ఇంటర్వ్యూ : ఓ మంచి అనుభూతినిచ్చే సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ – హీరోయిన్ మాళవిక నాయర్

ఇంటర్వ్యూ : ఓ మంచి అనుభూతినిచ్చే సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ – హీరోయిన్ మాళవిక నాయర్

Published on Mar 13, 2023 10:42 PM IST

నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో హీరోయిన్స్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలపై తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ కమ్ ఎమోషనల్ స్టోరీ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఈమూవీ సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక నాయర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ అనుభవాలను మీడియాతో ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు.

 

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రయాణం ఎలా ఉంది?

ట్రైలర్ మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. నటిగా నేను ఎవరనేది చూపించే సినిమా ఇది. ఇప్పటిదాకా నటిగా ఏం చేయాలో అంతవరకే చేశాను. కానీ ఇది అన్ని విభాగాల పరంగా నాకు దగ్గరైన సినిమా. శ్రీనివాస్ గారి లాంటి ప్రతిభగల దర్శకుడితో పని చేయడం సంతోషం కలిగించింది. ఆయన అమెరికా వెళ్లి ఎంతో సాంకేతిక నేర్చుకొని ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాలు చేయడం అభినందించదగ్గ విషయం. ఆయనకు భాషపై మంచి పట్టు, గౌరవం ఉన్నాయి. ఆయన వల్లే నా తెలుగు మెరుగుపడింది.

 

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కథ ఎలా ఉండబోతోంది?

మామూలుగా ప్రేమ కథలు రెండు మూడేళ్ళ వ్యవధిలో జరిగినట్లు చూపిస్తుంటారు. అయితే ఇందులో 18 నుంచి 28 ఏళ్ల వరకు ప్రయాణం చూపిస్తారు. మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. వయసును బట్టి నాగ శౌర్య పాత్ర తాలూకు వైవిధ్యాన్ని చక్కగా చూపించారు. నేను కూడా నా పాత్రకు పూర్తి న్యాయం చేశానని భావిస్తున్నాను. యాక్టర్స్ అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

 

ఈ సినిమా కథ మీ నిజ జీవితానికి దగ్గరగా ఏమైనా ఉందా?

నేను పోషించిన అనుపమ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఏముండదు. నాగ శౌర్య పోషించిన సంజయ్ పాత్ర మాత్రం కాస్త దగ్గరగా ఉంటుంది. అయితే పాత్రలు, సన్నివేశాలు సహజంగా నిజ జీవితంలో మనకు ఎదురైనట్లుగా ఉంటాయి. ప్రతి పాత్ర ఆడియన్స్ మదిని తాకుతుంది. మంచి సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది.

 

నాగశౌర్య గారు ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు.. ఈ సినిమా రీమేక్ చేసినా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేరు అన్నారు.. అంతలా సినిమాలో ఏముంది?

అలా ఎందుకు అన్నారో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. షూటింగ్ సమయంలో అసలు అక్కడ ఎలాంటి మ్యాజిక్ జరుగుతుంది అనేది దర్శకుడికి, డీఓపీకి, నటీనటులకు అర్థమవుతుంది. ఆ నమ్మకంతోనే శౌర్య అలా అని ఉంటారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. తన డెడికేషన్ కి హ్యాట్సాఫ్, కంటెంట్ తో పాటు క్యారెక్టర్స్ కూడ ఆకట్టుకునే మూవీ ఇది.

 

ఇది రెగ్యులర్ సినిమానా? ప్రయోగాత్మక సినిమానా?

ప్రయోగమే. రెగ్యులర్ సినిమా అనలేను. అలా అని మనకి తెలియని భావోద్వేగాలు కాదు. చూస్తున్నంత సేపు ఓ మంచి అనుభూతి కలుగుతుంది. ప్రయోగమైనా ఆకట్టుకునే కథ, కథనాలు ఉన్నాయి.

 

ఈ సినిమా పరంగా నటిగా మీరు సంతృప్తి చెందారా?

నటిగా చాలా సంతృప్తిగా ఉంది. 18 నుంచి 28 ఏళ్లు. ఈ పదేళ్ల ప్రయాణంలో మనలో ఎన్నో మార్పులు వస్తాయి, మన ఆలోచనా విధానం మారుతుంది. మన భావోద్వేగాలు మారుతుంటాయి. అందుకే నా పాత్రలో నటనకి ఎంతో ఆస్కారం ఉంది. అన్ని విధాలుగా సంతృప్తి చెందాద్మతో పాటు సక్సెస్ పై కూడా విశ్వాసం ఉంది.

 

నాగశౌర్య గురించి చెప్పండి?

నటుడు నాగశౌర్య తన చుట్టూ ఉన్నవాళ్లు ఆనందంగా ఉండాలి అనుకుంటారు. ఎవరైనా బాధగా ఉంటే వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేస్తారు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. షూటింగ్ సమయంలో ప్రతి షాట్ అవ్వగానే ఎలా చేశాను, ఇంకా ఏమైనా చేయాలా అని దర్శకుడు శ్రీనివాస్ గారిని అడుగుతుంటారు. ప్రతి సన్నివేశం చక్కగా రావాలని ఎంతో జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేస్తారు.

 

ఈ సినిమాలో ముద్దు సన్నివేశానికి మీరు అభ్యంతరం చెప్పలేదా?

అది నాకు ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సన్నివేశం కాదు. కథలో భాగమైన, కథకి అవసరమైన సన్నివేశం. కాబట్టి కథకి తగ్గట్లుగా అవసరం అయినపుడు తప్పదు.

 

నటిగా ప్రతిభ ఉన్నా, విజయాలు ఉన్నా.. మీకు అనుకున్న స్టార్డమ్ రాలేదనే అభిప్రాయముందా?

అలా ఏం ఆలోచించలేదు. నటిగా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి పాత్రలే చేయాలి అనుకోవట్లేదు. కథ, పాత్ర నచ్చితే అన్ని జోనర్లలో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటివరకు వచ్చినవి సంతృప్తినిచ్చాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను.

 

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల గురించి చెప్పండి?

ఆయన చాలా సరదాగా ఉంటారు. ఏమున్నా మనసుని నొప్పించకుండా ముఖం మీదే సున్నితంగా చెప్పేస్తారు. ఆయన నటీనటుల మ్యానరిజమ్స్ మీద దృష్టి పెట్టరు. ఎమోషన్స్ రాబట్టుకోవడం మీద దృష్టి పెడతారు. సరదాగా ఉన్నా కూడా వర్క్ పట్ల ఆయనకు మంచి డెడికేషన్ ఉంది. అందుకే కెరీర్ పరంగా ఆయనకి మరింత మంచి భవిష్యత్తు ఉందని నేను నమ్ముతున్నాను.

 

సినిమా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి?

వివేక్ గారితో ఇది నాకు రెండో సినిమా. చాలా కూల్ గా, కామ్ గా ఉంటారు. ధమాకా లాంటి ఘన విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ నాలుగేళ్లలో శ్రీనివాస్ గారికి నిర్మాతలు విశ్వప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. కోవిడ్ సమయంలో మా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందరూ సినిమా కోసం పడ్డ కష్టాన్ని రేపు తెరమీద ఆడియన్స్ ఆదరిస్తారని అనుకుంటున్నాం.

 

కళ్యాణి మాలిక్ గారి సంగీతం గురించి?

కళ్యాణి మాలిక్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అన్ని పాటలు ఉన్నాయి. అందరికీ కనుక చాటు మేఘమా పాట బాగా నచ్చింది. నాకు నీతో సాంగ్ ఇంకా ఎక్కువ నచ్చింది. మనసుని తాకే సంగీతం, బీజీఎమ్ సినిమాలో ఉన్నాయి.

 

కళ్యాణి మాలిక్ గారి సోదరుడు కీరవాణి గారికి ఆస్కార్ గెలుచుకోవడంపై మీ స్పందన?

ఇది చాలా గర్వించదగ్గ విషయం. మన ఇండియన్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ మొదటి నుండి పడ్డ కష్టానికి తగ్గ ఫలితం లభించింది.

 

నెక్స్ట్ సినిమాలు ?

అన్నీ మంచి శకునములే, డెవిల్ సినిమాలు చేస్తున్నాను. ఆపైన ఏమైనా ఓకె అయితే తప్పకుండా చెప్తాను.

థాంక్యూ ఆల్ ది బెస్ట్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు