‘విశ్వంభర’ మౌనం కొనసాగింపు..

‘విశ్వంభర’ మౌనం కొనసాగింపు..

Published on Apr 6, 2025 5:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఉన్నారు కానీ ఈ సినిమా ఇపుడు ఎటూ తేలని విధంగా అభిమానుల్ని సందిగ్ధంలో పెట్టేసింది అని చెప్పాలి. అయితే ఈ మధ్యలో అయినా ఏదన్నా అప్డేట్ అసలు రిలీజ్ క్లారిటీ అయినా వస్తుందేమో అని ఎదురు చూసారు.

కానీ ఏది రాలేదు. అయితే ఇపుడు రామ నవమి సందర్భంగా అయినా కూడా ఏదన్నా చిన్న అప్డేట్ అయినా ఉండొచ్చేమో అని ఆశించారు కానీ మళ్ళీ విశ్వంభర నుంచి ఆ మౌనం అలానే కొనసాగుతుంది అని చెప్పక తప్పదు. మరి మేకర్స్ ఈ చిత్రం విషయంలో ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు. మరి ఇంకెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ మొదలవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు