ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేయనుండగా ఈ సినిమాల్లో దర్శకుడు అట్లీతో చేయనున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఆల్రెడీ అనధికారికంగా కన్ఫర్మ్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు బన్నీ బర్త్ డే కానుకగా అనౌన్స్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి బన్నీ అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న ఈ చిత్రం ఎలా అనౌన్స్ అవుతుంది ఏంటి అనేవి ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి రేపుతుండగా ఈ సినిమాపై అనౌన్సమెంట్ సాలిడ్ వీడియో కట్ తో రావచ్చని వినిపిస్తుంది.
అట్లీ మార్క్ స్టైలిష్ టేకింగ్ తో యానిమేటెడ్ తరహాలో కానీ ఓ స్పెషల్ వీడియోతో అందులో అనిరుద్ మ్యూజిక్ తో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మరి ఇలాంటి కలయికలో ప్రాజెక్ట్ అంటే సింపుల్ గా అనౌన్స్ చేసేస్తారు అంటే అనుమానమే అని చెప్పొచ్చు. డెఫినెట్ గా పాన్ ఇండియా ఆడియెన్స్ లో అటెన్షన్ అందుకునే రీతిలోనే అది ఉంటుంది. మరి చూడాలి ఈ కలయికలో అనౌన్సమెంట్ ఎలా ఉంటుందో చూడాలి.