ఇంటర్వ్యూ : కృతి శెట్టి – “ది వారియర్” కి నా కన్నా రామ్ ఎక్కువ కష్టపడ్డారు..

ఇంటర్వ్యూ : కృతి శెట్టి – “ది వారియర్” కి నా కన్నా రామ్ ఎక్కువ కష్టపడ్డారు..

Published on Jul 5, 2022 4:25 PM IST


ప్రస్తుతం ఈ జూలై లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఉప్పెన’ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ స్లైడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “ది వారియర్”. కోలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరోయిన్ ఎలాంటి విషయాలు ఈ సినిమాపై పంచుకుందో చూద్దాం రండి.

రీసెంట్ గానే మీ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చి హిట్టయ్యాయి, ఇపుడు మరో సినిమా వస్తుంది, ఎలా అనిపిస్తుంది?

‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వెంట వెంటనే విడుదలయ్యాయి కదా.. అందుకని ఇప్పుడు కొంచెం చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది..

ఈ కథ విన్న తర్వాత ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి?

లింగుస్వామి గారు తీసిన ‘ఆవారా’ను చాలా ఏళ్ళ క్రితం తమిళంలో చూశా. ఆ సినిమా నాకొక జ్ఞాపకం. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సినిమా సీడీ తీసుకువెళ్లే దాన్ని. ఒక్కో రోజు రెండు మూడు సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. లింగుస్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఆయన సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. హీరోయిన్లకు పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్ ఉంటాయి. కథ విన్న తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాను.

సినిమాలో బులెట్ సాంగ్ పెద్ద హిట్టయ్యింది, మీకు సినిమాలో చేసినపుడు ఎలా అనిపించింది?

షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. రామ్ గారి ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. కానీ, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. నేను కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. ‘బుల్లెట్’ సాంగ్ క్లాస్ అయితే ‘విజిల్’ సాంగ్ మాస్. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు విజిల్ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తాను. కొంచెం స్టయిలిష్ అంటే ‘బుల్లెట్’ సాంగ్. పాటలకు ముందు వచ్చే సీన్స్ చాలా బావుంటాయి.

ఈ చిత్రంలో మీ పాత్ర ఏంటి ఎలా కనిపిస్తారు?

ఈ సినిమాలో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే.

మీరు చేసిన ఆర్జే రోల్ కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?

తెలుగు ఆర్జే వీడియోస్ చాలా చూశా. వాయిస్ వినిపించినప్పుడు ఆర్జే కనిపించకపోయినా… ఎక్స్‌ప్రెష‌న్‌ ఫీల్ అవ్వాలి. అది గమనించాను. ఫారిన్ ఆర్జే వీడియోస్ చూశా. పాడ్ కాస్ట్ వీడియోస్ చూసి తెలుసుకున్నాను.

రామ్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ గురించి చెప్పండి

ఆయన హై ఎనర్జీతో ఉంటారు. అందుకని, కొంచెం నెర్వస్ ఫీలయ్యా. కానీ, హీ ఈజ్ వెరీ కూల్.

మీ డైరెక్టర్ లింగుస్వామి గురించి చెప్పండి

ఆయనకి ఆర్టిస్ట్ నుంచి ఏం కావాలో స్పష్టంగా తెలుసు. కొన్నిసార్లు ఎలా నటించాలో చేసి మరీ చూపిస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చేశారు. తనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది.

ఆది పినిశెట్టితో ఏమన్నా సీన్స్ ఉన్నాయా అతని కోసం చెప్పండి?

ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఆయనతో నా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే… ఒకరోజు సెట్స్‌కు వెళ్ళాను. బయట చాలా సాఫ్ట్‌గా ఉండే ఆయన… విలన్ రోల్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా అద్భుతంగా నటించారు. రామ్ తర్వాత ఎక్కువ సన్నివేశాలు నదియా గారితో చేశా. రాయల్‌గా ఉంటారు.

ఈ సినిమాతోనే కోలీవుడ్ లో కూడా ఎంటర్ అవుతున్నారు, ఈ ఫీల్ ఎలా ఉంది?

ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ‘ఉప్పెన’ టైమ్ నుంచి కోలీవుడ్, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు నేను ఊహించలేదు. అంత ప్రేమ చూపిస్తారని! ఇది బైలింగ్వల్ సినిమా, తమిళంలో కూడా షూట్ చేశాం. తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నారు. అందులో సూర్య గారు హీరో. నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు – తమిళ్ లాంగువల్. అందుకని, తమిళం నేర్చుకుంటున్నాను.

ఇప్ప్పుడు ‘ది వారియర్’, నెక్స్ట్ నాగచైతన్య – వెంకట్ ప్రభు సినిమాలు ఒకే ప్రొడక్షన్ హౌస్‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నారు. నిర్మాతల గురించి చెప్పండి

వెరీ నైస్ ప్రొడక్షన్ హౌస్. కాంప్రమైజ్ కాకుండా లావిష్, రిచ్ గా సినిమా తీశారు. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి సినిమా అంటే ప్రేమ. ఆయన తక్కువ మాట్లాడతారు. సినిమా ఖర్చు విషయంలో ఆ ప్రేమ చూపిస్తారు.

రెండు భాషల్లో షూటింగ్ చేయడం కష్టం అనిపించిందా?

నా కంటే రామ్ ఎక్కువ కష్టపడ్డారు. నేను లిప్ సింక్, మ్యాచ్ చేయడం ఈజీ. రామ్ అలా కాదు… ప్రతి సీన్, డైలాగ్ విషయంలో ఆయన కష్టపడ్డారు.

మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

డ్రీమ్ రోల్ ఇప్పుడు కాదు… కొన్నేళ్ల తర్వాత యాక్షన్ రోల్ చేయాలనుంది. ఫిమేల్ స్క్రిప్ట్స్ ఏవీ వినలేదు. ‘ది వారియర్’ తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’తో ప్రేక్షకుల ముందుకు వస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు