పంజా విలన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ

పంజా విలన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ

Published on Dec 9, 2011 12:24 AM IST

అడివి శేష్ పంజా సినిమాలో ఒక కీలకమైన విలన్ మున్నా అనే పాత్రలో నటిస్తున్నారు. తన మొదటి సినిమా ‘కర్మ’ తో విలక్షణమైన ప్రతిభావంతుడైన నటుడిగా ిరూపించుకున్నాడు. అతను 123తెలుగు.కాం తో ప్రత్యేకంగా ముచ్చటించారు.అతను చెప్పిన మాటలు మీకోసం.

ప్ర: సినిమాల్లోకి రావడం మీ చిరకాల కోరికా?
మా కుటుంబ అంత కళా పోషకులతో నిండి ఉంది. నన్ను నేను నిరూపించుకోవడానికి సినిమాలే సరైన దారి అనుకున్నాను. సినిమా మేకింగ్ కి సంబందించిన కోర్సులు నేర్చుకోవడానికి అమెరికా వెళ్ళడం జరిగింది.

ప్ర: పంజా లో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు?
స: నా పాత్ర పేరు మున్నా. సినిమాలో నెగటివ్ పాత్ర. పవన్ కళ్యాణ్, జాకీ ష్రాఫ్ మరియు అంజలి లవనియా లతో సన్నివేశాలలో నటించాను. నా పాత్రను విషు వర్ధన్ గారు అధ్బుతంగా మలిచారు.

ప్ర: మీరు ఎన్నారై అయి ఉంది హీరో గా రంగ ప్రవేశం చేసి, ఇప్పుడు పంజాలో విలన్ పాత్ర పోషించడానికి గల కారణం?
స: నేను హీరోగా మొదటి సినిమా చేసాక కొన్ని రొమాంటిక్ సినిమాల్లో హీరోగా చేయమని చాల ఒఫ్ఫార్లు వచ్చాయి. వాటిలో ఆకర్షించే అంశాలేమి లేక అంగీకరించలేదు. నేను విభిన్నంగా ఉండే పత్రాలు ఇష్టపడతాను. అలంటి సమయంలో నాకు నీలిమ (ఈ చిత్ర నిర్మాత) గారి ఆఫీసు నుండి పిలుపు వచ్చింది. తర్వాత స్క్రిప్ట్ వివరించారు. విష్ణు వర్ధన్ గారు
నేను నటించిన కర్మ చిత్రం చూసి మాకు మున్నా పాత్ర చేయమని కోరారు. నేను వెంటనే అంగీకించడం జరిగింది.

ప్ర: పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం మీకెలా అనిపించింది?
స: మొదట్లో ఆయనతో పనిచేసేప్పుడు నెర్వస్ గా ఫీల్ అయ్యే వాడిని. ఆయన చ్చల నిజాయితీ గల మనిషి. అందుకే అయన అంత పెద్ద స్టార్ అయ్యారు. చాలా సింపుల్ గా ఉంటారు. పెద్ద స్టార్ హీరో ని అన్న గర్వం ఉండదు. ఈ సినిమాలో మా మద్య రసవత్తరమైన సన్నివేశాలున్నాయి.

ప్ర: పంజా చిత్రాన్ని స్టైలిష్ గా క్లాస్ గా తీసారు, సాధారణ ప్రెక్శకుదుఇ ఈ సినిమా అర్ధమవుతుందని అనుకుంటున్నారా?
స: ఖచ్చితంగా అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి అన్ని రకాల ప్రేక్షకుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎ సెంటర్ ప్రేక్షకుడికైనా అయిన సి సెంటర్ ప్రేక్షకుడికైనా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాడు. వారికీ వివిధ రకాల అంచనాలు ఉంది ఉండవచ్చు మేము అంచనాలను అందుకుంటాం. అమెరికాలో ఉండే మా నాన్న గారు సి సెంటర్ ప్రేక్షకులకు నచ్చే మాస్ సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తారు.

ప్ర: పంజా దర్శకుడు విష్ణు వర్ధన్ తో పని చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఫీలయ్యారా?
స: అలాంటిదేమీ లేదు. తనకు కావాల్సింది నటుల నుండి రాబట్టుకుంటాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. అతనితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.

ప్ర: మీరు భవిషత్తులో కూడా నెగటివ్ పాత్రలే చేయాలనుకుంటున్నారా?
స: నా పాత్రను విభిన్నంగా మలిచి, స్క్రిప్ట్ లో పాత్ర కి ఇంపార్టెన్స్ ఉంటె తప్పకుండా చేస్తా.

ప్ర: మీ భవిష్యత్ లో చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి?
స: త్వరలో ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్న. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా చేయడానికి అంగీకరించింది. ఇంకా స్క్రిప్ట్ పూర్తి కాలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాము. మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం అవుతుంది. మా అన్నయ్య డైరెక్షన్ చేయబోయే చిత్రంలో కూడా ఒక చిత్రం చేయబోతున్నాను.

ప్ర: ఇక్కడే ఉండాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా?
స: నేను చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను. మొదట్లో ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండే వారు కాదు. మెల్లి మెల్లిగా ఇక్కడ మనుషులతో అలవాటు పడుతున్నాను. చాలా మంచి సినిమాలు చేయాలనీ అనుకుంటున్నాను అందుకే ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాను.

ప్ర: ఇండస్ట్రీలో మీకు నచ్చే నటులు ఎవరు?
స: నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంకా మహేష్ బాబు గారి టైమింగ్ బాగా నచ్చుతుంది.

ప్ర: పంజా సినిమా గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?
స: తప్పకుండా మంచి ఎంటర్ టైన్మెంట్ చిత్రం అవుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అధ్బుతమైన టెక్నికల్ వాల్యూస్ మరియు సినిమాటోగ్రఫీ చాలా బావుంటుంది. మీరు ఈ సినిమాలో కొత్త కెమెరా యాంగిల్స్ చూస్తారు. ప్రతి ఫేం డిఫరెంట్ గా ఉంటుంది.

ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ముగిసింది. ఆయన నటించిన పంజా చిత్రం విజయం సాధించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు