ఇంటర్వ్యూ : ‘మాచర్ల నియోజకవర్గం’ మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఫామిలీస్ ఎంజాయ్ చేస్తారు – కృతి శెట్టి

Published on Aug 6, 2022 8:32 pm IST

 

నితిన్, కృతి శెట్టి, క్యాథరీన్ త్రెసా హీరో హీరోయిన్స్ గా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ప్రస్తుతం తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ మూవీ మాచర్ల నియోజకవర్గం. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్, పోస్టర్లు ఆడియన్స్ లో మూవీ పై మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ ద్వారా మెగాఫోన్ పడుతుండగా మహతి స్వరసాగర్ దీనికి సంగీతం అందించారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న ఈ మూవీ ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి నేడు మీడియాతో తన మూవీ అనుభవాలు పంచుకున్నారు.

 

కరోనా తరువాత టాలీవుడ్ లో వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి కదా, దానిపై మీ అభిప్రాయం ?

నాలోని ప్రతిభని గుర్తించి నాకు వరుసగా మంచి ఛాన్స్ లు ఇస్తున్న దర్శకనిర్మాతలకు ప్రత్యేక థాంక్స్, ఇలా వరుసగా సినిమాలు చేయడం ఎంతో ఆనందాన్నిస్తుంది.

 

అయితే వరుసగా ఛాన్స్ లు వస్తున్న నేపథ్యంలో మీ కెరీర్ కి ఉపాయాగపడే సరైన కథలు, మంచి పాత్రలు ఎంచుకోవడం సాధ్యపడుతుందా ?

నేను ఇండస్ట్రీకి వచ్చి ఏడాది పైన అవుతుంది, ఇక నాకు వర్క్ అంటే ఎంతో ఇష్టం, తరచు షూటింగ్ లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది, అలానే నా వద్దకు వచ్చే కథలన్నీ కూడా మంచి పాత్రలే అవడం నాకు ప్లస్ అవుతోంది. అయితే వాటి యొక్క ఫలితాలు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ముఖ్యంగా వారికీ మంచి వినోదాన్ని అందించే రోల్స్ ని నేను ఎంచుకుంటాను.

 

మాచర్ల నియోజకవర్గంలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

ఇందులో నా పాత్ర పేరు స్వాతి, సింపుల్ గా ఇన్నోసెంట్ గా సాగె క్యారెక్టర్. అయితే సందర్భాన్ని బట్టి క్యారెక్టర్ లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను.

 

మాచర్ల నియోజకవర్గం కథ ఎలా సాగుతుంది ?

పూర్తిగా కథ గురించి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. నావద్దకు వచ్చిన మంచి స్క్రిప్ట్స్ లో ఇది ఒకటి. ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు పొలిటికల్ డ్రామా, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూవీ అన్నివ వర్గాల ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీస్ కి మరింతగా నచుతుంది. వీకెండ్ లో వస్తుంది కాబట్టి అందరూ చక్కగా థియేటర్స్ కి వచ్చే చూస్తే తప్పకుండా ఎంతో ఎంజాయ్ చేస్తారు.

 

నితిన్ గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?

ఆయన ఎంతో నిజాయితీ గల వ్యక్తి. అలానే ఆయనలో అందమైన అమాయకత్వం కూడా ఉంటుంది. బహుశా అందుకే ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 20 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా హీరోగా ఇంకా ఎంతో మంచి ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయనతో వర్క్ ఎంతో ఈజీగా ఉంటుంది, సరదాగా ఉంటారు. ఇద్దరం సెట్స్ లో వర్క్ తరువాత మంచి స్నేహితులం అయ్యాము, నన్ను కూడా దీవించండి అని కోరాను. తప్పకుండా మా ఇద్దరి కాంబో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

 

ఈ మూవీ షూటింగ్ అనుభవం గురించి ?

ఈ మూవీ లో వర్కింగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. షూటింగ్ వెళ్లడం ఎంతో హ్యాపీగా అనిపించేది. వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంద్రజ గారు వంటి మంచి ఎక్స్ పీరియన్స్ పర్సన్గ్స్ మధ్య వర్క్ చేయడం ఎంతో హ్యాపీ. వారందరికంటే నేను చిన్నదానిని, అయినప్పటికీ అందరూ ఎప్పుడూ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉండేవారు. అలానే మరికొందరు అయితే నాకు మంచి ఫుడ్స్, స్వీట్స్ ప్రత్యేకంగా పంపించేవారు.

 

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గురించి ?

ఆయన చాలా కూల్ పర్సన్, ఏ మాత్రం కోపం రాదు సరికదా ప్రతి సీన్ ని ఎంతో ఎగ్జైటింగ్ గా చెప్పడానికి ట్రై చేస్తారు. ఎప్పుడూ సెట్స్ లో అందరితో ఎంతో కలివిడిగా సరదాగా ఉండే వ్యక్తి. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ లా ఈ మూవీకి వర్క్ చేసారు. ఆయన తో మరొక మూవీ చేయాలనీ ఉంది. తప్పకుండా ఆయనకు ఈ మూవీ ద్వారా మంచి విజయం లభిస్తుందని నమ్ముతున్నాను.

 

ఉప్పెన తరువాత బలమైన రోల్స్ చేయలేదనే భావన ఉందా ?

నిజానికి ఉప్పెన నాకు ఎంతో పేరు తెచ్చింది. ఆ తరువాత ఒక్కొక్కటిగా ఆఫర్స్ రావడం మొదలైంది. నిజానికి అనంతరం ఎక్కువగా నా వద్దకు వచ్చిన మూవీస్ కమర్షియల్ జానర్ కలిగి ఉన్నవే. ప్రతి సినిమా ఒక అనుభవం, అలానే అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా కోరిక. త్వరలో సూర్య, ఇంద్రగంటి గారి మూవీస్ లో విభిన్న తరహా పాత్రల్లో కనపడతాను. మరిన్ని విభిన్న పాత్రలు కథల ఎంపిక విషయమై జాగ్రత్త తీసుకుంటున్నా.

 

ఉప్పెన లో ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించారు, ఆడియన్స్ కి కూడా ఎంతో నచ్చింది, మరి ఆ పాత్ర మీకు భారంగా అనిపించిందా ?

నిజానికి ఉప్పెన మూవీలో ఆడియన్స్ ని నా పాత్ర ఆకట్టుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే ప్రతి సినిమా అలాంటి పాత్రలే వస్తాయి అనేది చెప్పలేము కదా. ముఖ్యంగా ఆ రోల్ చేసేటపుడు స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి గారిని చూసి ఎంతో నేర్చుకున్నాను. నటనకు వెర్సటాలిటీ ముఖ్యం అందుకే ఆ వెంటనే శ్యామ్ సింగారాయ్ చేశాను, అందులో నా పాత్ర ఉప్పెన బీబమ్మ రోల్ కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలా వరుసగా మరిన్ని విభిన్న పాత్రలతో ఆడియన్స్ కి చేరువ అవ్వాలనేది నా కోరిక.

 

లేడీ ఓరియెంట్ రోల్స్ చేసే ఆలోచన ఉందా ?

నిజానికి ఉప్పెన తరువాత మధ్యలో ఒకటి రెండు అటువంటి లేడీ ఓరియెంటెడ్ రోల్స్ వచ్చాయి కానీ సిమిలర్ గా ఉంటాయని నేనే ఒప్పుకాదు. నిజానికి ఇప్పటికి అయితే లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలనే ఆలోచన లేదు. అది ఒకింత బాధ్యతతో కూడిన పని. ఒకవేళ డైరెక్టర్స్ ఎవరైనా బలమైన కథ, కథనం, పాత్రతో నా వద్దకు వస్తే అప్పుడు ఆలోచిస్తాను.

 

బాలీవుడ్ అవకాశాలు వచ్చాయా ?

వచ్చాయి కానీ నాకు పెద్దగా ఆసక్తి లేదు. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా మంచి సినిమాలు చేయాలనేది నా ఆలోచన, కోరిక. అలానే ఇక్కడ నాకు మంచి ఆదరణ లభిస్తోంది అది చాలు.

.

సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ?

నాకు చిన్నపాటి నుండి ఒక ఎన్జీవో స్టార్ట్ చేయాలని ఉంది, దానిపై ఒక ఆలోచన ఉంది త్వరలోనే స్టార్ట్ చేస్తాను.

 

ఫ్రెండ్ షిప్ డే ప్లాన్ ఏంటి, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ?

నేను ముంబై లో ఉన్నపుడు ఫ్రెండ్ షిప్ డే రోజున బాండ్శ్ కట్టుకుని వేడుక చేసుకునే వాళ్ళం. నాకు నిజానికి బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మ అనే చెప్పాలి. కొందరు మంచి స్నేహితులు కూడా ఉన్నారు.

 

నెక్స్ట్ మూవీస్ గురించి చెప్పండి ?

సూర్య గారితో ఒక మూవీ, ఇంద్రగంటి సుధీర్ బాబు గారి మూవీ, నాగ చైతన్య గారితో ఒక మూవీ తో పాటు మరికొన్ని కథ చర్చల్లో ఉన్నాయి, ఫైనలైజ్ అవ్వగానే చెప్తాను.

మీ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ కి ‘ఆల్ ది బెస్ట్’ థాంక్యూ

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :