ఇంటర్వ్యూ: బలమెవ్వడు చాలా అంశాలపై తీసిన సినిమా – హీరోయిన్ నియా త్రిపాఠి

ఇంటర్వ్యూ: బలమెవ్వడు చాలా అంశాలపై తీసిన సినిమా – హీరోయిన్ నియా త్రిపాఠి

Published on Sep 30, 2022 10:00 AM IST

ట్రైలర్ విడుదల తరువాత ప్రేక్షకుల నుండి ఎంతగానో ఆదరణ పొందింది బలమెవ్వడు సినిమా ట్రైలర్. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న నియా త్రిపాఠి, తన నటన మరియు డాన్స్ ద్వారా అందరిని మెప్పించేందుకు సిద్ధంగా ఉంది. మోడలింగ్ చేసి, డాన్సర్ గా ట్రైనింగ్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ, సినిమా పట్ల తనకున్న ప్రేమ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మరియు డాన్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ ను మనతో పంచుకున్నారు.

 

బలమెవ్వడు సినిమా దేని గురించి, అందులో మీ పాత్ర ఏమిటి?

బలమెవ్వడు చాలా అంశాలపై తీసిన సినిమా. అందులో ముఖ్యంగా ఒకటి మెడికల్ మాఫియా. ప్రధానంగా కోవిడ్ సమయంలో, మందులు ఎలా అందుబాటులో లేవు మరియు మందులు పొందడానికి ప్రజలు భారీగా డబ్బు చెల్లించడం వంటి అనేక విషయాలను మీరు చూశారు. కాబట్టి ఈ సినిమా అంతా దాని గురించి మనకి క్లియర్ గా చూపిస్తుంది. వైద్య పరిశ్రమ లోని మంచి మరియు చెడు రెండు ఉన్నాయి అని మీకు తెలిసు కదా. అంతేకాదు ఈ సినిమా స్వచ్ఛమైన మరియు అందమైన ప్రేమకథను కూడా మీకు అందిస్తుంది. ఈ సినిమా చూసిన వారిని తప్పకుండా నిరాశపరచదు. నేను పరిణిక అనే పాత్రలో నటిస్తున్నా. పరిణిక చాలా మెచ్యూర్డ్ అమ్మాయి. తన లైఫ్ లో తను ఒక పెద్ద ఫైటర్. సినిమాలో ఆమెకు క్యాన్సర్ ఉంటుంది, మరి అలాంటి అమ్మాయి మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతుంది అనే దానితో ఈ చిత్రం వ్యవహరిస్తుంది. ఈ క్యారెక్టర్ తో నన్ను నేను రుజువు చేసుకోగలను అని అనుకుంటున్నాను.

 

మీకు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?

ముంబై లో మోడలింగ్ కెరీర్ తర్వాత నేను హైదరాబాద్‌ లో కొద్దిరోజులు ఉన్నాను. ఆ టైంలో నేను ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. కాస్టింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ గారు నా ప్రొఫైల్‌ని డైరెక్టర్ సర్ మరియు టీమ్‌కి పంపారు. అప్పుడు డైరెక్టర్ సార్ నన్ను పిలిచి సినిమాలోని ఓ సీన్ రిహార్సల్ చేసి పంపమన్నారు. ఆ సీన్ సార్ కి బాగా నచ్చింది అలా నాకు సినిమాలో అవకాశం వచ్చింది.

 

ఈ సినిమాలో పని చేయడం మీకు ఎలా అనిపించింది?

నా తొలి సినిమా కాబట్టి నటిగా నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ సార్ వల్ల నేను నటనలో చాలా నేర్చుకున్నా. ఈ క్రమంలో నా బలం, బలహీనత నాకు తెలిశాయి. నాకు ఈ సినిమా చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.

 

ఇంతకు ముందు ఏదైనా సినిమాల్లోనటించారా? మీ కెరీర్ గురించి చెప్పండి.

లేదు, నేను ఏ సినిమాలోనూ నటించలేదు. ఇది నా తొలి సినిమా. కానీ నేను కొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను, వాటి గురించి ఇప్పుడు చెప్పలేను. ఆ ప్రాజెక్ట్స్ బయటకు వచ్చిన తర్వాత నేను దాని గురించి చర్చించగలను. అయితే నేను హిందీలో కూడా పని చేస్తున్నాను. నేను హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది త్వరలో ప్రకటించ బడుతుంది. నేను మోడలింగ్ నుండి నా కెరీర్ ప్రారంభించాను. కాబట్టి నేను మలబార్ గోల్డ్ మరియు సంతూర్ ప్రకటనల కోసం పనిచేశాను.

 

మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీరు ఏమి చదువుకున్నారు?

మాది మధ్యప్రదేశ్. ప్రస్తుతం నేను ముంబైలో ఉంటున్నాను. చదువు విషయానికి వస్తే, నేను ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ చేసాను, ఆపై నేను బెంగళూరు లో ఎంబీఏ లో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో చేసాను. కానీ ఆఖరికి నటిగా సెటిల్ అయ్యా.

 

మీరు తెలుగు సినిమాలు చూస్తారా? మీకు ఇక్కడ ఎవరంటే ఇష్టం?

హీరో అల్లు అర్జున్ సార్ అండ్ విజయ్ దేవరకొండ. హీరోయిన్, నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం, సమంత కూడా ఇష్టం. సినిమాల్లో వాళ్ల పెర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో నాకు నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.

 

సినిమాలో ఛాలెంజింగ్ పార్ట్ ఏది? మీరు దానిని ఎలా అధిగమించారు?

ఈ సినిమాలో ఛాలెంజింగ్ పార్ట్ క్యాన్సర్ పేషెంట్‌గా నటించడం. ఎందుకంటే కాన్సర్ పేషంట్ గా నటించేటప్పుడు మనము చాలా ఎమోషన్స్‌ను అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ పాత్ర కోసం, నా కెరీర్ ప్రారంభంలోనే, దర్శకుడు సార్ నన్ను క్యాన్సర్ పేషెంట్ రోల్‌ కోసం నన్ను గుండు కొట్టుకోమన్నారు. దానికి నేను కూడా అంగీకరించాను. కానీ కంటిన్యూటీ సమస్య కారణంగా మళ్లీ డైరెక్టర్ సార్ మేకప్‌తో వెళ్తామని చెప్పాడు. కాబట్టి నాకు గుండె కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఆ మేకప్ తో నన్ను నేను చూసుకున్నప్పుడు, జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కానీ ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు రన్ అయ్యాయి. అసలు క్యాన్సర్ పేషెంట్లు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు మరియు వారు ఎంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు అని నేను ఆలోచించాను. నాకు, పాత్రలోకి ప్రవేశించడం, ఈ ఆలోచనల ద్వారా వెళ్లడం, భావోద్వేగాలను అనుభవించడం చాలా సవాలుగా అనిపించింది.

 

మీకేమైనా ప్రత్యేకమైన హాబీలు ఉన్నాయా?

నాకు చాలా హాబీలు ఉన్నాయి. కానీ నాకు చాలా ప్రత్యేకమైనది డ్యాన్స్. నేను శిక్షణ పొందిన డ్యాన్సర్‌ని, శయమాక్ దవర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. చాలా డ్యాన్స్‌ ఫామ్స్‌ ట్రై చేస్తున్నాను. నేను కాంటెంపరరీ, హిప్ హాప్, జాజ్, సల్సా లో కూడా శిక్షణ పొందాను. డ్యాన్స్ నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులందరికీ నా డాన్స్ ప్రతిభను చూపించాలనుకుంటున్నాను. తర్వాతి నాకు ఇష్టమైన హాబీ ప్రయాణం. నేను అలానే కొత్త విషయాలు నేర్చుకోవడం సినిమాలు చూడడం కూడా చాలా ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు