ఇంటర్వ్యూ : మోనాల్ గజ్జర్ – అది నా అదృష్టమనే చెప్పాలి

ఇంటర్వ్యూ : మోనాల్ గజ్జర్ – అది నా అదృష్టమనే చెప్పాలి

Published on Sep 20, 2012 10:26 PM IST

“సుడిగాడు” చిత్రం విజయం సాదించడంతో మేఘాల్లో తేలిపోతున్న నాయిక మోనాల్ గజ్జర్ ప్రస్తుతం ఆమె రెండవ చిత్రం “వెన్నెల 1 1/2” విడుదలకు సిద్దమయ్యింది. ఈ సందర్భంగా ఈ నటి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు మీకోసం ఆమెతో మేము జరిపిన సంభాషణ

ప్ర) “సుడిగాడు” చిత్రం విజయం సాదించింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు?

జ) చాలా ఆనందంగా ఉంది ఈ చిత్రం నాలుగవ వారంలో కూడా ఇంత బాగా ఆడుతుంది అంటే ఆనదపడాల్సిన విషయమే కదా. మేము పడ్డ కష్టానికి ఫలితం దొరికింది అది నాకు చాలా సంతోషంగా ఉంది.

ప్ర) రెండవ చిత్రం విడుదల అవుతుంది కదా ఎలాంటి ఫలితం వస్తుందని అనుకుంటున్నారు?

జ) ఈ చిత్రం గురించి నాకు ఎటువంటి భయం లేదు మేము చాలా మంచి చిత్రం చేశాం ఈ చిత్రం చూశాక ప్రేక్షకులు తప్పకుండ మమ్మల్ని అభినందిస్తారని అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా హిట్ అయ్యే చిత్రం.

ప్ర ) వెన్నెల 1 1/12 చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి?

జ)ఈ చిత్రంలో తనకు కాబోయేవాడి విశేషాల గురించి తెలుసుకోడానికి లవ్ గురు సహాయం తీసుకునే ఒక యువతిలా కనిపించనున్నాను.

ప్ర) వెన్నెల కిషోర్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
జ) అదొక విహారయాత్ర లాగా అనిపించింది . సెట్ లో చాలా సందడిగా ఉండేది ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించడమే కాకుండా మమ్మల్ని బాగా ప్రోత్సహించారు కూడా. ఆయన ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా వినే వారు ముఖ్యమయిన వాటిని అమలుపరిచేవారు కూడా.

ప్ర) తెలుగులో మాట్లాడటం ఎలా మేనేజ్ చేస్తున్నారు?

జ) మొదట్లో చాలా కష్టంగా ఉండేది కాని ఈ చిత్రాలు చెయ్యడం మరియు కొంతమంది సహాయకుల మూలాన కాస్త సులభంగా ఉంది.

ప్ర) మొదటి చిత్రం విడుదలకాక ముందే మీరు ఐదు చిత్రాలను ఒప్పుకున్నారు, ఇదెలా సాధ్యమయ్యింది?
జ) నిజంగా ఇది అదృష్టమనే చెప్పాలి. నేను సంతకం చేసిన మొదటి చిత్రం “వెన్నెల 1 1/2” కాని “సుడిగాడు” మొదట విడుదల అయ్యింది. “వెన్నెల 1 1/2” ఆలస్యం అవ్వడంతో మరో రెండు తమిళ చిత్రాలు చేసే అవకాశం దక్కింది.

ప్ర) మీ భవిష్యత్తు చిత్రాల గురించి చెప్పండి?
జ) తెలుగులో విడుదల కానున్న నా తరువాత చిత్రం “ఒక కాలేజ్ స్టొరీ” ఇదే కాకుండా ఇంకా కొన్ని ఆసక్తి కరమయిన అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి త్వరలో ప్రకటిస్తాను.

ప్ర) భవిష్యత్తులో ఎటువంటి పాత్రలు చెయ్యాలని అనుకుంటున్నారు?
జ) కథలో ప్రాధాన్యమున్న పాత్రలను చెయ్యాలని అనుకుంటున్నాను “కహాని”లో విద్యాబాలన్ మరియు “అరుంధతి”లో అనుష్క వంటి పాత్రలు చెయ్యాలని ఉంది.

ప్ర) బాలివుడ్ కి వెళ్ళే ఆలోచనలు ఏమయినా ఉన్నాయా?
జ) ఆశ బోస్లె చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించాను అంతే నాకు ప్రస్తుతానికి సౌత్ మీదే నా కెరీర్ మీద దృష్టి సారించాను.

అనువాదం : అశోక్ రెడ్డి

Click Here For Interview in English

సంబంధిత సమాచారం

తాజా వార్తలు