ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : “గతం” సినిమా ఒక రోలర్ కాస్టర్ రైడ్ లా ఉంటుంది – గౌతమ్, పూజిత,రాకేష్

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : “గతం” సినిమా ఒక రోలర్ కాస్టర్ రైడ్ లా ఉంటుంది – గౌతమ్, పూజిత,రాకేష్

Published on Nov 4, 2020 7:51 PM IST

 

 

రీసెంట్ గా బయటకొచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ గతం ట్రైలర్ సినిమా ఆడియెన్స్ లో మంచి బజ్ ను నెలకొల్పింది. అలా నెలకొల్పిన ఈ చిత్రం ఈ నవంబర్ 6 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర మెయిన్ లీడ్ రాకేష్, పూజితా మరియు భార్గవ్ ల నుంచి ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకున్నాం. మరి వారేం విశేషాలు చెప్పారో చూద్దాం.

 

మీ సినిమా రిలీజ్ పై ఎలా ఫీలవుతున్నారు?

సినిమా రిలీజ్ పై మేము చాలా ఎగ్జైట్ గా ఉన్నాం. అసలు కలలో కూడా మా సినిమా ఇలా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది అని అనుకోలేదు. మేము చిన్నగానే అనుకున్నాం కానీ ఇంత పెద్ద రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఖచ్చితంగా మేము పెట్టుకున్న నమ్మకాలు మా కష్టంను ఈ చిత్రం నిలబెడుతుంది అని నమ్మకంగా ఉంది.

మీ పాత్రల కోసం చెప్తారా.?

రాకేష్ – ఒక వ్యక్తి తాను నిద్ర లేచాక తన గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు మరి అలాంటి వ్యక్తి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అతని రోల్ నేను చేశాను.
పూజిత – నేను రాకేష్ తో తన మిస్టరీని సాల్వ్ చేసే అమ్మాయిగా సినిమా మొత్తం కనిపించే సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తాను.
భార్గవ్ – నేను నా రోల్ కోసం పెద్దగా చెప్పలేను కానీ నాకు ఇచ్చిన నెగిటివ్ రోల్ ను బాగా చేసానని చెప్పగలను.

షూటింగ్ లో మీకు బాగా కష్టం అనిపించిన సందర్భం ఎమన్నా ఉందా?

పూజిత మాట్లాడుతూ అలా కొన్ని గంటల పాటు నాన్ స్టాప్ గా వర్క్ చెయ్యడం అలాగే తెల్లవారు జామున 3 గంటలకు లేచి నా మేకప్ నేనే చేస్కునేదాన్ని అలాగే మంచులో షూట్ కాస్త కష్టంగా అనిపించాయి. భార్గవ్ మాటలు – నేను నా రోల్ కోసం నాకు నేనే డార్క్ షేడ్ మరింత బాగా రావాలని ఒక రూమ్ లో బందించుకున్నాను అది కాస్త డిఫికల్ట్ గా అనిపించింది. ఫైనల్ గా రాకేష్ మాట్లాడుతూ సినిమాలో నేను చేసిన చేజింగ్ సీన్స్ ఫిజికల్ గా బాగా కష్టం అనిపించాయి బట్ ఓకే.

యంగ్ డైరెక్టర్ కిరణ్ రెడ్డితో వర్క్ ఎలా ఉంది?

మా ముగ్గురుకి ఎప్పటి నుంచో కిరణ్ రెడ్డి బాగా తెలుసు. రాకేష్ మరియు భార్గవ్ లు అయితే చాలానే షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాం. ఇక కిరణ్ అయితే చాలా పర్ఫెక్షనిస్ట్ తాను అనుకున్న అవుట్ ఫుట్ నటుని నుంచి వచ్చే వరకు కట్ చెప్పడు.

నటలో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

పూజిత మాట్లాడుతూ నేను ఎప్పుడు నటిని కావాలనే అనుకున్నాను అందుకే ఇండియాకి తిరిగి వచ్చేసాను వచ్చి ఒక సినిమాను కూడా డైరెక్ట్ చేశాను. ఇక భార్గవ్ విషయానికి వస్తే అతనికి పెళ్లి అయ్యింది కానీ సినిమా నటనపై ఆసక్తి ఎప్పుడు ఉంది. తన ఫ్రెండ్స్ తో తెలిసిన వారితో అవకాశాల కోసం అడిగి ఇప్పుడు బ్రేక్ వచ్చి హ్యాపీగా ఉన్నారు. ఫైనల్ గా రాకేష్ ఫ్యామిలీ బాగా సపోర్టివ్ కావడంతో తాను అనుకున్నది సాధించాడు.

“గతం” లో ఉన్న స్పెషల్ ఏంటి?

ముగ్గురు నటులు కూడా ఒకటే ఖచ్చితంగా చెప్పారు. ఈ సినిమా ఒక రోలర్ కాస్టర్ రైడ్ లా ఉంటుంది. ఒక్క పది నిముషాలు కూర్చొని చూస్తే మొత్తం సినిమా అంతా కూర్చొని చూసేలా చేస్తుంది. పూజిత ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. అలాగే విజువల్స్ మరియు కంటెంట్ లే చెప్తాయి మా సినిమాలో ఉన్న మా పనితనం ఏంటో అందులో చాలా నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు