కృష్ణగారు ‘హంట్’ చూసి అప్రిషియేట్ చేస్తారనుకున్నా – సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది – సుధీర్ బాబు

కృష్ణగారు ‘హంట్’ చూసి అప్రిషియేట్ చేస్తారనుకున్నా – సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది – సుధీర్ బాబు

Published on Jan 24, 2023 8:38 PM IST

దివంగత దిగ్గజ నటులు టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు ఇటీవల కాలం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన వారసుడిగా ప్రస్తుతం ఓవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు దూసుకెళ్తుండగా మరోవైపు ఆయన అల్లుడు సుధీర్ బాబు కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాలతో కొనసాగుతున్నారు. ఇక తాజాగా సుధీర్ బాబు సినిమా హంట్ రేపు గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. మేకా శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ కీలక రోల్స్ చేసిన ఈ మూవీని యువ దర్శకుడు మహేష్ తెరకెక్కించగా భవ్య క్రియేషన్స్ సంస్థ దీనిని భారీ స్థాయిలో నిర్మించింది. ఇక ఈ మూవీ జనవరి 26న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుండగా హీరో సుధీర్ బాబు నేడు ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు.

 

ఇంతకీ ఎవరిని ‘హంట్’ చేయబోతున్నారు?
అది మీరు సినిమాలో చూడాలి. ఎవరిని హంట్ చేస్తున్నాననే సస్పెన్స్ సినిమాలో ఉంటుంది. అలానే సినిమాలో ప్రతి పాత్రను నేను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కబీర్ సింగ్ దుహాన్, మైమ్ గోపి వంటి చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఆడియన్స్ కి మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. తప్పకుండా వారిని ఆకట్టుకుంటుంది.

 

శ్రీకాంత్, భరత్ ఛాయస్ ఎవరిది?
నిజానికి వారిద్దరి ఛాయిస్ దర్శకుడు మహేష్ దే. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు కానీ, ఉన్నంత సేపూ మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. సీనియర్ హీరో ఉంటే బావుంటుందని మహేష్ భావించి ఆయనని సెలెక్ట్ చేసారు. అలానే భరత్ ఛాయస్ కూడా దర్శకుడిదే. తనకు కూడా రెండు మూడు యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. లోకల్ హీరోల కంటే భరత్ అయితే కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుందని తీసుకున్నాం. ఇద్దరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు.

 

తమిళ్ లో కూడా రిలీజ్ చేసే ఆలోచన ఉందా?
నిజానికి మాకు ముందు అయితే ఆ ఆలోచన లేదు. కానీ వారం క్రితం చర్చల్లో చేస్తే బావుంటుందని అనిపించింది. కాంతార, లవ్ టుడే సినిమాలను వాళ్ళ మాతృభాషలో సక్సెస్ అయిన తర్వాత మన దగ్గర విడుదల చేశారు కదా, అలానే తెలుగులో సినిమా విడుదలైన తర్వాత మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా వారిని కూడా హంట్ అలరిస్తుందనే నమ్మకం ఉంది.

 

మేకింగ్ వీడియోని చూస్తే యాక్షన్ సీన్స్ కోసం చాలా రిస్క్ చేసినట్లున్నారు. అంత అవసరం అంటారా?
నాకు రిస్క్ అవి పెద్దగా రిస్క్ ఏమి అనిపించలేదు. రోప్స్ ఉంటేనే రిస్క్ ఎక్కువ. లేకపోతే నేనే చేస్తాను. ఈ సినిమా యాక్షన్ అంతా రియల్ గా ఉండాలని జాన్ విక్ సినిమాలను ముందుగా రిఫరెన్స్ తీసుకున్నాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాకే యాక్షన్ సీక్వెన్సులు చేశా. నేను స్పోర్ట్స్ పర్సన్ కావడం వల్ల ఈజీ అయ్యింది. తప్పకుండా యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి మంచి థ్రిల్ అందిస్తాయి.

 

మరి రియల్ లైఫ్ లో పోలీస్ కావాలనుకున్నారా?
లేదండి. అయితే యాక్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ తమ కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు. అర్జున్ ఎ, బి. ఆ విధంగా నా పాత్రలో రెండు వేరియేషన్స్ ని స్క్రీన్ పై చూస్తారు.

 

యాక్షన్ ఎక్కువ కనపడుతుంది, సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి?
యాక్షన్ సీక్వెన్సులు ఉన్నా ఎంత వరకు ఉండాలో, అంతే ఉంటాయి. సినిమా కోర్ పాయింట్ ఎమోషనే. అది ఆడియన్స్ ని మూవీకి బాగా కనెక్ట్ చేస్తుంది.

 

ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకోవడానికి కారణం ఏంటి ?
ఇటీవల కొన్నాళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళను ఫాలో అవుతున్నాను. చాలా దేశాల నుంచి వాళ్ళ దగ్గరకు వచ్చి పలువురు ఫైటింగుల్లో ట్రైనింగ్ తీసుకోవడం గమనించాను. అయితే నేను కూడా ఓ యాక్షన్ సినిమా చేస్తే వాళ్ళ దగ్గరకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని అనుకున్నాను. వాళ్ళు సినిమాలకు కూడా వర్క్ చేస్తారని తెలియడంతో రెండు నెలలు పాటు మూవీ గురించి మాట్లాడాం. ముందు ఒక్కటే యాక్షన్ సీక్వెన్సు అనుకున్నారు. మేం నాలుగు అని చెబితే 12 రోజులు పడుతుందని చెప్పారు. అయితే తమని చాలా మంది అప్రోజ్ అయి పేమెంట్ ఇవ్వడం లేదని చెప్పడంతో మొదట మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాతనే మేం ఫారిన్ వెళ్ళాం. మా కోసం వాళ్ళు డేట్స్ బ్లాక్ చేశారు. నాలుగు రోజుల్లో షూట్ చేశాం అన్ని యాక్షన్ సీక్వెన్సులు. రెండు రోజులు రిహార్సిల్స్ చేశామంతే. స్టంట్స్ పరంగా మేం కొత్తగా ప్రయత్నించాం. అవి ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా కష్టం మొత్తం స్క్రీన్ పై అందరినీ అలరించేలా కనపడాలని కదా.

 

కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో ‘హంట్’ చేశానని చెప్పారు. ఎందుకలా?
నిజానికి నా కెరీర్ పరంగా ఇది డేరింగ్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి కథ ఆయన చేసి ఉండకపోవచ్చు కానీ, చాలా ప్రయోగాలు చేశారు. కెరీర్ అంతా కొత్తగా ట్రై చేశారు. అందుకని, ఈ సినిమా ఆయనకి చూపించి రియాక్షన్ తెలుసుకోవాలని అనుకున్నాను. ప్రతిసారీ నా సినిమా విడుదలైనప్పుడు ఆయన ఫోన్ చేయడం లేదంటే ఇంటికి పిలిచి మాట్లాడటం చేసేవారు. ఇటీవల నా సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలైనప్పుడు మాట్లాడారు. ఇక ‘హంట్’ చూసి ఏం అంటారోనని అనుకున్నాను. అయితే తప్పకుండా ఆయన అప్రిషియేట్ చేస్తారని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోవడంతో వెలితిగా ఉంది. తప్పకుండా ఆయన పైనుండి ఆశీర్వదిస్తూనే ఉంటారు.

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
నటుడు హర్షవర్ధన్ గారి దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ అనే కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా చేస్తున్న. ఆ మూవీలో ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అలానే ఆ మూవీలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాను. ఇక యువి క్రియేషన్స్ లో ఇంకో సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా అది. రెండు మూడు రోజుల్లో టైటిల్ అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి ఇవే

ఆల్ ది బెస్ట్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు