ఇంటర్వ్యూ : కృతి శెట్టి – “బంగార్రాజు”లో నా రోల్ మంచి ఫన్ పటాకా లా ఉంటుంది

ఇంటర్వ్యూ : కృతి శెట్టి – “బంగార్రాజు”లో నా రోల్ మంచి ఫన్ పటాకా లా ఉంటుంది

Published on Jan 11, 2022 3:40 PM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి. గత ఏడాదిలో తన రెండు సినిమాలతో కూడా మంచి విజయాలు అందుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా నటించిన మరో సినిమా “బంగార్రాజు”. అక్కినేని నాగ చైతన్య మరియు నాగార్జునలు హీరోలుగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రం ప్రమోషన్స్ లో కృతి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇందులో తాను ఎలాంటి అంశాలు పంచుకుందో చూద్దాం.

చెప్పండి ఈ సినిమాలో రోల్ ఎందుకు ఓకే చేసారు?

ఈ సినిమాలో నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి ఫన్నీ గా ఉంటుంది. నేను వింటున్నప్పుడే చాలా నవ్వుకున్నాను. ఇలా కూడా ఉంటారా అని. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా మంచి ఫన్ పటాకా లా ఉంటుంది.

మరి ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది? ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఈ సినిమాలో నేను సర్పంచ్ రోల్ లో కనిపిస్తాను. మరి ఈ రోల్ అంటే స్పీచ్ లు అందులోని అచ్చ తెలుగులోనే ఉంటాయి. ముందు సినిమాలకి అయితే డైలాగ్ పేపర్ ఇచ్చినపుడే చాలా పదాలు అర్ధం అయ్యిపోయేవి. కానీ ఈ సినిమాకి అలా కాదు కొన్ని డైలాగ్స్ కొత్తగా ఉండేవి. అది కొంచెం కష్టంగా అనిపించేది. కానీ ఈ రోల్ మాత్రం మంచి ఎనర్జిటిక్ గా ఉంటుంది.

మీ తెలుగులో చాలా ఇంప్రూవ్ కనిపిస్తుంది ఎలా?

ఇప్పుడు నేను ఉంటుంది తెలుగు సినిమాలోనే కాబట్టి తెలుగు తప్పనిసరి. పైగా ముందు కొన్ని సినిమాలు కూడా చేశాను అలా తెలుగు బెటర్ గా మాట్లాడుతున్నాను. అలాగే నా సినిమా యూనిట్ తో కూడా నేను తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాను.

ఈ సినిమాలో ఫస్ట్ టైం మంచి ఫోక్ సాంగ్ చేశారు ఎలా అనిపించింది?

అవును ఖచ్చితంగా బంగార్రాజు లో ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. నాకు ముందే డాన్స్ అంటే చాలా ఇష్టం. అయినా ఈ సినిమాలో ఈ సాంగ్ కి కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ఆడియెన్స్ కోసం బాగా చెయ్యాలని అనుకున్నా. సాంగ్ వింటున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. అలాగే షూట్ లో కూడా మంచి ఎంజాయ్ చేసి చేశాను.

చెప్పండి నాగ్ మరియు చైతూ లతో వర్క్ ఎలా అనిపించింది?

నేను ఈ సినిమాకి ఓకే చెప్పినప్పుడు నాగార్జున, చైతన్య లతో సినిమా అని కాస్త భయపడుతూనే ఓకే చేశాను. వాళ్ళు నాతో ఎలా ఉంటారు ఎలా డీల్ చేస్తారో అని భయపడ్డాను. కానీ ఇద్దరూ కూడా నాకు నైస్ వెల్కమ్ అందించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇద్దరూ కూడా జెంటిల్ మెన్స్ అంతే.

ఇపుడు కరోనా మూడో వేవ్ ఎంటర్ అయ్యింది ఈ టైం ఎలా డీల్ చేస్తున్నారు?

ఈ కోవిడ్ ని సీరియస్ గానే తీసుకోవాలి. అలాగే ఒకోసారి తగ్గుతుంది అని మనం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఇది కూడా ఒక ఫేజ్ కాబట్టి ఇది కూడా డెఫినెట్ గా తగ్గుతుంది.

ఇక ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేం చేస్తున్నారు?

ప్రస్తుతం అయితే డిఫరెంట్ రోల్స్ నాకు వస్తున్నాయి ఈ విషయంలో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా రామ్ తో ఒక సినిమా, మాచర్ల నియోజకవర్గం అలాగే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు