ఇంటర్వ్యూ: మనోజ్-పాండవులు పాండవులు తుమ్మెదకు సీక్వెల్ ని కూడా అనుకున్నాం

Manchu-Manoj
నిన్న విడుదలైన మంచు వారి మల్టీ స్టారర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా మంచి స్పందనను సంపాదించుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మంచు మనోజ్ వేసిన లేడీ గెట్ అప్ కు ప్రత్యేక ప్రశంసలు వస్తున్నాయి. ఈ యువ హీరో మీడియా ముందు తన ఆనందాన్ని వెళ్లబుచ్చాడు. అదేమిటో చూద్దామా..

1. మీ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన ఎలా వుంది?

సినిమాకు వస్తున్న స్పందన అద్భుతం. మా సినిమా చాలా మంచి సమీక్షలతో నడుస్తుంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు

2 ఈ విజయాన్ని మీ కుటుంబం ఎలా జరుపుకుంటుంది?

మా కుటుంబం అంతా చాలా ఆనందంగా వున్నాం. ఇది సమిష్టి విజయం. ప్రతీ ఒక్కరికీ ఈ విజయం చెల్లుతుంది

3 మీ లేడి గెట్ అప్ కు చాలా ప్రశంసలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం?

నేను చాలా ఆశ్చర్యంతో స్వీకరించాను. నిజానికి ఈ ప్రొజెక్ట్ లో నేను వుండేవాడిని కాదేమో. కానీ ఈ పాత్ర రాసుకున్నాక నేను చేస్తేనే బాగుంటుందని అనుకున్నారు. మిగిలిన కధ మీకు తెలిసినదే

4 నాన్నగారు, అన్నయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?

నేను నా కుటుంబంతో గడిపే అవకాశం రావడం వల్ల చాలా నచ్చింది. షూటింగ్ రోజుఒలను మిస్ అవుతున్నాం అన్న భావన కలుగుతుంది

5. మీరు లేడీ గెట్ అప్ పై తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఏమన్నా వుందా?

ఆ పాత్ర వేషధారణ మొత్తం మా మంచు లక్ష్మి నే తయారు చేసింది. నాకు రెడీ అవ్వడానికి రోజులు మూడు గంటలు పట్టేది. అందులోనూ షూటింగ్ చేసింది వేసవికాలం. ఇక నా కష్టాల్ ఆలోచించండి.

6 ఈ సినిమాకు గోల్ మాల్ 3 కు కొన్ని సంబంధాలు వున్నాయని అంటున్నారు. దానికి మీరేం అంటారు?

మేము గోల్ మాల్ 3 నుండి అంతర్లీనమైన కధను తీసుకున్నాం అంతే. ద్వితీయార్ధం మొత్తం మార్చేశాం

7 మరోసారి మంచు ఫ్యామిలీ అంతా కలిసి నటించే అవకాశం వుందా?

నిజానికి ఈ పాండవులు పాండవులు తుమ్మెదకు సీక్వెల్ ని చెయ్యాలనే ఆలోచన వచ్చింది. కానీ ఇంకా ఏ విషయం ఖరారు కాలేదు

8 మంచు లక్ష్మిని సినిమాలో పెడుతూ ఒకపాటను కూడా తీశారుగా.. ఆ పాట ఏమైంది?

ఆ పాటను మరో ఒకటి రెండు రోజులలో సినిమాలో జత చేరుస్తాం

9 వరుణ్ సందేశ్, తనీష్ లతో నటించడం ఎలా వుంది?

నేను నా ఆప్త మిత్రులైన వరుణ్, తనీష్ లను ఎంచుకుని మంచిపనే చేశాను. వారు వారి పాత్రలలో ఒదిగిపోయారు

10 మీ తదుపరి సినిమాలు?

నా తరువాతి సినిమా నాగేశ్వర రెడ్డి తీస్తున్నారు. ఇందులో హన్సిక కధానాయిక. నేను నా సొంత బ్యాన్నర్ లో ‘సన్ ఆఫ్ పెదరాయుడు’ కూడా తీస్తున్నా

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version