తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు అధిక్ రవిచంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ సంభవం మూవీలో అజిత్ కుమార్ వైవిధ్యమైన గెటప్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ వేరే లెవెల్ అనే విధంగా కట్ చేశారు. అజిత్ కుమార్ పలు విభిన్న లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇక ఆయన నుంచి ఎదురుచూసే యాక్షన్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ఈ ట్రైలర్‌లో సాంపిల్ మాత్రమే చూపెట్టారు. ఇలాంటి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం తామె వెయిట్ చేస్తున్నామని ఈ ట్రైలర్ చూసి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక భారీ క్యాస్టింగ్ నటిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. సిమ్రాన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం ప్యూర్ మాస్ ఫీస్ట్‌గా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమాతో అజిత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపడం ఖాయమని అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఏప్రిల్ 10న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి