ప్రత్యేక ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – టాలీవుడ్ తో ప్రేమలో పడిపోయాను..

ప్రత్యేక ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – టాలీవుడ్ తో ప్రేమలో పడిపోయాను..

Published on Nov 8, 2013 6:00 AM IST

Rahul-Ravindran
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకోకపోయినా రాహుల్ మాత్రం తన లుక్స్ తో పేరు తెచ్చుకున్నాడు. రాహుల్ హీరోగా నటించిన ‘నేనేం చిన్నపిల్లనా’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాహుల్ టాలీవుడ్ మరియు హైదరాబాద్ తో ప్రేమలో పడిపోయానని అంటున్నాడు. చాలా సాఫ్ట్ గా మాట్లాడే రాహుల్ ప్రత్యేకంగా మాతో పంచుకున్న విశేషాలు మీకోసం అందిస్తున్నాం..

ప్రశ్న) ‘అందాల రాక్షసి’ నుంచి ‘నేనేం చిన్నపిల్లనా.?’ వరకూ మీ జర్నీ ఎలా ఉంది?

స) జర్నీ సూపర్బ్ గా ఉంది. నాకు ఈ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఇక్కడి వారు స్థాయితో సంబందం లేకుండా నటీనటులని బాగా గౌరవిస్తారు. అందాల రాక్షసి సినిమా నాకొక గుర్తింపు ఇచ్చింది, అలాగే ఆ సినిమా మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది. ఇక్కడే నా అదృష్టాన్ని పరీక్షించుకొని గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను హైదరాబాద్ సిటీతో ప్రేమలో పడ్డాను. నేను దీన్నే నా బేస్ గా చేసుకోవాలని చూస్తున్నాను.

ప్రశ్న) మీరు మీ కెరీర్ ప్రారంభంలోనే శ్రేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో చేస్తున్నారు..

స) అవునండి, ఆ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పుకోవాలి. సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో ఉంది. ఈ సంవత్సరంతో సురేష్ ప్రొడక్షన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం నాకు మరియు నేనేం చిన్నపిల్లనా సినిమాకి ఎంతో స్పెషల్ అని చెప్పాలి. నా తల్లి తండుల ప్రేమ వల్లే నాకు ఇలా చాలా సినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థలో సినిమాలు చేసే అవకాశం వస్తోంది.

ప్రశ్న) అసలు ఈ సినిమా ఏలా మొదలైంది?

స) రైటర్ రమణి గారు ఈ కథని డా. రామానాయుడు గారికి చెప్పారు. ఆయనకీ కథ నచ్చడంతో, టీం ని సెలెక్ట్ చెయ్యడం మొదలు పెట్టారు. ముందుగా డైరెక్టర్, సాంకేతిక నిపుణులను ఎంచుకున్నారు. రామానాయుడు గారు నేను చేసిన అందాల రాక్షసి సినిమా చూసారు. ఆయనకి నా నటన నచ్చడంతో నా గురించి తెలుసుకోవాలని అందాల రాక్షసి సినిమా నిర్మాతకి కాల్ చేసి కనుక్కుంటే ఆయన నా గురించి మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత నన్ను కాల్ చేసి పిలిపించారు. ఆలా సినిమా ఓకే అయ్యింది. రేపు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇలాంటి ఓ సంస్థతో పనిచేయడం చాలా ఆనదంగా ఉంది. చెప్పాలంటే నా కెరీర్ లో ఇదొక మంచి స్టెప్ అని చెప్పాలి.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి ఏం చెబుతారు?

స) ఈ సినిమాలో నేను క్రిష్ అనే పాత్రలో కనిపిస్తాను. నేను అందాల రాక్షసిలో చేసిన పాత్రకి పూర్తి విరుద్దంగా ఈ పాత్ర ఉంటుంది. ఆ సినిమా సమయంలో హను నన్ను చందమామలా ఉండమన్నాడు. నేను లావణ్య నుంచి వచ్చే అన్ని ఎమోషన్స్ కి నా కళ్ళతోనే భావాలను పలికించాలి. ఈ సినిమాలో నేను ఎక్కువగా మాట్లాడతాను. క్రిష్ అనే అతను అతను మనసు ఎం చెబుతుందో అదే నమ్ముతాడు. ‘యూరప్ లో ఒంటరిగా బతుకుతున్న ఓ అబ్బాయి కథ’. అతనికి ఫుల్ టైం జాబ్స్ అంటే నమ్మకం ఉండదు. అతని రోజుకి 100 యూరోలు వస్తే చాలు, ఇంకేం ఆవాసం లేదు. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో సినిమా విషయంలో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీ సినిమాలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయా?

స) మా సినిమాలో కూడా కొన్ని స్పెషల్ కామెడీ సీన్స్ ఉన్నాయి. కానీ సినిమాలో ఉన్న పాత్రల్లోనే చాలా కామెడీ ఉంటుంది. సినిమా సెకండాఫ్ లో అలీ, ఎల్బీ శ్రీ రామ్ లాంటి చాలా మంది సీనియర్ నటులు కనిపిస్తారు. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా ఉండే రామానాయుడు గారి సినిమా ఇది.

ప్రశ్న) ఎప్పుడైతే పెద్ద నిర్మాణ సంస్థలతో పనిచేస్తామో అప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది కదా?

స) తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాల్సిన ఒక మంచి విషయం ఏమిటంటే అది చిన్న బడ్జెట్ సినిమానా లేక భారీ బడ్జెట్ సినిమానా అనే తేడా లేకుండా స్టార్స్ ని ట్రీట్ చేస్తారు. ఆ గౌరవమే నటీనటులకు ఓ ప్లేస్ ని ఇస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ అంటే వారికి అన్నీ తెలుసు. వారికి ఏ పని ఎలా చేసుకోవాలో తెలుసు. ఉదాహరణకి లోకేషన్స్ కి సంబందించిన అనుమతులు, అలాగే కావాల్సిన ఎక్విప్ మెంట్స్ గురించి బాగా తెలుసు. మరో అడ్వాంటేజ్ ఏమిటంటే భారీగా పబ్లిసిటీ మరియు భారీగా సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నా లాంటి స్టార్ కి ఇది చాలా కీలకం.

ప్రశ్న) మీ కో స్టార్ అయినటువంటి తన్వి వ్యాస్ గురించి చెప్పండి?

స) తన్వి వ్యాస్ ఒకప్పటి మిస్ ఇండియా. ఆమెకి ఎంతో అనుభవం ఉండడం వల్ల ఆమె నర్వస్ కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఆ అమ్మాయికి ఆత్మ విశ్వాసం ఎక్కువ. ఆమె దేన్నైనా నేర్చుకొని చేసేయ్యగలదు. ఈ సినిమాలో ఆమె ఓ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఆ అమ్మాయి తన చదువు కోసం స్వీడన్ కి వస్తుంది. ఆమెకి నా ఫ్రీడం అంటే అసూయ, నాకేమో తన ఉమ్మడి కుటుంబం అంటే అసూయ. సెకండాఫ్ లో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది.

ప్రశ్న) మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. దానికోసం ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా?

స) ఆ మాట అన్నందుకు థాంక్స్.. నేను తెలుగు నేర్చుకోవడానికి బాగా కష్టపడ్డాను. సెట్ లో అందరితో మాట్లాడాలి అంటే తెలుగులోనే మాట్లాడాలి అని అర్థం చేసుకున్నాను. ఒకవేల నేను ఏమన్నా తప్పు మాట్లాడితే కరెక్ట్ చేసుకునేదానికి అదే సరైన అవకాశం అనిపించింది. అలాగే తెలుగు భాష అర్థం చేసుకోవడానికి ఎన్ని కుదిరితే అన్ని తెలుగు సినిమాలు చూస్తాను. నేను చిన్నప్పుడు ఇలానే హిందీ నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు కూడా అదే ఫార్ములాని ఉపయోగిస్తున్నాను. నేను ఇదే ఇండస్ట్రీలో ఉండిపోవాలనుకుంటున్నాను కావున నాకు తెలుగు కచ్చితంగా రావాలి.

ప్రశ్న) చూసుకుంటే మీరు వరుసగా రొమాంటిక్ సినిమాలే చేస్తున్నారు. అది కంఫర్టబుల్ జోన్ అని అనుకోవచ్చా?

స) నేను బాగా పేరున్న హీరోని కాదు. నేను నా ప్రతి సినిమాలతో అన్ని రకాల ప్రేక్షకులని రీచ్ అవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా కున్న కెరీర్లో నేను నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోలేను. నేను చాల వరకూ నాకేమి ఆఫర్స్ వస్తున్నాయో అవే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాకే నాకు కంఫర్టబుల్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. అందాల రాక్షసి సినిమా తర్వాత నాకు అలాంటి పాత్రలే చాలా వచ్చాయి కానీ నేను అవి చేయకపోవడంతో నాకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదనుకున్నారు.

అప్పుడు నేను నాకు సరిపోతాయి అనుకున్న కొన్ని సినిమాలు చేయడం మొదలు పెట్టాను. నాకు వీలైనంత వరకూ కొత్త కొత్త పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అందాల రాక్షసి సినిమాలో పాత్రకి ఈ సినిమాలో పాత్రకి చాలా వ్యత్యాసం ఉంది. త్వరలోనే అందరి మదిలో ఉన్న ఆ ఐడియా కూడా తొలగిపోయి పూర్తి లవ్ స్టొరీ లేని సినిమాలు వస్తాయి.

ప్రశ్న) మీకు స్ఫూర్తి దాయకంగా అనిపించినా నటుడు ఎవరు?

స) తెలుగు స్టార్స్ ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంది, అది వారికి వచ్చే అవకాశాల్ని బట్టి వాడుకుంటున్నారు. నేను వారందరి నుంచి నేర్చుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఆన్న అందరి నటుల్లో నాకు పాల్ న్యూమాన్ అంటే చాలా ఇష్టం. ఆయన ఒక స్టార్ లాగా ఒక యాక్టర్ లాగా తన కెరీర్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసారు.

ప్రశ్న) మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు?

స) గత నాలుగు నెలలుగా నేను చాలా బిజీ గా ఉన్నాను. నాకు కాస్త కూడా ఫ్రీ టైం లేదు. నాకు ఫ్రీ టైం దొరికితే ఫ్యామిలీ తో ఉంటాను. హైదరాబాద్ లో సోపర్బ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, నాకు బయట ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. అలాగే సినిమా అంటే నా అల్ టైం చాయిస్.

ప్రశ్న) పెళ్లి ఫిబ్రవరిలో జరగనుందా? చిన్మయి గురించి ఏమన్నా చెప్పండి?

స) అవును పెళ్లి ఫిబ్రవరిలో ఉంటుంది. నాకు చిన్మయి మొదట సింగర్ గా తెలుసు నేను తనకి అభిమానిని. ఇక్కడ తెలుసుకోక్వాల్సిన మరో విషయం ఏమిటంటే తను నా లైఫ్ పార్టనర్. మేమిద్దరం అందాల రాక్షసి సినిమా వల్ల కలిసాం. వేరే వేరే సందర్భాలు ఉన్నప్పటికీ అందాల రాక్షసి టైం చాలా స్పెషల్. చిన్మయి చాలా టాలెంట్ ఉన్న లవ్లీ పర్సన్.

ప్రశ్న) మీరు మొదటి సారి పేరున్న దర్శకుడితో పనిచేసారు. ఆ అనుభవం ఎలా ఉంది?

స) మీరన్నది నిజం. అతను చాలా కామ్ గా ఉండే డైరెక్టర్. తొందరగా సీరియస్ అవ్వరు. అదంతా అనుభవం వల్లే వస్తుందనుకుంటా.. ఆయన మొదటిసారి తన కంఫర్ట్ జోన్ వదిలేసి ఫ్యామిలీ డ్రామా చేసారు. మేమిద్దరం ఇద్దరికీ ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి వీక్ నెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఒక డైరెక్టర్ గా మీరు అవార్డ్స్ అందుకోవడానికి, విమర్శకుల ప్రశంశలు అందుకోవడానికి అది బాగా హేల్ప్ అవుతుంది.

ప్రశ్న) ‘నేనేం చిన్నపిల్లనా?’ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చు?

స) ఈ సినిమాని స్పెషల్ గా కొంతమంది ప్రేక్షకులని టార్గెట్ చేసుకొని తీసారు. ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైంది క్లైమాక్స్. ఒక ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత హ్యాపీ ముగింపు ఉంటుంది. ఈ సినిమా కథ చాలా స్ట్రాంగ్, ఎంఎం శ్రీలేఖ మంచి మ్యూజిక్ అందించారు. అది సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించాం. చాలా సాఫ్ట్ గా మాట్లాడే రాహుల్ రవీంద్రన్ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.

ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు