ఇంటర్వ్యూ: రాహుల్ రవీంద్రన్- మన్మథుడు 2 ఫలితం తెలిసిన నెక్స్ట్ డే నాగ్ సర్ కాల్ చేశారు..!

ఇంటర్వ్యూ: రాహుల్ రవీంద్రన్- మన్మథుడు 2 ఫలితం తెలిసిన నెక్స్ట్ డే నాగ్ సర్ కాల్ చేశారు..!

Published on Apr 16, 2020 4:42 PM IST

హీరోగా వెండితెరకు పరిచయమై డైరెక్టర్ గా మారాడు రాహుల్ రవీంద్రన్. ఆయన తీసిన చిలసౌ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో లో జాతీయ అవార్డు రాగా, గత ఏడాది కింగ్ నాగార్జునతో మన్మథుడు 2 తీశారు. మరి ఈ క్వారంటైన్ సమయంలో ఆయన ఏమి చేస్తున్నారో? ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? వంటి అనేక విషయాలు ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీ కోసం..

 

లాక్ డౌన్ సమయంలో మీ ఫీలింగ్ ఏమిటీ?

చెప్పాలంటే ఇబ్బందిగానే ఉంది.. కానీ తప్పదు. ఐతే కొంత మంది దీనిని చాల తేలికగా తీసుకుంటున్నారు. అలాంటి వారిపై కోపం వచ్చేస్తుంది. ఇది ఎంతటి ప్రాణాంతక వైరస్ అనేది కొందరికి అర్థం కావడం లేదు. నేను, నా వైఫ్ చిన్మయి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాం.

 

మీ భార్య చిన్మయి స్టేట్మెంట్స్ అనేక వివాదాలకు దారితీస్తూ ఉంటాయి, భర్తగా మీ అభిప్రాయం?

నిజం చెప్పాలంటే..ఆమెది గట్టి పోరాట తత్త్వం, అలాగే తన సమస్యలు తానే సాల్వ్ చేసుకోగల సత్తా తనకు ఉంది. నేను కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఇస్తానంతే. అప్పుడప్పుడు కొన్ని విషయాలు వదిలేయ్ అని చెబుతూ ఉంటాను. ఐతే కొందరు మహిళలు వారికి జరిగిన అన్యాయం తెలుపుతూ నాభార్యకు పంపే మెస్సేజ్ లు చూస్తే గుండె బరువెక్కుతుంది.

 

మన్మథుడు 2 పరాజయం తరువాత ఎలా అనిపించింది?

మన్మథుడు 2 ఫెయిల్యూర్ మానసికంగా నన్ను కృంగదీసింది. చాలా కాలం డిప్రెషన్ లో కి వెళ్ళిపోయాను. కొత్త స్క్రిప్ట్ మొదలుపెట్టడానికి నాకు ఐదు నెలల సమయం పట్టింది. ఆ టైటిల్ ప్రకటించినప్పటి నుండి మాపై ఎటాక్ మొదలైంది. సినిమా ఫలితం తరువాత పర్సనల్ గా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. అది చాల బాధపెట్టింది.

 

మరి నాగార్జున ఫీలింగ్ ఏమిటీ?

నాగార్జున గారు చాలా మంచి వారు. సినిమా విడుదలైన నెక్స్ట్ డే ఫోన్ చేసి బాగా చేశావు ఫలితం గురించి వదిలేయ్, కొన్నిసార్లు మనం చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చదు. అంత మాత్రాన మనం కృంగిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

 

మరి మీ భవిష్యత్ ప్రణాళికలు?

నా దగ్గర రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. వారిలో ఒకటి ఓ పెద్ద తమిళ్ స్టార్ తో చేయాలనే ప్లాన్ లో ఉన్నాను. మరో స్క్రిప్ట్ కూడా ఉంది అది స్మాల్ బడ్జెట్ మూవీ. ఇక నటుడిగా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి త్వరలో ప్రకటిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు