ఇంటర్వ్యూ : రాజమౌళి – “RRR” లో ఇద్దరికీ ఆ పాత్రలే ఎందుకు ఇచ్చానంటే..?

ఇంటర్వ్యూ : రాజమౌళి – “RRR” లో ఇద్దరికీ ఆ పాత్రలే ఎందుకు ఇచ్చానంటే..?

Published on Mar 15, 2022 3:40 PM IST


మరికొన్ని రోజులు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సందడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్న మరో భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కానుండగా రాజమౌళి ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఇందులో తాను ఎలాంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారో చూడాలి.

మీరు ఉక్రెయిన్ లో షూటింగ్ చేశారు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసు దానిపై చెప్పండి?

రాజమౌళి – అక్కడ షూటింగ్ చెయ్యడం చాలా ఫెంటాస్టిక్ గా జరిగింది. మేము అక్కడ షూట్ చేసిన టైం లో ఎప్పుడు అనుకోలేదు అక్కడ ఇలాంటి పొలిటికల్ టచ్ ఉంటుంది అనుకోలేదు. మేమంతా కూడా అక్కడి వారితో చాలా ఇంట్రాక్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయినా అక్కడి వారితో ఫోన్ లో టచ్ లో ఉంటూ తెలుసుకుంటున్నాం.

ఈ సినిమాకి టైటిల్ గా ముందు “RRR” అనుకున్నారా వేరే ఏమన్నా అనుకున్నారా?

రాజమౌళి – మొదటగా జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ని అనౌన్స్ చేసాము. తర్వాత ఇది అందరికీ బాగా నచ్చేసింది. తర్వాత ఇంకా టైటిల్స్ ఏం పెడదాం అనుకున్నపుడు ఫ్యాన్స్ అంతా ఇంకేం టైటిల్ ఉంది మేము ఇదే ఫిక్స్ అయ్యాం అన్నాక మేము కూడా దాన్నే ఉంచేశాం.

ఈ సినిమాకి ఎన్టీఆర్, చరణ్ లను ఆ పాత్రల్లో ఎంచుకోవడానికి కారణం?

అల్లూరి సీతారామరాజు చాలా సౌమ్యంగా ఉంటాడు. మండే అగ్నిని సైతం తన గుండెల్లో పెట్టుకొని మనగలడు. అలాంటి లక్షణాలు చరణ్ లో ఉన్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా చరణ్ స్థిరంగా ఉంటాడు. అందుకే అల్లూరి పాత్రకి చరణ్ ని అనుకున్నాను. అలాగే భీమ్ పాత్ర అనేది చాలా అమాయకంగా ఉంటుంది. ఏ భావోద్వేగాన్ని కూడా లోపల దాచుకోలేడు బయట పెట్టేస్తాడు అందుకే అలాంటి పాత్రకి తారక్ సూట్ అవుతాడు అని తనని ఎంచుకున్నాను.

ఇలాంటి ఇద్దరు స్టార్స్ ని ఎలా బ్యాలన్స్ చేసారా అని ఫ్యాన్స్ చూస్తున్నారు. దీనిపై చెప్పండి?

మీరు సినిమా చూసినప్పుడు మాత్రం అలా ఎవరు ఫీల్ అవ్వరు. అలాగే నేను సినిమాలో ఎవరికీ ఈ పాట ఉండాలి, ఫైట్ ఉండాలి అని ఏది పెట్టుకోలేదు. కానీ అంతా ఏమిటంటే ఇదంతా ఆడియెన్స్ ఎలా తీసుకుంటారు అనేది. అందుకే ఆ ఎమోషన్స్ ని బ్యాలన్స్ చెయ్యడం కాస్త కష్టంగా అనిపించింది.

ఏపీలో ఇచ్చిన కొత్త జీవో కోసం మీ అభిప్రాయం చెప్పండి..

ఇప్పుడు అంతా బాగానే ఉంది మేము కూడా రెండు సార్లు సీఎం గారిని కలిసాం. కొత్త జీవో అయినా కొన్ని విషయాల్లో కాస్త క్లారిటీ కావాల్సి వచ్చింది. కానీ సీఎం గారు ఫైనల్ గా మాకు ఫెవరబుల్ గా ఉండే నిర్ణయాన్ని తీసుకొని 5 షోలకి కూడా అనుమతి ఇచ్చారు. ఇది గొప్ప విషయం.

ఈ సినిమాని తీస్తున్నప్పుడు మీకు ఏ అంశంలో ఎక్కువ భయం అనిపించింది?

ఇద్దరు హీరోస్ కూడా సినిమాకి సైన్ చేసారు అంతా బానే ఉంది కానీ మేము రాసుకున్న ఎమోషన్స్ ని అంతే రీతిలో రాబట్టగలనా అని డౌట్ మాత్రం ఉండేది. దాన్ని సరైన మార్గంలో తీసుకురావడం అనేది నాకు ఎక్కువగా భయం కలిగిస్తుంది. ఒక ఎమోషన్ ని సరైన మార్గంలో తీసుకురావడం అనేదే నాకు టఫ్ టాస్క్ లా అనుకుంటాను.

కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ టైం లో ఎలాంటి ప్రభావం తీసుకొచ్చింది?

ఆరోగ్యానికి సంబంధించి ఇష్యూస్ పక్కన పెడితే లాక్ డౌన్ లో మా సినిమాని ఇంకా ఎలా బెటర్ గా తీసుకురావాలో టైం వచ్చింది. ప్రతి సారి వచ్చిన గ్యాప్ లో అప్పటివరకు రష్ చూసుకొని సినిమాని ఇంకా ఎలా బెటర్ తీసుకురావాలో అనేది మేము ప్రయత్నం చేసాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు