రేపు విడుదల కానున్న ‘ అందాల రాక్షసి’ చిత్రంలో రాహుల్ ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రాహుల్ తో పాటు లావణ్య మరియు నవీన్ కూడా ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. రాహుల్ ఈ సినిమాలో గౌతమ్ అనే పాత్రను పోషించారు. అలాంటి రాహుల్ తో మేము ప్రత్యేకంగా ముచ్చటించాము . రాహుల్ బాగా చదువుకున్న విద్యావంతుడు, ఆహ్లాదకరమైన మనస్తత్వం మరియు తను వృత్తిని గౌరవించే విధానం ఎంతో బాగుంది . రాహుల్ మాతో పంచుకున్న విశేశాలేంటో చూసేద్దమా..
ప్రశ్న) ‘అందాల రాక్షసి’ చిత్రం పై మీకున్న అంచనాలు ఏమిటి?
జ)నాకు చాలా భారీ అంచనాలే ఉన్నాయండీ మరియు నేను చేసిన ఈ సినిమా చాలా మంచి సినిమా అని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ చిత్రంలో మేము అంతా కలిసి చాలా బాగా నటించాము దీనికి గల కారణం ఏమిటంటే దర్శకుడికి ఈ సినిమా పై ఉన్న ఖచ్చితమైన ఆలోచనలు మరియు ముఖ్యంగా ఆయనకు ఏమికావాలో అనే విషయంలో ఎంతో స్పష్టంగా ఉన్నారు. నాకు ఎక్కడో చిన్న భయం ఉన్నా, సినిమా విడుదలకి దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై నమ్మకం బలపడుతోంది.
ప్రశ్న) ఈ చిత్రంలో మీరు చేసిన గౌతమ్ పాత్ర గురించి మరింత వివరించి చెప్పగలరా?
జ)అందరినీ ప్రేమిస్తూ, అందరికీ ప్రేమపంచే మనస్తత్వం కలవాడు గౌతమ్. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రుడి లాంటి వాడు. చంద్రుడు ఎలాగైతే ఎప్పుడూ చల్లదనాన్ని పంచుతాడో అలాగే గౌతమ్ కూడా తన చుట్టూ ఉన్న అందరి పట్లా మంచి భావాలు కలిగి ఉండాలనే తత్వాన్ని అందరికీ పంచుతూ ఉంటాడు. గౌతమ్ పాత్ర చంద్రుడిని ప్రతిబింబించేలా ఉంటుంది. గౌతమ్ చాలా కూల్ గా ఉంటూ, ఓర్పు మరియు వినయ విధేయతలు కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరు చెప్పే విశేషాలను ఎంతో ఓర్పుగా వినే మనస్తత్వం మరియు చుట్టూ ఉన్న వారి మంచి కోసం ఏమన్నా చేసే స్వభావం కలవాడు. దర్శకుడు ఈ పాత్రని చాలా బాగా తీర్చిదిద్దారు మరియు నాకు గౌతమ్ పాత్రను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది, అర్థమైన తర్వాత ఎంతో సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాను.
ప్రశ్న) అందాల రాక్షసి’ చిత్రంలో ఈ పాత్రకు మిమ్మల్ని ఎలా ఎంపిక చేసుకున్నారు?
జ)ఈ అవకాశం మాత్రం పూర్తిగా లక్ వల్లే వచ్చింది అని చెప్పుకోవాలి. నా స్నేహితులు నన్ను హనుకి సూచించారు ఆ తర్వాత నేను నా ఫోటోలు అతనికి పంపాను. అవి చూసిన హను నన్ను ఒకసారి వచ్చి కలవమన్నారు అప్పుడే నేను హనుని కలవడానికి హైదరాబాద్ కి వచ్చాను. నేను మొదటి సారి అతన్ని చూడగానే అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నా ఎందుకంటే అతను అంత యంగ్ గా ఆన్నారు. అతనితో కొంత సేపు మాట్లాడిన తర్వాత అతను చాలా పరిణతి చెందిన వ్యక్తి అని నాకు అర్థమైంది. అతను నన్ను, నా బాడీ లాంగ్వేజ్ చూడటానికే రమ్మన్నారు. ‘ ఒకసారి మీరు ఈ పాత్రకి సరిపోతారు అనుకుంటే మీకు నటించడం చాలా సులువుగా ఉంటుందని’ హను నాతో అన్నారు. ఫైనల్ గా గౌతమ్ పాత్రకి నేను సరిపోయాను, ఈ పాత్ర ఎప్పుడు సానుకూల భావాన్ని కలిగి ఉండి, ఈర్ష, ద్వేషాలకు దూరంగా ఉంటూ మరియు అందరికీ ప్రేమను పంచే మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది.
ప్రశ్న) మీరు ఒక నటుడు అవ్వాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?
జ)నేను నా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత అహ్మదాబాద్ లోని ఎం.ఐ.సి.ఎ కాలేజీలో ఎం.బి.ఎ చేశాను. ఆ తర్వాత రేడియో సిటీ అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ గా పని చేశాను. ఆ సమయంలో ఒక రోజు ముంబైలోని ఒక రెస్టారెంట్ లో కూర్చోని భోజనం చేస్తున్న సమయంలో ఒక లేడీ నన్ను చూసి నా దగ్గరకి వచ్చి ఒక యాడ్ కోసం మిమ్మల్ని ఒకసారి ఆడిషన్ చెయ్యాలనుకుంటున్నాను మీకు ఇష్టమేనా అని అడిగారు. ఆ యాడ్ ని దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వచ్చిన పవర్ రెంజర్స్ తమిళ వర్షన్ కి నన్ను డబ్బింగ్ చెప్పమన్నారు. అది చాలా ఆనందంగా ఉనింది. ఆ తర్వాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ‘ మాస్కో కావేరి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం తర్వాత ఇక నా ఉద్యగం మానుకొని పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టాలనుకున్నాను. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసిన తర్వాత నాకు ‘అందాల రాక్షసి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ప్రశ్న) మీ హాబీస్ ఏమిటి?
జ)నేను లెక్కలేనన్ని సినిమాలు చూస్తుంటాను. అలాగే నేను ఎక్కువగా క్రీడా విభాగాల గురించి ఎక్కువగా చదువుతూ ఉంటాను. నేను క్రమం తప్పకుండా ఫుట్ బాల్ మరియు టెన్నీస్ ఆడుతూ ఉంటాను. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం మరియు క్రీడలకు సంబందించిన అందరి గురించి తెలుసుకుంటూ ఉంటాను. అవి కాకుండా నా సిస్టంలో ఎన్నో గేమ్స్ ఆడుతూ ఉంటాను. నేను కొత్త స్నేహితులను చాలా తొందరగా ఏర్పరుచుకోగలను కానీ ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులే నాకు మంచి స్నేహితులు. మేము చిన్న చిన్న వాటికి కూడా తరచూ కలుస్తూ ఉంటామండీ కానీ నాకు పొగ త్రాగడం మరియు మందు తాగడం లాంటి అలవాట్లు లేవండీ(నవ్వుతూ).
ప్రశ్న) మీకు హైదరాబాద్ ఎంత వరకూ నచ్చింది?
జ)హైదరాబాద్ చాలా బాగుంది. హైదరాబాద్ ప్రజలు చాలా మంచి వారు. నా ఫ్యామిలీ ని ఇక్కడికి తీసుకు రావడానికి ఇంకొంత సమయం పడుతుంది. నేను ఈప్పతి వరకూ చాలా మెట్రో పోలిటన్ నగరాల్లో నివసించాను కానీ అన్నింటి కంటే హైదరాబాద్ బెస్ట్. ఇక్కడి ప్రజల్ని నేను చాలా ఇష్ట పడుతున్నాను.
ప్రశ్న) దర్శకుడు హను మరియు ‘అందాల రాక్షసి’ టీంతో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది?
జ)హను నాకు లైఫ్ టైం ఫ్రెండ్ అయిపోయారు. నా కెరీర్లో నేను గొప్పగా చెప్పుకునే చిత్రం ‘అందాల రాక్షసి’ . నవీన్ మరియు లావణ్య లతో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. లావణ్య వృత్తికి చాలా గౌరవం ఇస్తారు మరియు తన పని తానూ చక్కగా చేసుకుంటూ పోతారు. సెట్ లో తనకిచ్చిన డైలాగ్స్ తో ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంటుంది మరియు ఆమె నటన కూడా చాలా బాగుంది. నవీన్ చాలా మంచి వ్యక్తి మరియు చాలా మంచి కో స్టార్. అతను అందరి దగ్గరా అతన్ని ప్రమోట్ చేసుకునేదాని కంటే నా గురించే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు.
ప్రశ్న) ఫైనల్ గా వచ్చిన ‘అందాల రాక్షసి’ అవుట్ పుట్ పై సంతృప్తిగా ఉన్నారా?
జ)చాలా సంతృప్తిగా ఉన్నానండీ. అందాల రాక్షసి ఒక మాజిక్ లాంటి సినిమా. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మరియు విజువల్స్ చూసినప్పుడు నేను మైమరిచిపోయాను. ఈ సినిమా చూడటానికి వచ్చే సినీ అభిమానులందరూ ఒక గొప్ప అనుభూతికి లోనవుతారని దృడంగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా సినిమాని ఇంతలా ప్రమోట్ చేసినదానికి సాయి కొర్రపాటి గారికి మరియు విహారి గారికి నేను నా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్ర ట్రైలర్స్ చూసిన తర్వాత నాకు చాలా మంది నా నటన చాలా బాగుందని అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని పూర్తిగా చూసిన తర్వాత హను నన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు, అది నేను ఎప్పటికీ మరిచిపోలేనిది.
ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయబోయే చిత్రాలేమిటి?
జ)ప్రస్తుతం నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి కానీ ‘అందాల రాక్షసి’ చిత్రం విడుదల అయ్యేంత వరకూ నేను ఎలాంటి సినిమా ఒప్పుకోదలుచుకోలేదు. ప్రస్తుతం నేను తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాను. ఖచ్చితంగా త్వరలోనే తెలుగు సినిమాలు చేస్తాను.
ప్రశ్న) దీన్ని చదివే పాఠకులకు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
జ)హను ఈ చిత్రంలో రూపొందించిన ప్రత్యేక పాత్రల ద్వారా ప్రేక్షకులు మంచి అనుభూతిని లోనవుతారు. అలాగే మిమ్మల్ని ఈ చిత్రం బాగా అలరిస్తుంది. ఈ చిత్రంలో మంచి పాటలున్నాయి, మంచి విజువల్స్ తో ఎంతో కలర్ ఫుల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘అందాల రాక్షసి’ ఒక స్వచ్చమైన ప్రేమకథ. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
అంతటితో రాహుల్ గారితో జరిగిన ఇంటర్వ్యూ ముగిసింది. రాహుల్ గారితో చేసిన ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘అందాల రాక్షసి’ చిత్రం విజయం సాదించి రాహుల్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.