సమీక్ష : లవ్ ఇడియట్స్ – బోరింగ్ ఇడియట్స్

సమీక్ష : లవ్ ఇడియట్స్ – బోరింగ్ ఇడియట్స్

Published on Jun 7, 2013 7:50 PM IST
Love-Idiots విడుదల తేదీ : 07 జూన్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5
దర్శకుడు : కె. రాఘవ రెడ్డి
నిర్మాత : జమాల్ పూర్ రాజేందర్
సంగీతం : విజయ్ బాలాజీ
నటీనటులు : శుభాష్ రాయల్, ఇషాక్, రామకృష్ణ, తమక్షి, సీమా అగర్వాల్, జియా ఖాన్…..


శ్రీ రామ విసువల్స్ బ్యానర్ పై నిర్మించిన ‘లవ్ ఇడియట్స్’ సినిమా ఈ రోజు ఆంద్రప్రదేశ్ అంతటా విడుదలైనది . ఈ సినిమాలో శుభాష్ రాయల్, ఇషాక్, రామకృష్ణ హీరోలుగా, తమక్షి, సీమా అగర్వాల్, జియా ఖాన్(న్యూ) హీరోయిన్స్ గా నటించారు. కె. రాఘవ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జమాల్ పూర్ రాజేందర్ నిర్మించాడు. ఈ సినిమాకి విజయ్ బాలాజీ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :

విక్కి, రోహిత్, సత్య లు ముగ్గురు కాలేజీ ప్రెండ్స్. అల్లరి చేస్తూ ఇంట్లోని వస్తువులను వారి తల్లిదండులకు తెలియకుండా అమ్మి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే అదే కాలేజీలో ప్రియ, కవిత, పూజలు కూడా చదువుతూ ఉంటారు. ఈ ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తారు దానికోసం వారిదగ్గర చెంప దెబ్బలు కూడా తింటారు. చివరికి వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అనుకోకుండా వారికి గొడవ జరుగుతుంది. దానితో వారు విడిపోతారు. వీరి కాలేజీ బయట ఒక చిలక జోస్యం చెప్పుకునే వాడు ఉంటాడు. అతని దగ్గరకు వెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు ఈ ముగ్గురు హీరోలు. అతను వారితో మెడ కింద పుట్టుమచ్చ ఉన్న ఆంటి వల్ల మీ అదృష్టం మారిపోతుందని చెప్పడంతో ఆమె కోసం వారు వెతుకుతూ ఉంటారు. చివరికి ఎలాగోలా ఆమెని పట్టుకొని ఆ ఆంటితో స్నేహం చేస్తారు.

కథ ఇలా సాగుతూ ఉండగా ఆంటి భర్త చనిపోవడం పోలీసులకు ఆమె ఈ ముగ్గురిపై అనుమానం వుందని చెప్పడంతో ఆ ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేస్తారు. అసలు ఏం జరిగింది? వారు నిజంగా ఈ హత్య చేశారా?లేదా? చివరికి వారు ఈ కేసు నుండి ఎలా భయటపడ్డారు? ఆమె భర్తని ఎవరు చంపారు? ఆమె ఈ ముగ్గురిపైనే ఎందుకు అనుమానం వుందని చెప్పింది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో కొంతమంది సీనియర్ నటుల నటన పరవాలేదనిపించింది. చివర్లో పోలీసు ఆఫీసర్ గా పోసాని కృష్ణ మురళి పాత్ర బాగుంది. పోసాని చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమని బాగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా కథలో అస్సలు పస లేదు. అన్ని లవ్ సినిమాల్లానే ఉంది. సినిమా మొదటి భాగం మొత్తం ఒకే కాలేజీలో ఒకే క్లాస్ లో ఎక్కువ భాగం చిత్రీకరించడం వల్ల సినిమా మొత్తం చాలా స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరగుతుందా అనేది ముందుగానే తెలుస్తుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ నటన బాగోలేదు. సినిమాలో వారు చెప్పే డైలాగ్స్ బట్టి పట్టి అప్పచెప్పినట్టుగా అనిపిస్తుంది. ఈ ముగ్గురు హీరోలు కలిసి చేసే పనులు చూసే ప్రేక్షకునికి చిరాకు పుట్టిస్తాయి. అంతేకాదు ఈ సినిమాలో మూతికి పూసుకున్న లిప్ స్టిక్ చూసి జోతిష్యం చెప్పడం చాలా విడ్డురంగా అనిపిస్తుంది.

ఈ సినిమాలో పాటలు, మ్యూజిక్ బాగోలేవు. పాటలను చూస్తున్నప్పుడు మద్యలో సౌండ్ ని మ్యూట్ చెయ్యడం, స్క్రీన్ పై వాళ్ళేమో స్టెప్పులు వేయడం అనే కాన్సెప్ట్ చాలా చిరాకు తెప్పిస్తుంది. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో అర్ధం కాదు. మరో వైపు సినిమాకి సంబంధం లేని కొన్ని సన్నివేశాలు ఎందుకు చిత్రీకరించాడో అనేది ఆయనకన్నా తెలుసో లేదో మరి. సినిమాలో కామెడీ అనేదే లేదు. సినిమాకి సరైన ప్రారంభం లేదు అలాగని ముగింపు ఉందనుకునేరు అది అసలే లేదు.

సాంకేతిక విభాగం:

ఈ సినిమా కథలో కొత్తదనం ఏమి లేదు. స్క్రీన్ ప్లే చాలా చెత్తగా ఉంది. పాటలు బాలేవు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగోలేదు. ఎడిటింగ్ సరిగా చేయలేదు. కొన్ని అవసరం లేని సన్నివేశాలు వున్నాయి. సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ సినిమా దర్శకత్వ భాద్యతలు చేపట్టిన కె. రాఘవ రెడ్డి కేవలం సింగల్ డిజిట్ మ,మార్క్స్ మాత్రమే సంపాదించుకున్నాడు. ఈ సినిమాకి కథ, డైలాగ్స్ అందించి, నిర్మించిన జమాల్ పూర్ రాజేందర్ ఏ ఒక్క విభాగానికి న్యాయం చేయలేకపోయడు.

తీర్పు :

ఈ సినిమాకి లవ్ ఇడియట్స్ అబ్నే టైటిల్ కంటే టార్చర్ ఇడియట్స్ అనే టైటిల్ పెడితే పర్ఫెక్ట్ గా సరిపోయేది. పోసాని పాత్ర తప్ప సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన, డైలాగ్స్ ఇలా ఒకటేంటి అన్నీ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. సాద్యమైనంత వరకు ఈ సినిమాకి దూరంగా ఉండటమే మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5

నగేష్ మేకల

సంబంధిత సమాచారం

తాజా వార్తలు