ఇదీ ఎన్టీఆర్ రేంజ్.. హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇదీ ఎన్టీఆర్ రేంజ్.. హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Apr 5, 2025 10:08 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “వార్ 2” ఒకటని చెప్పాలి. అయితే ఈ చిత్రం కోసం నార్త్ నుంచి సౌత్ వరకు కూడా సెన్సేషనల్ హైప్ ఉంది.

మరి ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఎన్టీఆర్ పై హృతిక్ చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. హృతిక్ కి తన ఫేవరెట్ కో స్టార్ ఎవరు అంటే ఓ పబ్లిక్ ఈవెంట్ లో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పడం విశేషం. తాను ఇప్పుడు వరకు బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ తో కలిసి పని చేసినప్పటికీ ఎన్టీఆర్ పేరుని తాను చెప్పడం విశేషం.

అంటే ఈ లెక్కన తారక్ ఏ రేంజ్ లో హృతిక్ ని మెస్మరైజ్ చేసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. తారక్ టాలెంట్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితోనే తాను వార్ 2 చేస్తున్నపుడు ఎన్టీఆర్ ఒక ఫైనెస్ట్ కో స్టార్ అంటూ హృతిక్ చెప్పడం అనేది తారక్ అభిమానులకి మంచి బూస్టప్ గా మారింది. అలాగే వార్ 2 ఆగస్ట్ 14న వస్తుంది అని కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు