సూపర్ స్టార్ మహేష్ బాబు సన్నిహితుడు, గల్లా అరుణ మేనల్లుడు కృష్ణ మాధవ్ ‘హృదయం ఎక్కడుంది’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఆయన నటించిన ‘హృదయం ఎక్కడుంది’ సినిమా మార్చి 15న రాష్ట్ర మంతటా విడుదలవుతోంది. ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం .
ప్రశ్న : మీ సినిమా విడుదలకు సిద్దమైయ్యింది. మీరు భయపడుతున్నారా?
స : లేదు. హీరో కావాలన్నది నా కల. నేను నటించిన సినిమా చూడాలని నేను చాలా ఆసక్తిగా వున్నాను.
ప్రశ్న : సినిమాల్లో ఎందుకు నటించాలనుకున్నారు. మీరు మాస్టర్స్ డిగ్రీ యూఎస్ లో చేశారు కదా?
స: సినిమాలో చేయాలన్నది నా చిన్నప్పటి కల. నేను చాలా క్లియర్ గా గతంలో చెప్పను నాకు సినిమాల్లో నటించాలని ఉందని కానీ దానిని అప్పుడు ఎవ్వరు సీరియస్ గా తీసుకోలేదు.
ప్రశ్న: మీరు నటుడిగా మారడానికి ఎటువంటి శిక్షణ తీసుకున్నారు?
స : నేను బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగే నేను మహేష్ బాబు ‘దూకుడు’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను.
ప్రశ్న: మొదటి సారిగా స్క్రీన్ ముందు నటించారు కదా ఎలా అనిపించింది ?
స : నిజం చెప్పాలంటే స్క్రీన్ ముందు నటించడానికి కాస్త సిగ్గేసింది. కొన్ని సార్లు అక్కడి నుండి దూరంగా వెళ్ళాపోయేవాడిని.
ప్రశ్న : ఈ సినిమాలో మీ క్యారక్టర్ ఎలా ఉంటుంది ?
స : ఈ సినిమాలో నేను ఈ తరం యూత్ పాత్ర చేశాను. దీనిలో నేను ఎప్పుడు మరొక అమ్మాయిని మొహిస్తూ కన్ఫ్యూజన్ కు గురవుతూ వుంటాను.
ప్రశ్న : మీరు హీరో అవుతానని చెప్పినప్పుడు మీ ఇంట్లో వారు ఎలా స్పందించారు?
స : వారు నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. అందరికంటే ఎక్కువగా మా నాన్న నన్ను హీరోగా చూడాలనుకున్నారు. అలాగే అందరూ కూడా నేను సినిమాలో నటించడంతో చాలా సంతోషించారు.
ప్రశ్న : నీ సినిమా కెరీర్ గురించి మహేష్ బాబు ఏం చెప్పారు. ఆయన మీ ఫెర్ఫార్మెన్స్ గురించి ఏమన్నారు?
స : మహేష్ బాబు నాపై చూపిన అభిమానానికి ఆయనికి నేను ఎప్పుడు రుణపడి వుంటాను. నేను నటుడిగా మారడానికి ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన ఎప్పుడు నాకు చెబుతూ వుంటారు. హార్డ్ వర్క్ చేయి ఫలితాన్ని విధికి వదిలేయి.
ప్రశ్న : భవిషత్తులో మీరు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
స : ఇప్పటి వరకు నేను అలాగా ఏమి అనుకోలేదు. నేను ఇలాంటి పాత్రలే చెయ్యాలని కూడా అనుకోలేదు. నేను ఏ పాత్ర చెయ్యడానికైనా సిద్దంగా ఉన్నాను.
ప్రశ్న : మీరు రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. మీకు రాజకీయాలపై ఏమైనా ఆసక్తి వుందా ?
స : నాకు అలాంటి కోరిక లేదు ! నాకు సినిమాలంటే ఇష్టం. నేను ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించడం లేదు.
ప్రశ్న : చివరిగా మీరు నటించిన ‘హృదయం ఎక్కడున్నది’ సినిమాపై మీకు ఎలాంటి అంచనాలు వున్నాయి?
స : ఇది ఒక సందేశాత్మకమైన సినిమా. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ సినిమా చూసి అందరూ ఇష్టపడతారు. అలాగే నన్ను బ్లెస్ చేస్తారు.
ఇది కృష్ణ మాధవ్ ప్రత్యేక ఇంటర్వ్యూ . ఈ సినిమా మంచి విజయాన్ని సాదించాలని కోరుకుంటున్నాం. అల్ ద బెస్ట్ కృష్ణ మాధవ్……..
ఇంటర్వ్యూ : అవద్ .యం