ఇంటర్వ్యూ : నాగ చైతన్య – “బంగార్రాజు” లో మా ఇద్దరికీ ఒకే ఇంపార్టెన్స్ ఉంటుంది..

ఇంటర్వ్యూ : నాగ చైతన్య – “బంగార్రాజు” లో మా ఇద్దరికీ ఒకే ఇంపార్టెన్స్ ఉంటుంది..

Published on Jan 12, 2022 4:40 PM IST

ఈ సంక్రాంతి కానుకగా ముఖ్యంగా సంక్రాంతి అసలైన పండుగ సినిమాగా వస్తున్న లేటెస్ట్ సినిమా “బంగార్రాజు”. అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య లు హీరోలుగా కృతి శెట్టి, రమ్య కృష్ణ లు ఫీమేల్ లీడ్స్ లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగ చైతన్య ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు చెప్పాడో చూద్దాం..

చెప్పండి ఈ సినిమాలో ఏమన్నా మార్పులు ఉన్నాయా?

ఖచ్చితంగా ఈ సినిమాలో చాలా ఛేంజెస్ ఉన్నాయి. చాలా ఎనర్జిటిక్ గా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మొదటి సినిమా కన్నా చాలా బాగా వచ్చింది. సినిమా కూడా మొదటి సినిమా కన్నా చాలా బెటర్ గా ఎంటర్టైనింగ్ గా వచ్చింది.

నాన్న గారితో సినిమా అంటే ఒక టెన్షన్ ఉంటుంది, ఈ సినిమాకి ఎలా అనిపించింది?

చాలా టెన్షన్ ఫీల్ అయ్యా. ఆల్రెడీ దీనికన్నా ముందు సోగ్గాడి సినిమాకి మంచి అంచనాలు ఉన్నాయి. దానికి సీక్వెల్ అంటే ఇంకా ఎక్కువ అంచనాలు ఉంటాయి. సో కళ్యాణ్ కూడా బాగా హెల్ప్ చేసారు, అలాగే నాన్న కూడా ఈ సినిమా విషయంలో బాగా సపోర్ట్ చేశారు.

ఈ సినిమాలో ఇద్దరి రోల్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుందా లేక నాగ్ గారిది గెస్ట్ రోల్ మాత్రమేనా?

ట్రైలర్ లో జస్ట్ అలా కట్ చేశారు అంతే కానీ సినిమాలో మాత్రం ఇద్దరికీ ఒకే ఇంపార్టెన్స్ ఉంటుంది. నాన్న గారిది గెస్ట్ రోల్ లా ఏమీ ఉండదు సినిమా అంతా ఉంటుంది. అసలు కథ అంతా కూడా నాన్న గారు రమ్య కృష్ణ లతో ఉంటుంది.

మీకు ఆల్రెడీ లవర్ బాయ్ ఇమేజ్ ఉంది, ఈ సినిమాతో రొమాంటిక్ ఇమేజ్ ఏమన్నా వస్తుందా?

ముందు సినిమాలు అంటే ఒక లాజికల్ గా ఒక ట్రాక్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ అయ్యింది. పైగా నాగ లక్ష్మి రోల్ కి నాకు ఒక ఈగో లాంటి ఫన్నీ గొడవలు అల్లరి నడుస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు మీ సినిమాపై ప్రభావం చూపించవు అంటారా?

నేను యాక్టర్ ని మాత్రమే ఈ ఇష్యూస్ అన్నిటి కోసం నాకు అంతగా తెలీదు, నాన్న గారు ఆల్రెడి సినిమా బడ్జెట్ పరంగా క్లియర్ గా ఒక మాట చెప్పసారు. ఒకవేళ రేట్లు పెరిగితే బోనస్ అన్నారు లేదా ఈ సినిమా బడ్జెట్ కి ఈ ధరలు బాగానే ఉన్నాయి అన్నారు. కానీ చివరి నిమిషంలో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది.

అసలు ఈ సినిమాని ఎప్పుడు అనుకున్నారు?

సోగ్గాడే హిట్ అయ్యాక సీక్వెల్ కోసం ప్రస్తావన వచ్చింది కానీ నాలుగేళ్లు కితమే ఈ సినిమా అనుకున్నాం కాకపోతే అప్పుడు నాన్న గారు నేను వేరేవేరుగా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాం. సరిగ్గా ఈ సినిమాకి అంతా సెట్ అయ్యింది అనుకునేసరికి కరోనా ఎంటర్ అయ్యింది. కానీ మా టీం అంతా కస్టపడి ఈ మాజికల్ టైం కి తీసుకొచ్చారు.

మరి రమ్యకృష్ణ గారితో వర్క్ ఎలా అనిపించింది?

రమ్య కృష్ణ గారితో యాక్టింగ్ అన్నపుడు ముందు కాస్త టెన్షన్ గానే అనిపించింది కానీ ఆవిడ తన రోల్ లో సూపర్బ్ గా చేశారు. ఆవిడతో వర్క్ చెయ్యడం మాత్రం తర్వాత చాలా ఎంజాయ్ చేశాను.

ఇక ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఓటిటి లో ఏమన్నా చేస్తున్నారా?

ప్రస్తుతం అయితే థ్యాంక్ యూ షూట్ అవుతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. అది కూడా విక్రమ్ నే చేస్తున్నాడు. అది ఇంట్రస్టింగ్ గా ఉండే మంచి హారర్ డ్రామా. అలాగే ఆమీర్ సర్ తో చేసిన లాల్ సింగ్ చందా కూడా ఒకటి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు