ఇంటర్వ్యూ: ఆర్జీవీ స్క్రిప్ట్ ను కూర్చొని రాయరు, రీసెర్చ్ చేస్తారు… కొండా చిత్రం పై హీరో త్రిగున్

ఇంటర్వ్యూ: ఆర్జీవీ స్క్రిప్ట్ ను కూర్చొని రాయరు, రీసెర్చ్ చేస్తారు… కొండా చిత్రం పై హీరో త్రిగున్

Published on Jun 20, 2022 3:01 PM IST

అందరూ ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు ఇవ్వలేకపొతున్నా, అందరికీ థాంక్స్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అంటూ థాంక్స్ నోట్ తో ఇంటర్వ్యూ ను మొదలు పెట్టారు హీరో త్రిగున్.

నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను జర్నలిజం చదివాను, ఇంట్లో ఏమనుకున్నారు అంటే, ఇంజినీరింగ్ కాకుండా, జర్నలిజం చదివాడు, ఏ 50 వేలు, 60 వేలు వచ్చినా సెటిల్ అయిపోతాడు అనుకున్నారు. కానీ దేవుడి దయ. నేనొక న్యూస్ పేపర్ కి ఇంటర్న్ షిప్ చేసే వాడ్ని, కాఫీలు, స్క్రిప్ట్ లు, కారు పార్కింగ్ లు చేస్తూ ఉండే వాడ్ని.

అయితే ఒకరోజు ఎడిటర్ అండ్ చీఫ్ మాట్లాడారు. నీ స్కిల్ సీట్ ఎంటి అని అడిగాడు. కమ్యూనికేషన్ అని అన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగారు. అయితే ఆరోజే మన పోటెంషియల్ ఏంటి అని పుష్ చేశారు.

వైజాగ్ లో ఇంటర్ పూర్తి చేశాను, మద్రాస్ లో జర్నలిజం చేశాను, డ్రాప్ ఔట్ అయ్యాను.

కొండా చిత్రం కోసం ఆర్జీవీ మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు.

రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో చెప్పాలి అంటే, ఇది సెక్స్ లాగా, పెయిన్ అండ్ ప్లెజర్. ఆర్జీవీ తో సినిమా చేయడానికి కథ చిత్రం నుండి ట్రై చేస్తూనే ఉన్నా.కథ చిత్రానికి నాలుగు రోజుల క్రితం వెళ్లి కలిశా, సినిమా చేయమని, రొమాంటిక్ హీరోలా ఉంటాడు, క్యూట్ గా ఉంటాడు, నా స్టైల్ కాదు అని అనేవాడు. మళ్ళీ కొద్ది సంవత్సరాల తర్వాత కలిశా, లుకింగ్ వేరీ గుడ్, మనం చేద్దాం అని అన్నారు. ఇండస్ట్రీ లో ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ చెప్పేది అదే. డెఫినెట్ గా చేద్దాం అన్నారు. అప్పుడు అర్ధం అయ్యింది. ఎవరూ మనల్ని పిలవరు, మనది మనం చూసుకోవాల్సిందే అని అర్దం అయింది.

కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత కలవడం జరిగింది. ఎప్పుడైతే నేను హోప్స్ వదిలేసుకున్నానో, అప్పుడే ఆయన నన్ను పిలిచారు. ఆయన సినిమా చేద్దాం అన్నారు. ఏం చేద్దాం అని అడిగితే, ఆయన ఒక రెండు, మూడు స్క్రిప్ట్ లు చెప్పారు. ఆయన చెప్పిన స్క్రిప్ట్ లు ఒక వారం తర్వాత ఆయనకే నచ్చలేదు. నెల తర్వాత నన్ను అడిగారు. ఎగ్జాక్ట్ గా ఒక సంవత్సరం అవుతోంది.

నువ్ ఎలాంటి సినిమాలు చేస్తావు అని అడిగారు. నీ సినిమాలు అన్ని ఏంటి అని అడిగినప్పుడు, అప్పుడు నేను 15 నుండి 16 సినిమాలు చేశాను, ఒక రెండు వెబ్ సిరీస్ లు, 40 షార్ట్ ఫిల్మ్స్, 60 ఆన్ స్టేజ్ ప్లే స్ చేశాను, అవి కాకుండా, యాడ్స్ చేశాను. ఇవి చెప్పాకా, ఏంటయ్యా ఇంత చేశావ్. నేను రోజూ పని చేస్తాను. అద్దె కట్టాలి, బట్టలకు, పెట్రోల్ కి అన్నిటికీ కావాలి కదా, అందుకే చేస్తాను.

నీకు ఎలాంటిది చేయాలని ఉంది అని అడిగారు. నేను తుంగభద్ర అనే సినిమా చేశాను, అండర్ రేటెడ్ మూవీ అది. చాలా ఇష్టం నాకు. అప్పుడు యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉంది. యాక్షన్ లోకి ఎంటర్ అవ్వకుండా, సస్టైన అయిన హీరో కథ అది. జై భీమ్, హ్యాపీ డేస్, ది కశ్మీర్ ఫైల్స్ మాస్ సినిమాలు, ఎందుకంటే అవి ఎక్కువ మందికి రీచ్ అయ్యాయి కాబట్టి. మాస్ అప్పీల్ సినిమా చేయాలని అనుకుంటున్న విషయాన్ని చెప్పాను. అతనికి ఆ ఇంటెన్షన్ అర్దం అయింది. నేను కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చేయాలని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.

అతను స్క్రిప్ట్ ను కూర్చొని రాయరు, రీసెర్చ్ చేస్తారు. దాంట్లో పాయింట్స్ తీసుకొని చేస్తారు.తెలంగాణ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలామంది వచ్చారు. నేను ఆర్జీవీ రోజు డిస్కస్ చేసేవాళ్ళం. అయితే ఇలా అందరి గురించి డిస్కస్ చేసే టైమ్ లో, కొండ మురళి ను కలవండి అని ఒకరు చెప్పారు. కొండా మురళి ఎవరు అని ఆయన అడిగారు. నాకు తెలీదు, ఆయనకు తెలీదు. ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసిన కొండా మురళి గురించి నాకు తెలియక పోవడం ఏంటి అని, ఆయన ఈగో హార్ట్ అయింది. అతను వెళ్లి కొండా మురళి ను కలిసాక, చాలా విషయాలు మారాయి.

ఆ మీటింగ్ నుండి బయటికి రాగానే, అతను అన్నారు, ఐ థింక్ ఐ ఫౌండ్ మై స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్. కొండా మురళి చేస్తున్నాం అని అన్నారు. ఓకే సర్ అని చెప్పేశా. 70 లైన్స్ తో వన్ లైన్ స్క్రిప్ట్స్ పంపారు. నైట్ నుండి ఉదయం కాగానే 70 పేజెస్ రాశారు ఆయన. అలా మొదలైంది సినిమా.

చాలా స్ట్రాంగ్ గా పాత్ర మీద డిసైడ్ అయిన చిత్రం. ఇది బయో ఫిక్షన్. కొండా కింద రెండు పిల్లర్లు ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది, ఉద్యమం ఉంది. ఈ స్టోరీ లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అని తెలిపారు.

కొండా మురళి నక్సలైట్ నుండి, ఫ్యాక్షన్ నుండి పొలిటీషియన్ గా ఎదిగిన పాత్రలో మీరు చూసినప్పుడు బలం, బలహీనతలు ఏంటి?

బిగ్గెస్ట్ కనెక్షన్ ఎంటి అంటే, ఫీల్డ్ గురించి ఉంది. నీ సర్కిల్, నీ షీల్డ్ ను బట్టి రావడం, నా షీల్డ్ ను బ్రేక్ చేసుకొని రావడం నాకు నచ్చింది. లైఫ్ లో ఆగిపోయే వాళ్ళు 9 మంది మంది ఉంటారు. దాటేవాడు ఒక్కడు ఉంటాడు. ఆ దాటేవాడి ఒక్కడి కథ. నేనున్న వయసులో సినిమాలో జరిగే స్టోరీ.

సినిమా కోసం మీసం, వెయిట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. 90 దశకం లో ఎలా ఉండేది. ఫోన్ లు ఎక్కువగా లేకుండా, ఉండే కాలం. కాలేజ్ కి వెళ్తాడు, చదువుకుంటారు, ఇలా నార్మల్ గా ఉంటది. అలాంటిది అందరూ ఎందుకు ఉద్యమం లోకి వెళ్ళారు. అని అడిగారు రాము. జమీందార్లు, కాస్ట్ సిస్టం, కానీ, సినిమాలో చాలా తెలియనివి చూపించడం జరిగింది.

నేను ఆర్ట్స్ కాలేజ్ లో చదివాను, అమ్మాయిలు ఒక బిల్డింగ్, అబ్బాయిలు ఒక బిల్డింగ్.క్లోజ్ చేసేవారు ఒక జైల్ లాగా. ఆ ఒత్తిడి మీదే సినిమా కి వచ్చా. స్కూల్ టాపర్ నేను.

నేను కాలేజ్ డ్రాప్ ఔట్, నా డ్రైవర్ ఒక ఇంజినీర్. చాలా చేంజెస్ రావాలి.

ఇందులో ఏమోషన్స్ ఎలా ఉంటాయి?

కరెక్ట్ స్క్రిప్ట్ దొరికినప్పుడు అన్ని కరెక్ట్ గా ఉంటాయి. 47 బుల్లెట్స్ ఫైర్ అవుతాయి ఒక సీన్ లో. మామూలుగా ఒక రెండు బుల్లెట్లు తగిలితే ఒకరోజు సీన్, మరో రెండు బుల్లెట్లు తగిలితే మరో సీన్. అలాంటిది నిజంగా ఒకరికి ఇలా తగిలితే ఎలా ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ చాలా బాగా వచ్చింది. నా బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది?

శివుడు శక్తి లాంటి సినిమా. ఈ సినిమాలో కొండ మురళి, సురేఖ అని ఉంటది. అందుకే కొండా అని సినిమా కి టైటిల్. ఇద్దరిదీ ఇంపార్టెంట్. మెయిన్ పాత్రనే హీరోయిన్ గా ఉంటది. నిర్ణయాలు తీసుకొనే పాత్ర. ఈ చిత్రం లో మదర్ పాత్ర చాలా బాగుంటది. ఇందులో ఒక కుక్కని పెట్టాడు. కుక్కలంటే చాలా ఇష్టం. ఆర్జీవీ కి పిల్లలు, కుక్కలు అంటే ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా షూట్ చేశారు.

ఈ చిత్రం తో మీలో ఎలాంటి చేంజ్ చూశారు?

కొంచెం ధైర్యం వచ్చింది. తొక్కితే తొక్కించుకో, అని ఆర్జీవీ తెలిపారు. కొవిడ్ తో చాలా మార్పులు వచ్చాయి. ఆర్జీవీ తో చేస్తే కెరీర్ పాడవుద్ది అనేవారు. కానీ చాలా మంది ఒద్దు అన్న సినిమాలు చీకటి గదిలో చితక్కొట్టుడు, 24 కిస్సెస్ ఇలా చేశా.

నేను పేరు మార్చేద్దాం అనుకుంటున్నా అని ఆర్జీవీ కి చెప్పా,కానీ ఆర్జీవీ అందరి పేర్లు మార్చేస్తారు, నేనే మార్చమని అడిగా అంటూ చెప్పుకొచ్చారు. మా నాన్న కి కాస్ట్ ఫీలింగ్ లేదు. మా అమ్మ పేరు పెట్టారు. ఫస్ట్ అరుణ్. సినిమాలో అదిత్ అని డైరెక్టర్ పేరు పెట్టారు.

కథ చిత్రం తో చాలా పేరు రావడం తో ఇంకా ఎక్కువ ట్రై చేశాను. పెద్ద హీరో అవ్వక పోయినా, లాస్ట్ 3 ఏళ్లలో 16 చిత్రాలు చేశాను. నెక్స్ట్ ప్రేమ దేశం సినిమా ఉంది. ఒక సాంగ్ ఇప్పుడే టాప్ 10 లో ఉంది. ఇంకా చాలా చిత్రాలు లైన్ లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు