించిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “కోర్ట్” కూడా ఒకటి. దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమా మీద మేకర్స్ మొదటి నుంచీ మంచి నమ్మకం పెట్టుకోగా అదే నమ్మకంగా ముందే పైడ్ ప్రీమియర్స్ కూడా వేసుకున్నారు. వాటికి సాలిడ్ రెస్పాన్స్ రావడం ఇపుడు సినిమాకి మంచి ప్లస్ అయ్యింది అని చెప్పాలి.
నేడు ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ గా రిలీజ్ కి రాగా బుక్ మై షోలో మంచి ట్రెండింగ్ ఈ చిత్రానికి కనిపిస్తుంది. గంటకి 8 వేలకి పైగా టికెట్స్ ఈ చిత్రానికి నమోదు అవుతుండడం విశేషం. ఇక చిన్న సినిమాకి ఈ రేంజ్ బుకింగ్స్ అంటే కంప్లీట్ కంటెంట్ పవర్ అని చెప్పవచ్చు. దీనితో డే 1 సాలిడ్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కే ఛాన్స్ ఉంది అలానే ఈ వీకెండ్ కి కూడా కోర్ట్ లాభాల్లోకి కూడా వెళ్లిపోవచ్చు. ఇక ఈ చిత్రానికి నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.