ఈ మధ్య కాలంలో నాగార్జునని కలిస్తే ప్రశాంతత గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. “శిరిడి సాయి” చిత్రం చేసిన తరువాత తన చుట్టూ ప్రశాంతత నెలకొందని నాగార్జున చెబుతున్నారు. ఈ విషయాన్నీ నాగార్జుననే స్వయంగా పలు సందర్భాలలో తెలిపారు. రాబోయే వారంలో నాగార్జున నటించిన “శిరిడి సాయి” చిత్రం విడుదల అవుతుండగా అయన మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో “శిరిడి సాయి” చిత్రం గురించి “డమరుకం” చిత్రం గురించి తన భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలిపారు. ఇదిగోండి మీకోసం మా మధ్య జరిగిన సంభాషణ
ప్ర) అన్నమయ్య, శ్రీ రామదాసు ప్రస్తుతం శిరిడి సాయి ఈ ప్రయాణం ఎలా ఉంది?
జ) ఈ మూడు చిత్రాలు చాలా మంచి అనుభవాలు ఆ రెండు చిత్రాలలో నేను భక్తుడిగా కనిపించాను ఇందులో నేనే సాయి బాబాలా కనిపించడం చాలా కొత్త అనుభూతి. ఇది పక్కన పెడితే “శ్రీ రామదాసు” మరియు “అన్నమయ్య” చిత్రాలలో సినిమాటిక్ అంశాలను చాలా పొందుపరచాం కాని ఇందులో ఆ అవకాశం లేదు, చారిత్రక అంశాలను పరిశీలించి వాటినే ఉపయోగించాము. ఈ చిత్రం కోసం రాఘవేంద్ర రావు గారు తత్వంలోకి వెళ్లి చిత్రాన్ని అద్భుతంగా రాబట్టారు.
ప్ర) అయితే శిరిడి సాయి చిత్రం సాయి బాబా జీవితం అంటారా?
జ) చాలావరకు అని చెప్పవచ్చు సాయి బాబా జీవితంలో కొన్ని అంశాలను ఈ చిత్రంలో చూపించలేదు. అయన కొన్నాళ్ళ పాటు శిరిడిని వదిలి వెళ్ళిపోయారు ఈ విషయంలో ఎందుకు వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అన్నది ఎవరికీ తెలియని విషయం ఇక్కడే కాస్త సినిమాటిక్ గా కొంత డ్రామా కలిపి చిత్రీకరించాల్సి వచ్చింది.
ప్ర) దేవుడి పాత్రలో నటించడం అంటే సామాన్యమయిన విషయం కాదు. ఈ విషయంలో ఏమయినా టెన్షన్ ఫీల్ అయ్యారా?
జ) ఆశ్చర్యకరంగా లేదు. నేను చేసిన చిత్రాలలో సులభంగా చేసిన చిత్రం “శిరిడి సాయి”. నేను శిరిడి సాయి గురించి చాలా చదివి తెలుసుకున్నాను అయన తత్వాన్ని చాలా బాగా అర్ధం చేసుకున్నాను అయన ఈ చిత్రం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది.
ప్ర) ప్రేరణ కోసం గతంలో వచ్చిన శిరిడి సాయి చిత్రాలను చూసారా?
జ) లేదు. ఈ చిత్రంలో ఈ పాత్ర మీద నా స్వంత శైలి ఉండాలి అనుకున్నాను. కొంతమంది గతంలో వచ్చిన శిరిడి సాయి చిత్రాల డివిడిలు కూడా ఇచ్చారు కాని నేను చూడలేదు. కాని డైలాగ్స్ విషయానికి వస్తే అలానే చెప్పవలసి వస్తుంది. కాబట్టి అన్ని డైలాగ్స్ ని చాలా ఆహ్లాదంగా మరియు ప్రేమగా చెప్పవలసి వస్తుంది.
ప్ర) ఈ చిత్రం కమర్షియల్ ప్రదర్శన గురించి మీ అంచనాలు ఏంటి?
జ) నిజానికి నేను కమర్షియల్గా ఈ చిత్రం గురించి ఆలోచించట్లేదు. ఈ చిత్రం మీద ఉన్న ఆసక్తి మూలాన మంచి ఓపెనింగ్స్ వస్తుంది తరువాత ఏమవుతుంది అన్నది నేను అంచనా వెయ్యలేదు ఎందుకంటే అన్నమయ్య పదిరోజుల తరువాత మంచి టాక్ ని సంపాదించుకుంది మేము మా వంతు కృషి చేశాము ఫలితం కూడా అలానే ఉంటుంది అని ఆశిస్తున్నాం.
ప్ర) సాయి బాబా తత్వంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి?
జ) సాయి బాబా బోధనలు చాలా సరళంగా ఉంటాయి. మతం గురించి కాని, నమ్మకాల గురించి కాని క్లిష్టమయిన అంశాలు కాని ఉండవు అయన చెప్పినది అంతా ఒక్కటే చుట్టూ ఉన్న జనంతో ప్రేమగా మరియు మంచిగా ఉండు అని మాత్రమే. సాయి బాబా బోధనలకు నేను చాలా ఆకర్షితుడిని అయ్యాను ఎప్పటినుండో నేను తత్వానికి అలవాటు పడ్డాను జాన్ లేనన్ “ఇమాజిన్” పాట నాకు చాలా ఇష్టమయిన పాట.
ప్ర) ఈ చిత్రానికి ఇప్పటికే మంచి పబ్లిసిటీ లభించినట్టు కనిపిస్తుంది.
జ) (నవ్వుతు) అంతా బాబా లీల ప్రజలు తమంతట తామే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. చాలా మంది స్వతహాగా ఈ చిత్ర హోర్డింగ్ లను వారి బిల్డింగ్ల మీద ఉంచుతున్నారు.
ప్ర) శిరిడి సాయి చిత్రీకరణ అయిపోయిన వెంటనే లవ్ స్టొరీ చిత్రంలో పాత్ర కోసం పూర్తిగా మారిపోయారు కష్టం అనిపించిందా?
జ) అవును. అందుకోసమే నేను భిన్నమయిన హెయిర్ కట్ మరియు లుక్ తో కనిపించాను. శిరిడి సాయిలో నా పాత్ర ప్రభావం నుండి జనం బయటకు రావాలి అంటే ఇలాంటిది ఏదయినా చెయ్యాల్సిందే కాబట్టి ఇలా విభిన్నంగా కనిపించడానికి ప్రయత్నించాను.
ప్ర) చివరి సాయి బాబా చిత్రం చాలా రోజుల క్రిందట వచ్చింది ఈ తరం వాళ్ళు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారా?
జ) అవుతారనే అనుకుంటున్నాను ఈ మధ్య గుడిలో చాలా మంది భక్తులను చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళు చిత్రం మీద ఆసక్తి చూపితే వాళ్ళు చూడబోయేది ఏంటో వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది కదా. ఎవరు శిరిడి సాయి చిత్రాన్ని వినోదం కోసం చూడరు. ఈ చిత్రంలో ఏం అంశాలు ఉంటాయనేది జనంకి తెలుసనే నేను అనుకుంటున్నాను.
ప్ర)అయితే ఈ చిత్రంలో సాయి బాబా సద్గురు నుండి దేవుడిగా మారడాన్ని చూపెడుతున్నారా?
జ) లేదు. సాయి పలు సందర్భాలలో తను దేవుడి దూతని మాత్రమే అని చెప్పుకున్నారు ఈ చిత్రంలో కూడా అదే విషయం ప్రస్తావించాము. మొదట్లో అయన హారతి ఇవ్వటాన్ని కూడా ఒప్పుకునేవారు కారు కాని అయన 80 ఏళ్ళు వచ్చాక హారతి ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
ప్ర) తెలుగు చిత్రం కమర్షియల్గా కొత్త పుంతలు తొక్కుతుంది మీరు దీన్నిమీరు మిస్ అయ్యారని భాధ పడుతున్నారా?
జ) లేదు సాధారణంగా మన కమర్షియల్ స్థాయి ఇంకా సరిగ్గా ఉండటం లేదు వచ్చిన కలెక్షన్లను చూసి మనం చాలా తృప్తి చెందుతున్నాం కాని మన చిత్రాలకు ఇంతకు మించి మూడు రెట్లు ఎక్కువగా వసూళ్లు చెయ్యగల సామర్ధ్యం ఉంది. దీని కోసం టికెట్ ధరలను పెంచాలి, అన్ని నిత్యావసర ధరలను పెంచుతున్నారు కాని సినిమా టికెట్ ధర మాత్రం పెంచట్లేదు ఇది మంచిది కాదు ప్రభుత్వం మాకు సహకరించడం లేదు చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరికి లక్ష్యంగా మారింది పైరసీ బూతం ఉండనే ఉంది ఇది కాకుండా రాజకీయనాయకులు కూడా చిత్ర పరిశ్రమ అంటే చులకనగా చూస్తున్నారు
ప్ర) ఒక నెల తేడాలో “శిరిడి సాయి” మరియు “డమరుకం” చిత్రాలు విడుదల అవుతున్నాయి ఇది సమస్యగా అనిపించలేదా?
జ) నిజానికి లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఎంతటి బ్లాక్ బస్టర్ చిత్రమయిన సరే నాలుగు వారాల తరువాత జనం పట్టించుకోవడం లేదు కాబట్టి ఇది అసలు సమస్యే కాదు.
ప్ర) డమరుకం కోసం చార్మీ తో ఐటం సాంగ్ పూర్తి అయ్యిందా?
జ) అయిపోయింది ఈ చిత్రం ఎప్పుడో పూర్తి అయ్యింది ఈ చిత్రం చూసాక మరి కొంత మసాలా చేకూర్చితే బాగుంటుంది అనిపించింది కాబట్టి ఈ పాట కోసం అడిగాను మొదట స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఈ పాట లేదు ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి కొన్ని సన్నివేశాలను చూసాను ఇప్పుడు అర్ధం అయ్యింది ఈ చిత్రం ఎందుకింత ఆలస్యమవుతుంది. ఈ చిత్ర అవుట్ పుట్ నాకు సంతృప్తిని ఇచ్చింది.
ప్ర) భవిష్యత్తు చిత్రాలు ఏంటి?
జ) “లవ్ స్టొరీ” చిత్రం అయిపోగానే వీరభద్రం దర్శకత్వంలో “భాయ్” చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో నా పాత్రధారణ కోసం నేను కష్టపడుతున్నాను. నాన్నగారు మరియు నాగ చైతన్యలతో కలిసి చేస్తున్న చిత్రం రాబోయే సంవత్సరం మొదలు అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర స్క్రీన్ ప్లే మీద పని చేస్తున్నాం. దీని తరువాత దుర్గ ఆర్ట్స్ మరియు బెల్లంకొండ సురేష్ లతో చిత్రాలు చేయ్యనున్నాను. నానుండి బెస్ట్ ఇంకా రావలసి ఉంది 50 ఏళ్ళ తరువాత నా జీవితం చాలా బాగుంది. ఇప్పటి నుండి ప్రతి చిత్రాన్ని ప్రత్యేకంగా చెయ్యాలని అనుకుంటున్నాను.
ప్ర) అఖిల్ సిని రంగ ప్రవేశం గురించి?
జ) (నవ్వుతూ) ఇంకా కాస్త సమయం పడుతుంది ఆ విషయాన్నీ నేను అఖిల్ కే వదిలేస్తున్నాను “చుట్టూ ఉన్న పోటీ చూడు వాళ్ళని ఎదుర్కోనగలవు అని అనుకునప్పుడు నా దగ్గరకు రా” అని చెప్పాను.
ప్ర) మన పరిశ్రమ ఎదుర్కుంటున్న కష్టాలు?
జ) టికెట్ ధరలను వెంటనే పెంచాలి. ప్రస్తుతం ఇది చాలా అవసరం నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరికి మన పరిశ్రమ లక్ష్యంగా మారింది. పైరసీ లాంటివి చాలా సమస్యలు ఉన్నా ముందుగా మనం చెయ్యవలసింది టికెట్ ధరలను పెంచడం మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో టికెట్ ధరలను గమనించండి తమిళనాడు లో కూడా పెంచారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణ ధర కూడా పెరిగింది.
ప్ర) శిరిడి సాయి గురించి ఏమయినా చెప్పాలి అనుకుంటున్నారా?
జ) ఇది హృదయాన్ని హత్తుకునే చిత్రం ముఖ్యంగా రెండవ అర్ధ భాగం జనం ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను రాఘవేంద్ర రావు గారు మరియు కీరవాణి గారు ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు ఈ చిత్రం నా జీవితంలో ప్రత్యేక చిత్రంగా మిగిలిపోనుంది.
అదండీ నాగార్జున గారితో మేము జరిపిన సంభాషణల విశేషాలు. డమరుకం చిత్రం కోసం చేస్తున్న ఐటెం సాంగ్ చిత్రీకరణ నుండి నాగార్జున నేరుగా వచ్చి మాతో మాట్లాడారు.తరువాత మా నుండి సెలవు తీసుకొని ఇంటికి పయనమయ్యారు. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఆకట్టుకున్దనే అనుకుంటున్నాం.