IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలాలు, లోపాలు ఏంటి?

IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలాలు, లోపాలు ఏంటి?

Published on Mar 15, 2025 12:30 PM IST

ఐపీఎల్ హిస్టరీలో ఒక్క కప్ కూడా లేకపోయినప్పటికీ భారీ క్రేజ్ ఉన్న జట్టు ఏదన్నా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అని చెప్పాలి. కొన్నాళ్ళు కింగ్ కోహ్లీ సారథ్యంలో నడిచిన ఈ జట్టుకి తన వల్లే ఎక్కువ క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు. అయితే ఈసారి కూడా కప్ కొట్టాలని వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు ఎంతవరకు ఆస్కారం ఉంది? వారి టీం బలాబలాలు ఏంటి? వారి స్క్వాడ్ లో ఎవరెవరు ఉన్నారు? ప్లే ఆఫ్స్ వరకు వెళ్లే స్కోప్ ఉందా లేదా అనేవి చూద్దాం.

RCB జట్టు – ఐపీఎల్ 2025

బ్యాట్స్‌మెన్:

విరాట్ కోహ్లీ
దేవదత్ పడిక్కల్
స్వస్తిక్ చికారా

ఆల్ రౌండర్లు:

లియామ్ లివింగ్‌స్టోన్
కృనాల్ పాండ్యా
టిమ్ డేవిడ్
జేకబ్ బెతెల్
రోమారియో షెపర్డ్
స్వప్నిల్ సింగ్
మనోజ్ భండాజే
మోహిత్ రాథీ

పేస్ బౌలర్లు:

జోష్ హేజిల్‌వుడ్
భువనేశ్వర్ కుమార్
రసిఖ్ సలాం దార్
యశ్ దయాల్
నువాన్ తుషారా
లుంగి ఎంగిడి
అభినందన్ సింగ్

స్పిన్ బౌలర్లు:

సుయాష్ శర్మ**

ఇలా ఆర్సీబీ జట్టు సభ్యులు ఉన్నారు. ఇక వీరిలో ఎవరెవరు ఎక్కువ ప్లస్ మైనస్ అనేవి కూడా చూద్దాం..

RCBకి బలాలు:

1. ఆర్సీబిలో మెయిన్ గా ఆల్ రౌండర్స్ ఎక్కువ ఉండడం విశేషం – లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ వంటి ఆల్-రౌండర్లు జట్టుకు బ్యాటింగ్ సహా బౌలింగ్ రెండిట్లో కూడా కీలక పాత్ర పోషించనున్నారు.

2. అనుభవం ఉన్న స్టార్ ప్లేయర్స్ – కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్ లాంటి ఆటగాళ్లతో RCBకు మంచి అనుభవం ఉంది. వీరి సారధ్యంలో జట్టు మరింత ముందుకు వెళ్లనుంది.

3. అలాగే బలమైన టాప్ ఆర్డర్ – కోహ్లీ, పడిక్కల్, ఫిల్ సాల్ట్ కలిసి పవర్ ప్లే నుంచే మంచి ఆరంభాన్ని అందించగలరు.

ఇక RCBలో లోపాలు విషయానికి వస్తే:

1. స్పిన్ బౌలింగ్ లోపం – ఆర్సీబీలో మెయిన్ గా స్పిన్నర్స్ లేకపోవడం అనేది పెద్ద లోపం అని చెప్పవచ్చు. ఐపీఎల్ లాంటి డాషింగ్ ఫార్మాట్ లో రన్స్ తక్కువ చేయాలి అంటే స్పిన్నర్లు అవసరం తప్పనిసరి కానీ ఈ జట్టుకి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు.

2. డెత్ ఓవర్ల బౌలింగ్ – గత సీజన్లలో RCB డెత్ బౌలింగ్ సమస్యగా మారింది. ఈ సారి తుషారా, ఎంగిడి, భువనేశ్వర్ పై చాలా ఆధారపడాల్సి వస్తుంది.

3. మిడిల్ ఆర్డర్ స్థిరత్వం – ఒకవేళ టాప్-ఆర్డర్ విఫలమైతే, మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా ఉంటూనే హిట్టింగ్ చేసే బ్యాట్సమెన్ లు కూడా ఆర్సీబీకి కరువయ్యారు.

గత సీజన్ కి ఇపుడు సీజన్ కి ఉన్న తేడాలు ఏంటి?

బ్యాటింగ్:

2024: కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌పై అధికంగా ఆధారపడింది.
2025: కొత్తగా ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్ జట్టులో చేరడం బ్యాటింగ్ లైనప్‌ను ఖచ్చితంగా బలోపేతం చేసింది.

బౌలింగ్:

2024: డెత్ బౌలింగ్ లోపం, స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేదు.
2025: భువనేశ్వర్, హేజిల్‌వుడ్, ఎంగిడి జట్టుకు చేరడం బౌలింగ్ విభాగాన్ని బలంగా చేరవచ్చు/.

ఈసారి సీజన్లో దాదాపు బరిలో దిగే టాప్ 11 ఆటగాళ్లు ఎవరంటే?

1. ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్)
2. విరాట్ కోహ్లీ
3. దేవదత్ పడిక్కల్
4. లియామ్ లివింగ్‌స్టోన్
5. టిమ్ డేవిడ్
6. జితేష్ శర్మ
7. కృనాల్ పాండ్యా
8. భువనేశ్వర్ కుమార్
9. జోష్ హేజిల్‌వుడ్
10. లుంగి ఎంగిడి
11. సుయాష్ శర్మ

ఇక ఫైనల్ గా RCB IPL 2025 విజయావకాశాలు:

ప్లేఆఫ్స్ చేరే అవకాశం – 70%
ఫైనల్ చేరే అవకాశం – 50%
టైటిల్ గెలిచే అవకాశం – 35%

ఇక మొత్తం మీద, 2025లో RCB జట్టు మెరుగుదల కనిపిస్తోంది. కానీ డెత్ బౌలింగ్ & స్పిన్ విభాగంలో మెరుగుదల అవసరం. ఈ మార్పులతో, ఈ సారి RCB టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు