ఇంటర్వ్యూ : చరణ్ ఎన్ని సినిమాలు చేసినా అది మర్చిపోలేని సినిమా – వినాయక్

Vinayak
ఆది, చేన్నవకేశవ రెడ్డి, సాంబ ఇలా ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వినాయక్ బన్నీ, కృష్ణ సినిమా నుండి కామెడీ యాక్షన్ సినిమాలు తగ్గించి కామెడీ బాట పట్టాడు. రామ్ చరణ్ తో తీసిన లేటెస్ట్ మూవీ ‘నాయక్’ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా వివి వినాయక్ తన ఆనందాన్ని మాతో పంచుకున్నారు. వినాయక్ చెప్పిన ముచ్చట్లు మీకోసం.

ముందుగా నాయక్ ఇంత పెద్ద హిట్ అయినందుకు మీకు కంగ్రాట్స్.
వినాయక్ : థాంక్యూ (నవ్వుతూ).

ప్ర : సినిమా విడుదలైన తరువాత రెస్పాన్స్ ఎలా ఉంది?
స : మొదట్లో కలెక్షన్స్ తక్కువ వస్తున్నాయి ఏంటి అనుకున్నాం. సంక్రాంతికి మూడు నాలుగు రోజుల ముందే విడుదల కావడం వల్ల పండగ ముందు రోజుల్లో కలెక్షన్స్ తక్కువగా ఉంటాయి. 13 నుండి కలెక్షన్స్ ఉధృతంగా ఉన్నాయి. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 31 కోట్ల వరకు షేర్ వచ్చింది. మేము ఏం ఆశించామో అది 100% రీచ్ అయ్యాము. మేము అనుకున్నది ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ యాక్షన్ సినిమా అనుకుని అందరూ వస్తారు, లోపలి వచ్చాక కామెడీ చూసి థ్రిల్ ఫీల్ అవుతారు అనుకున్నాను. జనాలు కూడా అదే ఫీల్ అవుతున్నారు.

ప్ర : రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ కథ చేయాలనే ఐడియా ఎవరిది?
స : మొదట రామ్ చరణ్ తో సినిమా అనుకున్నపుడు కథ కోసం సెర్చ్ చేసాము. మంచి హిట్ సినిమా చేద్దాము అనుకున్నాం. శివ ఈ కథ చెప్పినపుడు ఇంటర్వెల్ బ్లాక్ బాగా నచ్చింది. దానిని అలా డెవలప్ చేసాము.

ప్ర : కృష్ణ సినిమా నుండి మీ సినిమాల్లో కామెడీ బాగా పేలుతుంది కానీ మీ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ మాత్రం తగ్గిపోతుంది అనే కంప్లైంట్ ప్రేక్షకుల్లో ఉంది. దీనిపై మీ కామెంట్.
స : సాంబ చేసిన తరువాత నా సన్నిహితులు, స్నేహితులు కొంతమంది ఇంక ఈ యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలు చేయొద్దు మానెయ్యండి అని సలహా ఇచ్చారు. బన్నీ సినిమాలో కామెడీ టచ్ చేసాక ఇది బావుందనిపించింది. ఇప్పుడున్న ఆడియెన్స్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడుతున్నారు. పిల్లలు కూడా కామెడీ కావాలంటున్నారు. ఆడియెన్స్ ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్లుగానే మనం మారుతూ ఉండాలి. ఇందులో కూడా కావాలనే కామెడీ ఎక్కువ పెట్టాను. నా సినిమా ఎవరికీ నష్టం రావొద్దని కోరుకుంటా.

ప్ర : బద్రీనాథ్ అనుభవం తరువాత ఈ సినిమాకి ఏమైనా మార్పులు చేయాలనుకుని చేసారా బద్రీనాథ్ మీ మీద ఏమైనా ప్రభావం చూపిందా?
స : బద్రీనాథ్ చుసిన వారందరూ ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గింది, కామెడీ తగ్గింది అని చాలామంది అన్నారు. ఇందులో కామెడీ ఎక్కువగా పెట్టి చేద్దాం అనుకున్నాం. నా సినిమా చూడటానికి వచ్చిన వాళ్లు ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ఉండాలి అనుకున్నాను. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యాను.

ప్ర : కాజల్ కథానాయికగా పెట్టుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా?
స : మగదీరతో చరణ్, కాజల్ హిట్ పెయిర్, ఆ సినిమాలో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ నాకు బాగా నచ్చింది. చరణ్ తో సినిమా అనుకుని, కథ ఓకే అయినపుడు కాజల్ హీరోయిన్ అని ఫిక్స్ అయ్యాను.

ప్ర : చిరంజీవి సినిమాల్లో రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమా రీమేక్ చేస్తారు? ఎవరితో చేస్తారు?
స : చిరంజీవి గారి సినిమాల్లో ఖైదీ రీమేక్ చేయాలనుంది. ఎలా చేయాలని అనుకోలేదు కానీ ఆ సినిమా చరణ్ తో చేయాలని ఉంది.

ప్ర : సినిమా చూసాక ఇవి బెటర్ గా చేసుంటే బావుండేది, ఇవి ఇంకా బావుండేది అని ఏమైనా అనిపించిందా?
స : అలా ఏమి అనిపించలేదు. మేము అనుకున్న కథని, సీన్స్ ని ది బెస్ట్ గా తీసాము. వన్ పర్సంట్ కూడా ఇదిలా తీసుంటే బావుండేది అని ఫీలవ్వలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బావ, బామ్మర్ది ఎపిసోడ్ ఇంకా బాగా తీసుండాలి అనిపించింది. ఆ ఎపిసోడ్ ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్నాను.

ప్ర : పోసాని కృష్ణ మురళి ఎపిసోడ్ పెట్టాలనే ఐడియా ఎవరిది? ఆ చాక్లెట్ సన్నివేశానికి డైలాగులు ఆయనే సొంతంగా రాసుకున్నారా?
స : సెకండ్ హాఫ్ ఫుల్ సీరియస్ మోడ్లో వెళుతున్నప్పుడు ప్రేక్షకులు రిలాక్స్ కావాలని ఒక కామెడీ పార్ట్ పెట్టాలనుకున్నాం. ఆ ఎపిసోడ్ కి పోసాని అయితేనే న్యాయం చేయగలడని అనిపించింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మా టీంలో మొదటి వ్యక్తి ఆయనే. సినిమాలో డైలాగ్స్ అన్ని ఆకుల శివనే రాసాడు.

ప్ర : ఈ సినిమా చూసిన చాలామంది నాలుగైదు సినిమాలు మిక్సీ చేసి తీసారని అంటున్నారు. కావాలనే ఇలా చేసారా?
స : గతంలో పెద్ద హిట్ అయిన పెద్ద సినిమాలు కూడా ఇది భాషా సినిమాలగా ఉందని, ఇది సమరసింహా రెడ్డి సినిమాలగా ఉందని అన్నారు. మనదగ్గరనే కాదు దబాంగ్ సినిమా కూడా చాల కంప్లైంట్స్ వచ్చాయి. ఓవర్ అల్ గా ఈ సినిమాని ఈ సినిమాలాగే ఎంజాయ్ చేయాలి. కంప్లైంట్ చేసేది రెగ్యులర్ సినిమా లవర్స్. కామన్ ఆడియెన్స్ ఈ సినిమాని ఈ సినిమాలాగే చూసి ఎంజాయ్ చేస్తారు. నేను తీసిన సినిమా జనాలకి అర్ధమైందా, ఎంజాయ్ చేసారా లేదా అనేది చూసుకుంటాను.

ప్ర : చిరంజీవి గారి కెరీర్లో ఠాగూర్ సినిమాకి హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నాయక్ కూడా ఫస్ట్ వీక్ హైయెస్ట్ వచ్చాయి. రెండు సినిమాలకి మీరే దర్శకుడు కదా. ఎలా ఫీలవుతున్నారు?
స : ఈ సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ వస్తుండొచ్చు కానీ మగధీర అంత గొప్ప సినిమా ఏమీ కాదు. చిరంజీవి గారికి ఖైదీ లాగా చరణ్ కి మగధీర. చరణ్ ఎన్ని సినిమాలు చేసినా అది మర్చిపోలేని సినిమా.

ప్ర : మెగా ఫామిలీలో చిరంజీవి, అల్లు అర్జున్, చరణ్ ముగ్గురితో చేసారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తున్నారు? చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు?
స : ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాం కానీ కథ సరిగా లేక చేయలేదు. కళ్యాణ్ గారితో తప్పకుండ చేస్తాను. ఆయన క్యారెక్టర్ బబ్లీగా ఉండేలా ఒక సినిమా చేయాలని ఉంది.

ప్ర : నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు?
స : బెల్లకొండ సురేష్ అబ్బాయితో చేయబోతున్నాను. కథ ఇంకా ఏం అనుకోలేదు. లవ్ స్టొరీ ఉంటూ దాని వెనకాల బలమైన కథ ఉండేలా అనుకుంటున్నాను.

వినాయక్ నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఇలాగే కమర్షియల్ గా పెద్ద విజయాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాము.

అశోక్ రెడ్డి .ఎమ్

Exit mobile version