ఇంట‌ర్వ్యూ: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ – డైరెక్ట‌ర్ శివ పాల‌డుగు

ఇంట‌ర్వ్యూ: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ – డైరెక్ట‌ర్ శివ పాల‌డుగు

Published on Jun 12, 2024 6:02 PM IST


అజ‌య్ ఘోష్, చాందిని చౌద‌రి లీడ్ రోల్స్ లో న‌టించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అన్ని ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు శివ పాల‌డుగు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేస్తుండ‌టంతో, ప్ర‌మోష‌న్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు మీడియాతో పంచుకున్నారు.

ఈ సినిమాకు అజ‌య్ ఘోష్ ను హీరోగా ఎందుకు తీసుకున్నారు..?

రొటీన్ క‌థ‌ల‌కు భిన్నంగా ఈ క‌థ‌ను రాసుకున్నా. అందుకే, ఈ సినిమా క‌థ‌కు అజ‌య్ ఘోష్ అయితే ప‌ర్ఫెక్ట్ గా ఉంటార‌ని భావించాను. ఎమోష‌న్స్ ను ఆయ‌న బాగా పండిస్తార‌ని నాకు తెలుసు. నేను ఊహించిన‌దానికంటే ఆయ‌న బాగా చేశారు.

చాందిని చౌద‌రి పాత్ర ఎలా ఉంటుంది..?

ఈ సినిమాలో చాందిని చౌదరి పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. మూర్తి జీవితంలో ఆమె ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేది సినిమాలో చూపించాం. అంజ‌న పాత్ర‌లో చాందిని ప‌ర్ఫార్మెన్స్ ఔట్ స్టాండింగ్ గా ఉంది.

ఈ మూవీలోని మ్యూజిక్ గురించి చెప్పండి..?

ఈ సినిమాలో సంగీతం కోసం తొలుత మ్యూజిక్ పై రిసెర్చ్ చేశాం. ట్రెండీ, క్లాసికల్ మ్యూజిక్ ల‌పై ప‌రిశోధించాం. ప‌వ‌న్ మంచి సంగీతాన్ని అందించాడు. పాట‌లు ఎక్క‌డా ఇరికించిన‌ట్లుగా అనిపించ‌వు.

తొలి సినిమాతో ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నారు..?

నాకు దొరికిన టీమ్ స‌పోర్ట్ తో సినిమా చాలా ఈజీగా పూర్త‌య్యింది. అయితే, సినిమాను తెర‌కెక్కించ‌డం కంటే కూడా పోస్ట్ర్ ప్రొడ‌క్ష‌న్, రిలీజ్ వంటివి చాలా క‌ష్టంగా అనిపించాయి. మొత్తానికి మా సినిమా జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తోంది.

మీ సినిమాపై ఎలాంటి న‌మ్మ‌కం ఉంది..?

సినిమాలో కంటెంట్ స‌రిగా ఉంటే చిన్నా, పెద్ద అనే తేడా ఏమీ లేదు. మా సినిమాలోని కంటెంట్, ఎమోష‌న్స్ ఆడియెన్స్ కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటాయి. అందుకే ఈ సినిమా వారికి ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నా.

చాందిని చౌద‌రి రెండు సినిమాలు ఒకే రోజు వ‌స్తున్నాయి.. ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

చాందిని న‌టించిన ‘యేవ‌మ్’ కూడా జూన్ 14నే వ‌స్తుంది. అయితే, ఆ సినిమా జోన‌ర్ వేరు.. మా సినిమా జోన‌ర్ వేరు. మా సినిమాలో ఎమోష‌న్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా క‌నెక్ట్ అవుతుంది.

మీ నెక్ట్స్ చిత్రాలు ఏమిటి..?

ఈ సినిమా స‌క్సెస్ పైనే నా నెక్ట్స్ ప్రాజెక్టులు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయ్యాక వాటిని అనౌన్స్ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు