ప్రభాస్ పై నెగిటివిటీ.. డూప్స్ ఏమన్నా కొత్తా??

ప్రభాస్ పై నెగిటివిటీ.. డూప్స్ ఏమన్నా కొత్తా??

Published on Mar 14, 2025 8:00 PM IST

స్టార్ హీరో ప్రభాస్ అంటే ఇపుడు ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో ఒక బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ ఇపుడు అందుకున్న స్టార్డం కోసం ఎంతో కష్టపడ్డాడు అని అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు సోషల్ మీడియాలో ప్రభాస్ పై ఒక్కసారిగా ఊహించని నెగిటివిటీ కనిపిస్తుంది.

మెయిన్ గా తన సెన్సేషనల్ హిట్ చిత్రం కల్కి 2898 ఎడి సినిమా నుంచి పలు సన్నివేశాలు విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ లో చాలా సీన్స్ ప్రభాస్ నటించలేదు డూప్ చేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తూ వస్తున్నాయి. ఇలా పలు వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే తనపై ఇదంతా వాంటెడ్ నెగిటివిటీలా అనిపించక మానదు.

రీసెంట్ గానే ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి డూప్స్ లేరు? ఇపుడు డార్లింగ్ హీరోపై ట్రోల్ చేస్తున్న ప్రతీ హీరోకి దాదాపు చాలా సీన్స్ డూప్ తోనే చేస్తారు. నిజానికి మొదట డూప్స్ తో చేసిన సన్నివేశాలు మళ్ళీ ప్రధాన పాత్రలతో కూడా మేకర్స్ చిత్రీకరిస్తారు. ఇదంతా సినిమా తెరకెక్కించడంలో ఒక భాగం మాత్రమే.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అన్ని చిత్రాలు మెయిన్ పాత్రలతో పాటుగా పార్లల్ గా సినిమా సిబ్బంది ఇతర నటులతో కూడా హీరోలు హీరోయిన్స్, పాటలు లాంటివి కూడా ఒక సెపరేట్ సినిమా లాంటిదే మేకర్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని జక్కన్న రాజమౌళి కూడా తన గ్లోబల్ సెన్సేషన్ RRR కి చెప్పారు.

సో ప్రభాస్ పై ఇపుడు ఈ రాద్ధాంతం అంతా అనవసరం అని చెప్పవచ్చు. కాకపోతే ఇలాంటివి మన వాళ్ళకి తక్కువ తెలుసు కాబట్టి వాటిని నెగిటివ్ గా చేసుకొని మన హీరోల ప్రఖ్యాతిని మనమే తగ్గించుకుంటున్నాము. మన హీరోలు తెలుగు సినిమా పేరుని పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్తుంటే వారి హీరోలు మాత్రం ఇంకా ఫ్యాన్ వార్స్ దగ్గరే ఆగిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు