ఇంటర్వ్యూ : బోయపాటి శ్రీను – బాలకృష్ణతో చేసే సినిమా పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండదు..

Bayapati-Srinu
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని సినిమాలలో భారీ యాక్షన్, హై ఎమోషన్స్, పంచ్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ అతని రియల్ లైఫ్ లోకి వెళ్లి చూస్తే ఎంతో మంచి నడవడిక కలిగి, చాలా సాఫ్ట్ గా మాట్లాడే మనిషి. రేపు బోయపాటి శ్రీను తన పుట్టిన రోజు వేడుకని జరుపుకోనున్నాడు ఈ సందర్భంగా ఆయన కొంత మంది మీడియా మిత్రులతో ముచ్చటించారు. తన తదుపరి చిత్రం నందమూరి బాలకృష్ణ తో చేయనున్నాడు. బోయపాటి శ్రీను తన రాబోయే సినిమా గురించి, అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్స్ గురించి మాతో చెప్పారు. తను ఎంతో నిక్కచ్చిగా మాట్లాడాడు కానీ అది కూడా సరదాగానే సాగింది. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ బర్త్ డే ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు?

స) వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం నేను నందమూరి బాలకృష్ణ గారితో చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాను. కాబట్టి ఈ బర్త్ డే నాకు రొటీన్ గా సాగే బిజీ డే.

ప్రశ్న) బాలకృష్ణ సినిమా కోసం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసారా?

స) అవును. స్టొరీ లైన్, ఆయన పాత్ర ఎలా ఉండాలి అనేది ఫైనలైజ్ చేసాము. కానీ షూటింగ్ మొదలయ్యేంత వరకూ స్క్రిప్ట్ ని రీ చెక్ చేసుకుంటూ, ఇంకా బెటర్ గా చేయడానికి చూస్తున్నాం.

ప్రశ్న) ఫ్యాన్స్ అంతా ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అది నిజమేనా?

స) మంచి ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాలో అది కూడా ఓ భాగం మాత్రమే. ఇందులో బాలకృష్ణ గారి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే అది చూసి ఫ్యాన్స్, సినీ ప్రేమికులు థ్రిల్ అవుతారు. నా భుజాలపై చాలా పెద్ద భాధ్యతని ఉంచారు, ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరిచేందుకు నా వైపు నుండి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండదు, అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రం ఉంటాయి. కానీ పాలిటిక్స్ అనేది అన్నిటినీ డామినేట్ చేసే ఎమోషన్ కాదు.

ప్రశ్న) ముందుగా అనుకున్న దాని ప్రకారం మీరు మహేష్ బాబు, రామ్ చరణ్ తో సినిమాలు చెయ్యాలి? ఆ ప్రాజెక్ట్స్ ఏమయ్యాయి?

స) మహేష్ బాబుతో ఓ సినిమా కోసం చర్చలు జరిగాయి. కానీ అది ఫైనలైజ్ కాలేదు. బహుశా బాలకృష్ణ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది.

ప్రశ్న) మీరు సినిమా సినిమాకి మధ్య ఎక్కువ టైం తీసుకుంటారు. దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

స) నేను సినిమా స్క్రిప్ట్, అలాగే ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాను. ఇకనుంచి దాన్ని తగ్గించి త్వరగా సినిమాలు చేసి నా బ్యాంకు బాలన్స్ పెంచుకోవాలి. కానీ ఫ్లాప్స్ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే నిర్మాత నన్ను నమ్మి కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. కావున మినిమమ్ గ్యారంటీ ఉన్న సినిమా అన్నా తీయగలగాలి. ఉదాహరణకి నాకు 1,20,000 ఫీట్ ఫిల్మ్ కావాలంటే అంతే ఫిల్మ్ వాడుతాను అంతే కానీ 4, 5 లక్షల ఫీట్ ఫిల్మ్ వృధా చెయ్యను. నా ఎడిటింగ్ వర్క్ మొత్తం ఎక్కువగా పేపర్ పైనే ఉంటుంది. అందుకే నిర్మాతకి అనవసరమైన ఖర్చు ఉండదు. ఇందువల్లే నా సినిమాలకి ఎక్కువ టైం తీసుకుంటుంది.

ప్రశ్న) చాలా మంది డైరెక్టర్స్ ‘స్టైలిష్ లుక్’ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. దీని పై మీ అభిప్రాయం ఏమిటి?

స) (నవ్వుతూ) మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను, నా వరకూ నా సినిమా కోసం మాత్రం లిమిట్ గా బడ్జెట్ ఉంటుంది. నా వరకూ స్టొరీని రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి ప్రేక్షకులని కన్విన్స్ చెయ్యడం, రెండవది ప్రేక్షకులని తికమక పడేలా చెప్పొచ్చు. పస్తుతం కొంతమంది దర్శకులు ఏదో జిమ్మిక్కులు, ఎడిటింగ్ ఎఫెక్ట్స్ పెట్టి ప్రేక్షకులని తికమక పడేలా చేస్తున్నారు. ఎం చెప్తున్నారా అనేది ప్రేక్షకులకి అర్థం కావడం లేదు? డైరెక్టర్స్ మాత్రం స్టైలిష్ గా ప్రెజెంట్ చేసామని అనుకుంటున్నారు. మీరు చెప్పండి దాన్ని స్టైలిష్ ప్రెజెంటేషన్ అంటారా?

ప్రశ్న) బాలకృష్ణ సినిమా కోసం మీ టెక్నికల్ టీంని ఏమన్నా మారుస్తున్నారా?

స) ఈ సినిమా కోసం టెక్నికల్ టీం ఇంకా ఫైనలైజ్ కాలేదు. నాకు తెలిసి నా టీం అంతా అలానే ఉంటారు కానీ ఈ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనుకున్న ప్లాట్ కి, నేను ఎంచుకున్న జోనర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే వారినే తీసుకుంటాను.

ప్రశ్న) ఈ సినిమాకి టైటిల్ ‘రూలర్’ అని వినిపిస్తోంది, అది నిజమేనా?

స) ఎక్కువ భాగం అదే ఉండొచ్చు.

ప్రశ్న) నయనతార ఈ సినిమాలో మళ్ళీ నటిస్తుందని ఆశించవచ్చా?

స) ఆ చాన్స్ చాలా తక్కువగా ఉండండి. ‘సింహా’ సినిమాలో ఆమెని చాలా బాగా చూపించాం, ఆమె పాత్ర కూడా బాగుంటుంది. మళ్ళీ ఆమెని తీసుకుంటే అందరూ ‘సింహా సినిమాలో’ లాంటి పాత్రలో చూడాలనుకుంటారు. నేను బాలయ్య గారితో కలిసి పనిచేసాను, మళ్ళీ పని చేస్తుండడంతో అంచనాలు భారీగా ఉంటాయి కానీ వాటిని అందుకోవచ్చు. అదే ఫీల్ ని హీరోయిన్ విషయంలో ఉండకూడదని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసే పనోలోనే ఉన్నాము.

ప్రశ్న) బాలకృష్ణ నుంచి ఈ సినిమాలో ఏమేమి ఆశించవచ్చు?

స) పవర్ఫుల్ గా ఉండే ఈ సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్ ని ఫుల్ హ్యాపీ చేస్తుంది. బాలయ్య ఈ సినిమాలో చాలా స్లిమ్ గా, ట్రిమ్ లుక్ తో చాలా కొత్తగా కనపడతారు. ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మక మైనది కావడం వల్ల ప్రతి డిపార్ట్ మెంట్ లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నందమూరి అభిమానులు చాలా గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. అలాగే బాలకృష్ణ గారు కూడా ఈ సినిమా పై చాలా సీరియస్ గా ఉన్నారు, అందుకే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు.

ప్రశ్న) ఆడవారి పై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ఫిల్మ్ మేకర్స్ ఏమన్నా చెయ్యాల్సిన కనీస భాద్యత ఉందంటారా?

స) ప్రస్తుతం ఇండస్ట్రీలో వల్గర్ గా ఉండే సినిమాలు చాలా వస్తున్నాయి, అవి బిగ్ హిట్స్ అవుతున్నాయి. ఉదాహరణకి ఇటీవలే వచ్చిన ఓ సినిమాలో హాస్టల్స్ లో అమ్మాయిలూ ఎలా ఉంటారు అనే దాన్ని చాలా బ్యాడ్ గా చూపించారు, అలాగే వల్గర్ గా ఉండే యాంగిల్స్ లో చూపించారు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. మనం ఒక లేడీ హాస్టల్ ముందు నుంచి వెళుతుంటే మనకు ఆ సినిమా గుర్తొస్తుందా? లేదా? కొంతమంది అమ్మాయిలు అందరూ హాస్టల్స్ లో అదే చేస్తుంటారని నమ్ముతారు. అలాంటి సినిమాల ప్రభావం మనపై చాలా కాలం ఉంటుంది. అలాంటి సినిమాలు తీసే డైరెక్టర్స్ ఇకనైనా తెలుసుకొని మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను. మనపై కూడా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది.

ప్రశ్న) మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్తారా?

స) నేను గుంటూరు జిల్లాలోని పెద్ద కాకాని అనే గ్రామం నుండి వచ్చాను. నేను వ్యవసాయం చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. సినిమాల్లోకి రాకముందు మాలిని స్టూడియో అనే ఫోటో స్టూడియో ఉండేది. నేను జర్నలిజం కోర్స్ చేసాను, ఈనాడు న్యూస్ లో కూడా పని చేసాను.

ప్రశ్న) మీ సినిమాల్లో బావమరిది పాత్రలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. దానికేమన్నా ప్రత్యేక కారణం ఉందా?

స) (నవ్వుతూ) అవును ఉండండి. మాములుగా బావమరిది బావ మంచి కోరుకునే వాడని అంటారు. అతని చెల్లెలు మీ లైఫ్ లోకి ప్రవేశించగానే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తెలుగు ప్రేక్షకుల్లో ఈ సెంటిమెంట్ చాలా పాపులర్ కావున నా సినిమాల్లో పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఫ్యామిలీ అన్నా ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్నా చాలా ఇష్టం. చెప్పాలంటే మాది ఉమ్మడి కుటుంబం, అలాగే నేను నా బంధువుల అందరి యోగ క్షేమాలను పట్టించుకుంటాను.

ప్రశ్న) మీ కెరీర్లో మీరు చెయ్యాలనుకునే డ్రీం ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా?

స) నాకు ప్రతి ఒక్క జోనర్ లోనూ సినిమాలు చెయ్యాలని ఉంది. కానీ నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ కావున ఎక్కువగా కమర్షియల్ అంశాలున్న సినిమాలను బాగా చెయ్యగలను. హిందీ, తమిళ సినిమాలతో పోల్చుకుంటే మన మార్కెట్ కి లిమిట్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రేక్షకులెప్పుడూ కొత్తదనం ఉంది ఆసక్తికరంగా ఉంటే సినిమాలు చూస్తారు. ఉదాహరణకి ‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అతని ఫిజిక్, లుక్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఆలాగే డైరెక్టర్ కి మార్కెట్ ఉంది కావున ప్రేక్షకులు ఆ సినిమాను చూస్తారు. కానీ రేపెవరైనా అలాంటి సినిమానే మొదలు పెడితే ఆ సినిమా అంత కొత్తగా ఆసక్తి గా ఉండదు.

ప్రశ్న) మీ కెరీర్ పరంగా మీరు సంతోషంగా ఉన్నారా?

స) దేవుడు దయ వల్ల మా తల్లితండ్రులు గౌరవంగా చెప్పుకునే స్థాయికి చేసుకున్నాను. కానీ నేను చేయాల్సింది ఇంకా ఉంది. నేను నా ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెట్టాను నేను సాదించాల్సింది ఇంకా ఉంది. నాకు ఇంకా వయసు ఉంది కావున ఇక్కడ ఇంకా లాంగ్ లైఫ్ ఉంటుందని ఆశిస్తున్నాను.

అంతటితో బోయపాటి శ్రీను గారికి అడ్వాన్స్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం. మీరు కూడా బోయపాటి శ్రీను ఇంటర్వ్యూని బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం.

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version