మన టాలీవుడ్ మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి అలాగే నాగబాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మిత్రులు కూడా సినిమాలు సహా అటు రాజకీయాల్లోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరి వీరిలో చిరంజీవి పూర్తిగా రాజకీయాలు వదిలేసి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక తన ఇద్దరు తమ్ముళ్లు రాజకీయాల్లో బిజీగా ఉండగా లేటెస్ట్ గా తన పెద్ద తమ్ముడు నాగేంద్ర బాబు ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వడం జరిగింది.
అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. దీనిపై చిరు లేటెస్ట్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. “ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు కి నా అభినందనలు,ఆశీస్సులు ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు” అని తెలిపారు. దీనితో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.
ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు @NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!????
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని…
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025