ప్రత్యేక ముఖా ముఖి : అరుణ్ రుద్ర – మై హార్ట్ ఈజ్ బీటింగ్ స్వీట్ లవ్ స్టొరీ

మై హార్ట్ ఈస్ బీటింగ్ … అదోలా చిత్రానికి దర్శకుడు అరుణ్ రుద్ర. అమెరికా నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవుతుంది. అరుణ్ మరియు కిరణ్ మీగడ కలిసి సంయుక్తంగా నిర్మించారు. అరుణ్ కి సినిమాలంటే చాలా అభిరుచి ఉంది. ఆయనతో మేము ప్రత్యేకంగా ముచ్చటించడం జరిగింది.

ప్ర: మీ గురించి చెప్పండి.

స: నేను అమెరికా కి వచ్చిన తరువాత ఇటీ ఇండస్ట్రీలో చేరడం జరిగింది. మా అమ్మ గారు కథా రచయిత్రి మరియు రచయితల సంఘంలో సభ్యురాలు కూడా. నేను ఇంటర్ చదివే రోజుల్లో నుండి నాకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. నేను ఎమ్మెస్ చేసే సమయం నుండి కథలు రాయడం పై ఆసక్తి కలిగింది. నేను కథలు రాయడం మొదలు పెట్టి న్యూయార్క్ ఫిలిం అకాడమిలో చేరాను. విజువల్ స్టొరీ టెల్లింగ్, కెమెరా ఫండమెంటల్స్, సీన్ కంపోజిషన్ మరియు డైరెక్షన్ విభాగాల గురించి శిక్షణ తీసుకోవడంతో సినిమా పై అవాగాహన వచ్చింది.

ప్ర: మీ ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ సినిమా గురించి ఏం చెబుతారు?

స: మై హార్ట్ ఈజ్ బీటింగ్ నైతిక విలువలతో కూడిన స్వీట్ లవ్ స్టొరీ. అమెరికా నేపధ్యంలో సాగే భారతీయుల కథ. రొమాంటిక్ కామెడీ మరియు అందమైన 6 పాటలు న్యూయార్క్, న్యూజెర్సీ మరియు పెన్సిల్వేనియా తదితర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. ప్రేమ, ద్వేషం మరియు కుటుంబ సంప్రదాయాలకు ఇచ్చే గౌరవం అంశాలతో కథ అల్లుకోవడం జరిగింది.

ప్ర: ఈ ప్రాజెక్ట్ ఎలా జరిగింది?

స: 2009 సంవత్సరం నుండి దాదాపు రెండున్నర సంవత్సరాలు స్క్రిప్ట్ రాయడం జరిగింది. నేను చిన్న గ్రూప్ తో సినిమా ప్రారంబించడం జర్గింది కాని అది సరిగా పూర్తి చేయలేకపోయాను. నా స్నెహిథ్దుఇ ద్వారా కిరణ్ మీగడ ని కలవడం జరిగింది. మాటలో మధ్యలో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. అద్రుష్టవశాత్తు అవార్డు గ్రహీత రాజ్ శేఖర్ కందుకూరి గారిని కలవడం జూలై 2011 ఆయన ఫుల్ బౌన్డేడ్ స్క్రిప్ట్ ఇవ్వడం ఆయనకీ బాగా నచ్చి ప్రాజెక్ట్ ప్రారంబించడం జరిగింది. రికార్డు స్థాయిలో 42 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసాము.

ప్ర: ఇద్దరు దర్శకులు కలిసి ఒకే సినిమాకు పని చేయడం కష్టమనిపించలేదా?

స: అలా ఏమీ లేదు. మేము ఇద్దరం సినిమా గురించి పూర్తిగా చర్చించుకొని ప్రరంబించము కాబట్టి అలంటి సమస్యలు తలెత్త లేదు. మాకు ఎదిఅన బేధాభిప్రాయాలు వచ్చిన కలిసి మాట్లాడుకునే వాళ్ళము. కిరణ్ తో కలిసి పనిచేయడం మరియు అతనిని కలవడం ఆనందంగా ఉంది.

ప్ర: ఇది మీకు మొదటి సినిమా. ఎలాంటి అనుభవం లేకుండా సినిమా చేయడం మీకు కష్టమనిపించలేదా?

స: అన్ని సిద్ధం చేసుకుని ప్రారంబించడం వాటిని నేను నమ్మను. సినిమా ప్రారంభానికి ముందే అన్ని విభాగాల మీద దృష్టి పెట్టాను. అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ప్రదర్శన చూపించాలి అనుకున్నాను. మా నిర్మాత సహకారం, కెమరామెన్ మురళి పల్లికొండ మరియు దర్శకత్వ విభాగంలో రవి కొత్తపల్లి, కపిలేశ్వర్ పున్న మొదలగు వారి సహకారంతో విజవంతం చిత్రం పూర్తి చేసాము.

ప్ర: ఈ చిత్రంలో ముఖ్య తారాగణాన్ని ఎలా ఎంచుకున్నారు?

స: అమెరికాలో ఉంటూ తెలుగులో మాట్లాడుతూ ఉండే కొత్త మొహాల కోసం వెతకడం జరిగింది. అమెరికాలో పేస్ బుక్ ద్వారా ఆడిషన్స్ నిర్వహించాము. అలా మేము రేవంత్ మరియు రజితని ఎంచుకోవడం జరిగింది. అలాగే రజినీకాంత్, శ్రాయు, శ్రిని కోట్ల, అశ్విన్ నల్ల మరియు ఫణి ఇతర పాత్రల్లో నటించారు.

ప్ర: ఈ చిత్రంలో ఎవరైనా అనుభవం ఉన్న నటులు ఉన్నారా?

స: మేము అనుభవం నటులను పెట్టుకోవాలని అనుకోలేదు. కొత్త మొహాలతో అయితే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఆడిషన్స్ సమయంలోనే వారిలో చాలా కాన్ఫిడెన్స్ కనిపడింది. అమెరికాలో ఉన్న మంచి తెలుగు నటులని పరిచయం చేయాలని భావించాము.

ప్ర: ఈ చిత్ర ఆడియోకి స్పందన ఎలా ఉంది?

స: చాలా బావుంది. ఈ ఆడియో విడుధలవగానే వెంటనే హిట్ అయింది. రాగ లో బాగా పాపులర్ అయింది. మైకేల్ మఖల్ ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చాడు. అతను భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడన్న నమ్మకం నాకుంది. అందమైన లోకేషన్లలో చిత్రీకరించడం జరిగింది. మా కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి పాటలకు మంచి కోరియోగ్రఫీ చాలా బాగా అందించాడు.


ప్ర: మీరు కొత్త దర్శకుడు కదా నిర్మాతని ఎలా వెతికారు?

స: అది టీం వర్క్. టీం సభ్యుల ద్వారా నిర్మాతని కలిసాము. కిరణ్ కి నిర్మాత రాజ్ తెలిసిన వారు కావడంతో మా అభిప్రాయాలు కూడా కలవడంతో ప్రాజెక్ట్ సాఫీగా సాగింది. ఆయన సహకారంతోనే సినిమా విజయవంతంగా పూర్తి చేసాము. ఆయనని కలవడం అధ్రుష్టమనే చెప్పాలి.

ప్ర: మీరు దీని ద్వారా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా?

స: మొదటగా ఈ అవకాశం కల్పించినందుకు 123తెలుగు.కామ్ వారికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే యూనిట్ సబ్యులందరికీ కృతజ్ఞతలు వారి సహకారం ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. మా తల్లి తండ్రుకలు మరియు నా భార్య కు కూడా నా నిర్ణయాలను గౌరవించినందుకు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా తప్పక ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. ప్రతి ఒక్కరిని అభ్యరిస్తున్నాను మంచి సినిమా తప్పకుండ చుడండి.

మై హార్ట్ ఈజ్ బీటింగ్ … అదోలా చిత్రం విజయం సాధించాలని కోరుకుందాం.

అనువాదం : అశోక్

Interview English Version

Exit mobile version