నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ.. చిత్రబృందంతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్ కోసం తాను 10 కేజీల బరువు తగ్గాను అని, అలాగే స్టంట్స్ విషయంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్లాను అని ఆమె తెలిపారు.
కాగా ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘‘కర్తవ్యం’లో వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా’ అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.