ఈ ఓటిటిలోకి వచ్చేసిన “మన్యం ధీరుడు”

ఈ ఓటిటిలోకి వచ్చేసిన “మన్యం ధీరుడు”

Published on Mar 15, 2025 8:30 AM IST

రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన చిత్రం మన్యం ధీరుడు ఇపుడు ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్ వి వి మూవీస్ బ్యానర్ పై ఆర్ వి వి సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మన్యం ధీరుడు.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. .. ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో సినీ హబ్ గా విశాఖను మారుస్తామని దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశామని అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పారు. అలాగే అల్లూరి సీతారామరాజు పాత్ర చేసినటువంటి ఆర్ వి వి సత్యనారాయణ గారిని ఎంతగానో కొనియాడారు. ఇలాంటి చిత్రాలు ప్రస్తుత జనాలకి ఎంతైనా ఉపయోగకరమని ఇది కచ్చితంగా చూడదగ్గ సినిమా” అని చెప్పుకొచ్చారు.

అనంతరం నిర్మాత, హీరో ఆర్ వి వి సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం కత్తి యుద్ధం విలువిద్య లో శిక్షణ తీసుకున్నానని, ట్రెడిషర్లకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన విరోచిత పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని” తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు