ప్రత్యేక చిట్ చాట్ : రోబాక్ బొబాక్ – తెలుగు సినిమాలకు ఫారిన్ మోడల్స్ కో ఆర్డినేటర్

bobak
తెలుగు సినిమాలకు ఫారిన్ మోడల్స్ కో ఆర్డినేటర్ గా మూవీ ప్రొడక్షన్ సర్కిల్స్ లో బాగా ఫేమస్ ఉన్న రోబాక్ బొబాక్ ని మేము కలిసాము. చాలా సున్నితంగా మాట్లాడుతున్న ఈ యంగ్ కుర్రాడు 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో తన ఎమ్.ఈ కంప్లీట్ చెయ్యడానికి హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం మన హైదరాబాద్లో ఎంతోమంది ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు అందులో చాలా మంది సౌత్ ఈస్ట్ ఆసియా, ఈస్టర్న్ యూరప్, మిడిల్ ఈస్ట్ , లాగే సౌత్ అమెరికా నుంచి వచ్చిన వారున్నారు.

రోబాక్ బొబాక్ హైదరాబాద్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫారిన్ స్టూడెంట్ కమ్యూనిటీకి మధ్య వారధిలా పనిచేస్తున్నాడు. చదువుకోవడానికి వచ్చిన అతను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు, అతను హైదరాబాద్ గురించి ఎలా ఫీల్ అవుతున్నాడు, ఇక్కడ అతను ఏమేమి చేస్తున్నాడు అనే విషయాలను మాతో పంచుకున్నాడు. రోబాక్ బొబాక్, అతని టీం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమాకోసం పనిచేసారు. ప్రస్తుతం వారి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రశ్న) హాయ్ రోబాక్. మీ గురించి కాస్త చెప్పండి?

స) హాయ్.. నేను ఇరాన్ నుండి వచ్చాను, నా పేరు రోబాక్ బొబాక్. కానీ లోకల్లో బాబీ అని పిలుస్తారు. 2009లో ఊస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. 2011కి నా చదువు పూర్తయ్యింది. ప్రస్తుతం నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోషియేషన్ లో పనిచేస్తున్నాను అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం పనిచేస్తున్నాను.

ప్రశ్న) అసలు మీరెలా ఇండస్ట్రీలోకి వచ్చారు?

స) 2009లో నన్ను ఒక ఆడి కమర్షియల్ ప్రోగ్రాం కోసం కలిసారు. ఆ టైంలో ఒకతను నన్ను కలిసి మీకు సినిమాలో నటించే ఆసక్తి ఉందా అని అడిగారు ఉంది అని చెప్పాను. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో కనపడ్డాను కానీ ఇప్పుడు మాత్రం కో ఆర్డినేటర్ పనులే చేస్తున్నాను. నాకు ఇక్కడున్న ఫారిన్ స్టూడెంట్ కమ్యూనిటీతో మంచి సంబందాలున్నాయి, వాళ్లకి ఏమన్నా అవసరం ఉండే నన్ను సంప్రదిస్తుంటారు. వాళ్లకి తెలుసు నేను సినీ ఇండస్ట్రీకి కో ఆర్డినేటర్ గా పనిచేస్తానని అలాగే నాకు ఫారిన్ స్టూడెంట్స్ కమ్యూనిటీతో సత్సంబందాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలకి కూడా తెలుసు. అలా ఇండస్ట్రీలో కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను..

ప్రశ్న) మీరు మొదటగా ఏ సినిమా కోసం పనిచేసారు?

స) (ఆలోచిస్తే).. చెప్పడం కాస్త కష్టం, అలాగే నేను కొన్ని సినిమా పేర్లు పలకలేను. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలుపుకుంటే సుమారు 200 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం చాలా హిందీ, తమిళ సినిమాలు హైదరాబాద్ లోనే షూట్ చేస్తున్నారు. ఇటీవలే మా టీం కమల్ హాసన్ ‘విశ్వరూపం’ కోసం చెన్నైలో పని చేసారు. అలాగే బాలీవుడ్ లో ‘రా వన్’, ‘గోల్ మాల్ 3’, ‘రాక్ స్టార్’ మొదలైన చిత్రాలకు పని చేసాను.

ప్రశ్న) ‘బాద్షా’ లో మీ టీం ఏమేమి చేసారు?

స) ప్రస్తుతం మా టీం మెంబర్స్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాని కొంత భాగం స్పెయిన్ లో షూట్ చేసారు. మేము అక్కడ ఈ సినిమాలో నటించి ఫారినర్స్ ని వాయిస్ అందిస్తున్నాము. అలాగే శంషాబాద్ జి.ఎం.టి ఫెసిలిటీ వద్ద తీసిన కొన్ని సీన్స్ లో మా టీం లోని కొందరు నటించారు.

ప్రశ్న) తెలుగులో మీకు ఇష్టమైన హీరోలు ఎవరు?

స) తెలుగు హీరో నాగార్జున గారు నాతో బాగా ఫ్రెండ్లీ గా ఉంటారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతి సినిమాకి కనీసం ముగ్గురైనా నా టీం నుంచి వెళతారు. అలాగే నాకు అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, వెంకటేష్ అంటే ఇష్టం. ఇంకా నాకు చాలా మంది అంటే ఇష్టమే కానీ వాళ్ళ పేర్లు పలకడం నాకు కొంచెం కష్టం అందుకే చెప్పలేకపోతున్నాను.

ప్రశ్న) ఈ పనిలో మీకు మంచి సంపాదన వస్తోందా?

స) నాకు ఇదే ఉద్యోగం కాదండి నాకు వేరే ఉద్యోగం ఉంది. నా కున్న కాంటాక్ట్స్ వల్ల అలాగే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా భావించే వాళ్ళు అడగటం వల్ల ఈ పని చేస్తున్నాను. ఫారిన్ స్టూడెంట్స్ ని సినిమా కోసం కో ఆర్డినేట్ చేసినందుకు ప్రొడక్షన్ టీం నుంచి చాలా తక్కువ కమీషన్ తీసుకుంటాను. నాకు సినిమాలకి పని చేయడం అంటే ఇష్టం.

ప్రశ్న) మీరు ఒక ఫారినర్, ఎలా హైదరాబాద్ ని ఎంచుకున్నారు?

స) హైదరాబాద్ నాకు ఇల్లుతో సమానం. 2009 నుంచి ఇక్కడ ఉంటున్నాను, ఈ సిటీకి బాగా అలవాటు పడిపోయాను. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, అలాగే ఇక్కడ ఫారిన్ స్టూడెంట్ కమ్యూనిటీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కావున ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

ప్రశ్న) మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీలకి మోడల్స్ కో ఆర్డినేటర్ గా కూడా పని చేస్తారా?

స) తెలుగులో కాకుండా తమిళ్, హిందీ పొడక్షన్స్ కి కూడా పని చేస్తాను. కానీ ఎక్కువ భాగం హైదరాబాద్లోనే జరుగుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వేరే సిటీలలో అవసరమైతే అక్కడికి వెళ్తాము. అదే ఇది వరకూ చెప్పినట్టు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ కోసం చెన్నైలో పనిచేశాము.

ప్రశ్న) ప్రస్తుతం మీ టీం ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అలాగే ఎన్ని కొత్త సినిమాలకు సైన్ చేసారు?

స) (నవ్వుతూ) ఇది వరకూ చెప్పినట్టు నేను ఆ సినిమా పేర్లు పలకలేనండి. కానీ కొన్ని పెద్ద సినిమాలకు పనిచేస్తున్నాం.

బొబాక్ ఎంతో స్పష్టంగా, చాలా బాగా మాట్లాడారు. అతనితో మాట్లాడటం కాస్త ఫన్నీగా ఉంది, అలాగే ఇలాంటి ఫారినర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా సెట్ అయ్యారా అనే విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. ఈ చిట్ చాట్ మీరు కూడా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం..

రాఘవ

CLCIK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version