ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ‘అనసూయ భరద్వాజ్’ తో ఈ మహిళా దినోత్సవం స్పెషల్ ముఖాముఖి

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ‘అనసూయ భరద్వాజ్’ తో ఈ మహిళా దినోత్సవం స్పెషల్ ముఖాముఖి

Published on Mar 8, 2022 3:17 PM IST

టాలీవుడ్ లో మరియు ముఖ్యంగా తెలుగు బుల్లితెర వద్ద గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కోసం తెలియని వారు ఎవరూ ఉండరు. పలు టీవీ షోస్ తో పాటు భారీ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఓ పక్క సెలెబ్రెటీగా మరోపక్క ఓ భార్యగా, తల్లిగా, కూతురిగా లైఫ్ ని లీడ్ చేస్తున్న అనసూయ తో ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. మరి దీనిలో ఆమె ఎలాంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారో చూద్దాం రండి.

 

ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం.. ఓ మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది?

ఇది ఈ ప్రపంచం లోనే ఒక బెస్ట్ ఫీలింగ్ లా అనిపిస్తుంది. మేము కూడా మగవాళ్ళకి ఎక్కడా తక్కువ కాదు అలాగే కేవలం ఈ ఉమెన్స్ డే మదర్స్ డే లలో మాత్రమే కాకుండా అన్ని వేళలా గౌరవించాలని అనుకుంటాము. ఇప్పుడు ప్రపంచం కూడా చాలా మారింది. స్త్రీలే ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మారడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

 

‘పుష్ప’ లో మీ రోల్ పై వచ్చిన స్పందన కోసం చెప్పండి?

పుష్ప సినిమా ఒక మెగా హిట్ అయ్యినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అలాంటి రోల్ లో నన్ను నా అభిమానులు ఫాలోవర్స్ మెచ్చుకోవడం జరిగింది. కాకపోతే పుష్ప లో కాస్త తక్కువ సీన్స్ నా పై ఉండడం డిజప్పాయింట్ గా అనిపించింది. కానీ పార్ట్ 2 లో మాత్రం ఇలా ఉండదు అని అనుకుంటున్నా.

 

బన్నీ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ కోసం చెప్పండి?

బన్నీ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. ముఖ్యంగా ద్రాక్షాయణి రోల్ పై తాను తన టీం నాపై స్పెషల్ గా చెప్పడం ఒక బ్లెస్సింగ్ గా అనిపించింది. బన్నీ తన రోల్ కోసం చాలా డేడికేటివ్ గా ఉంటాడు. ఖచ్చితంగా ముందు రోజుల్లో మరింత పెద్ద స్టార్ అవుతాడు.

 

“ఖిలాడి” లో మీ రోల్ పై కొన్ని ట్రోల్స్ వచ్చాయి దానిపై చెప్పండి?

నా వరకు అయితే నేను చేసిన రోల్స్ లో అది ఒక బెస్ట్ రోల్ అని చెప్తాను. ఎందుకంటే అందులో రెండు కంప్లీట్ డిఫరెంట్ షేడ్స్ చేశాను. కానీ సెకండాఫ్ లో ఎడిటింగ్ పరంగా నా రోల్ చాలా వరకు మారిపోయినట్టు అయ్యింది. కానీ ఆ సినిమాలో మాత్రం నా బెస్ట్ ని ఇచ్చాను. అంతవరకు అయితే నేను హ్యాపీ.

 

మరి సినిమాల్లో గ్లామ్ రోల్స్ ని అవాయిడ్ చెయ్యడానికి కారణం?

గ్లామర్ విషయానికి వస్తే దానిని నేను కేవలం టీవీ వరకు మాత్రమే పరిమితం చెయ్యాలి అనుకున్నాను. కానీ సినిమా విషయానికి వస్తే అక్కడ ఓ నటిగా అనేక డిఫరెంట్ రోల్స్ చెయ్యాల్సి ఉంటుంది. సో అలా టీవీ అండ్ సినిమాలకి సెపరేట్ లైన్ ని నా కెరీర్ లో పెట్టుకున్నాను.

 

తల్లి పాత్రలు లాంటివి వస్తే ఎమన్నా చేస్తారా?

నేను ముందే చెప్పాను నా రోల్ వరకు మంచి ఇంపార్టెన్స్ గనుక ఉంటే ఖచ్చితంగా చేస్తాను అందులో ఎలాంటి డౌట్ లేదు. అంతే కాకుండా ఓ పెద్ద సినిమా అయినా ఏదో చిన్న రోల్ లో ఓ తల్లిగా కనిపించాలి అంటే చెయ్యలేను. నేను ఓ రోల్ చేసాను అంటే దాని కోసం ఆడియెన్స్ కొంతసేపు అయినా మాట్లాడుకోవాలి.

 

ఓటిటి లో షోస్ కోసం చెప్పండి?

ముందు చెప్పినట్టే మంచి రోల్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా రోల్స్ వస్తే చేస్తాను. ఓటిటి లో ఆఫర్స్ వచ్చాయి కానీ నా పాత్ర నచ్చక అవన్నీ రిజెక్ట్ చేసేసాను. నా ఓటిటి డెబ్యూ కోసం అయితే ఒక సాలిడ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాను.

 

సోషల్ మీడియాలో మీపై ట్రోల్స్ ఎక్కువే.. దీనిపై ఏం చెప్తారు?

ఈ గడిచిన కొన్నేళ్లలో నేను మరింత ధృడంగా మారాను. నాపై కొన్ని ట్రోల్స్ వచ్చినపుడు నేనూ కొన్ని వెనక్కి తిరిగి ఇచ్చాను. ఇక ఈ సోషల్ మీడియా కోసం అంటారా చాలా మంది మొహాలు కూడా చూపించకుండా ఏదేదో మాట్లాడుతారు. ఇప్పుడు ఈ ట్రోల్స్ అన్ని పట్టించుకోడం మానేసాను.

 

బాలీవుడ్ లో చెయ్యాలని ఏమన్నా డ్రీం ఉందా?

ఖచ్చితంగా ఉంది. పేరు చెప్పలేను కానీ నాకు ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచే మంచి ఆఫర్ వచ్చింది. ఓ స్టార్ హీరోయిన్ కి తల్లిగా చేయాలని కానీ నా రోల్ అంత స్ట్రాంగ్ గా లేదు అనిపించి అది కూడా వదిలేసాను. ఇప్పుడు తెలుగు సినిమా నార్త్ లో కూడా మంచి హవా చూపిస్తుంది. ఇలా నాకు బాలీవుడ్ లో బ్రేక్ వస్తుందేమో అనుకుంటున్నాను.

 

ఇక ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

నా మళయాళం సినిమా “భీష్మ పర్వం” ఒకటి హీరో మమ్ముట్టి గారితో చేసింది ఉంది. ఇంకా రంగ మార్తాండ, సునీల్ తో ఓ సినిమా ఉంది. పుష్ప 2, గాడ్ ఫాథర్, పక్కా కమెర్షియల్ సినిమాలు ఆన్ షూట్ ఉన్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు ఓకే చేశాను రానున్న రోజుల్లో అవి అనౌన్స్ అవుతాయి.

ఇలా ఈ ప్రత్యేక దినాన మా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ని అనసూయతో ముగించాము. మరి ఆమె తాను అనుకున్న అన్నీ పనులు సాధించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా 123తెలుగు టీం ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు