IPL 2025: తొలి పోరులో బోణి కొట్టిన RCB

IPL 2025: తొలి పోరులో బోణి కొట్టిన RCB

Published on Mar 22, 2025 10:57 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 టోర్నీ ఎట్టకేలకు నేడు ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ గత సీజన్ విన్నర్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

ఇక బ్యాటింగ్‌కు దిగిన KKR నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్(44), అజింక్య రహానే(56), అంగ్‌క్రిష్ రఘువంశీ(30) పరుగులతో ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలర్లలో కృణాల్ పాండ్య 3 వికట్లు తీయగా, జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు, యష్ దయాల్, రసిక్ సలాం, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫిల్ సాల్ట్ (56), రజత్ పాటిదార్(34), విరాట్ కోహ్లీ (59) పరుగులతో 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన RCB లక్ష్యాన్ని చేధించారు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో లాస్ట్ సీజన్ విన్నర్‌పై కోల్‌కతాపై విజయాన్ని అందుకుని బెంగళూరు బోణి కొట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు