యాక్షన్ హీరో విశాల్ హీరోగా, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా డైరెక్టర్ ఎంఎస్ ఆనందన్ కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘విశాల్ చక్ర’. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మించారు. ఈ సినిమా హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా కాంబినేషన్లో వస్తోన్న 10వ సినిమా ఇది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా యాక్షన్ హీరో విశాల్ ఇంటర్వ్యూ.
రెండు భాషల్లో కూడా ఇతను మా హీరో అని అభిమానులు అనుకునే అవకాశం కొద్ది మందికే దక్కుతుంది. ఆ అవకాశం మీకు దక్కడం ఎలా అనిపిస్తుంది?
నేను ఈ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతానని, 2004లో నా మొదటి సినిమా విడుదలైందని అన్నారు. అయితే ఈ 17 సంవత్సరాలుగా నాకు అండగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక దన్యవాదాలు అని, ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ విడుదలవ్వడం హ్యాపీగా ఉందని అన్నారు.
టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
ఈ సినిమాలో హీరో ఫాదర్‌కి కేంద్ర ప్రభుత్వం యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే ఉన్నత పురస్కారం అశోక చక్ర అవార్ట్ వస్తుందని, అయితే కొంత మంది దుండగులు దాన్ని దొంగిలించడంతో ఈ సినిమా ప్రారంభమవుతుందని, ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక సైనికుడు దాన్ని ఎలా చేధించాడు అనే విషయం మీద సినిమా ఉంటుందని అందుకే ఆ టైటిల్ పెట్టడం జరిగిందని విశాల్ అన్నారు.
ట్రైలర్లో విజువల్స్ చూస్తుంటే అభిమన్యుడు సినిమాకి సీక్వెల్లా అనిపిస్తోంది?
చాలా మంది ఇదే విషయాన్ని అడుగుతున్నారని కానీ ఈ సినిమాకి, అభిమన్యుడు సినిమాకి మూడు సిమిలారిటీస్ మాత్రమే ఉన్నాయని ఒకటి ఇది కూడా సైబర్ క్రైమ్ థ్రిల్లర్, రెండోది ఈ సమాజంలో జరుగుతున్న విషయాలు డైరెక్ట్‌గా స్క్రీన్ మీద చూపించడం, మూడోది ఈ సినిమాలో కూడా నేను మిలటరీ ఆఫీసర్‌గా నటించడం ఈ మూడు తప్ప మిగతా స్క్రిప్ట్ అంతా చాలా కొత్తగా ఉంటుందని విశాల్ అన్నారు.
ఈ కథలో మీకు కొత్తగా అనిపించిన అంశాలేంటి?
మనం ఏదైనా ప్రదేశానికి వెళ్లాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మరుక్షణమే దానికి సంభందించిన డీటైల్స్ టెక్ట్స్ మెసేజ్ రూపంలో మనకి వస్తుంది. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఆ ప్రదేశానికి సంభందించిన బెస్ట్ డీల్స్, బెస్ట్ హోటల్స్ అని యాడ్ రావడం మీరు గమనించే ఉంటారు. అంటే మనకి ఏం కావాలి? మనం ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నాం అనే విషయాలపై మరొకరి నిగా ఉంది అని అర్ధం. వాటితో పాటు మీకు లాటరి వచ్చింది మీ అకౌంట్స్ డీటైల్స్ ఇవ్వండి, డబ్బులు పంపిస్తాం అని మనకు మైయిల్స్ వస్తుంటాయి అలా పంపిస్తే మన అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇలాంటి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పే చిత్రమిదని విశాల్ అన్నారు.
ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేయడం జరిగింది?
ఇలాంటి అంశాలమీద సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో జరిగింది, జరుగుతున్న విషయాల గురించి మాత్రమే చెప్పాలి. ఒకవేల మనం ఊహించి చెబితే దాని వల్ల సామాన్య ప్రజలు ఇంకా ఎక్కువ భయపడే అవకాశం ఉంటుందని విశాల్ చెప్పుకొచ్చారు. ఈ కథ నాకు చెప్పడానికి ముందే దర్శకుడు ఎమ్ ఎస్ ఆనందన్ ఈ కథ మీద పూర్తి రీసెర్చ్ చేశాడని, ఈ కథ చెబుతున్నప్పుడు నాకు రెండు సన్నివేశాల్లో విజిల్ కొట్టాలి అనిపించింది.
దర్శకుడు ఎమ్ ఎస్ ఆనందన్ ఫస్ట్ మూవీ కదా.. ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉంది?
మాములుగా ఒక కథ విన్నాక ఆలోచించి రెండు మూడు రోజుల్లో ఒకే చెబుతామని, కానీ ఆనందన్ ఈ కథ చెప్పగానే ఒకే చెప్పానని విశాల్ అన్నారు. ఆనందన్ ఫస్ట్ సినిమాకే తన బెస్ట్ ఇచ్చాడని మేకింగ్ పరంగా చాలా ఫ్రెష్‌గా ఉంటుందని, మా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్లో మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని పరిచయం చేయడం హ్యాపీగా ఉందని విశాల్ చెప్పుకొచ్చారు.
మీకు యువన్ శంకర్‌రాజాతో ఇది 10వ సినిమా కదా..?
అవును యువన్ శంకర్ రాజా నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను అతన్ని ఒక ఓన్ బ్రదర్‌లా ఫీలవుతానని, మా ఇద్దరి కాంభినేషన్ తప్పకుండా ఒక మ్యాజిక్ చేస్తుందని నేను నమ్మతాను అందుకే అతనితో ఫైట్ చేసైనా సరే నా మూవీస్ కి వర్క్ చేయించుకుంటానని విశాల్ అన్నారు. ఈ సినిమాకి యువన్ కావాలని ఎందుకు కోరుకున్నాను అంటే ఒక కొత్త డైరెక్టర్‌కి మంచి టెక్నీషియన్ బ్యాకప్ ఉంటే తను అనుకున్న దానికంటే సినిమా ఇంకా బాగా తీయగలడని, అందుకే యువన్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ తో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ కూడా ఇచ్చాడని, నా నెక్స్ట్ రెండు సినిమాలకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్ అని విశాల్ అన్నారు.
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏమిటి?
నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్యతో కలిసి ‘ఎనిమీ’ అనే సినిమా చేస్తున్నానని, అలాగే నా డైరెక్షన్లో అభిమన్యుడు-2 చేస్తున్నానని త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుందని విశాల్ చెప్పుకొచ్చారు. వీటి తర్వాత శరవణన్ అని ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ మంచి కథ చెప్పాడని ఆ సినిమా కూడా వన్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందన్న నమ్మకం ఉందని, ఇవే కాకుండా వచ్చే ఏడాది ఉగాదికి ఒక స్ట్రయిట్ తెలుగు మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నానని ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని విశాల్ స్పష్టం చేశారు.