మళయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఎంపురాన్” కోసం అందరికీ తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా నటించిన గత చిత్రం లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్ 2 – ఎంపురాన్ గా వచ్చిన ఈ సినిమా మళయాళ సినిమా దగ్గర రికార్డులు తిరగరాసింది.
అయితే ఇపుడు వరల్డ్ వైడ్ 11 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ 11 రోజుల్లోనే సెన్సేషనల్ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇలా ఎంపురాన్ కేవలం 11 రోజుల్లోపే ఏకంగా 250 కోట్ల గ్రాస్ ని దాటేసినట్టుగా వారు చెబుతున్నారు. దీనితో మళయాళ సినిమా దగ్గర ఎంపురాన్ ఫాస్టెస్ట్ రికార్డు సహా ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. మరి లాంగ్ రన్ లో ఈ మార్క్ 300 కోట్ల వరకు వెళుతుందా లేదా అనేది ఇపుడు వేచి చూడాలి.