ఇంటర్వ్యూ : ముస్కాన్ సేథీ – ‘రాధాకృష్ణ’ సినిమాలో ఒక సీరియస్ నెస్ ఉంటుంది

ఇంటర్వ్యూ : ముస్కాన్ సేథీ – ‘రాధాకృష్ణ’ సినిమాలో ఒక సీరియస్ నెస్ ఉంటుంది

Published on Feb 5, 2021 1:00 AM IST

ప్ర‌ముఖ ద‌ర్శకుడు`ఢ‌మ‌రుకం`ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మిస్తున్నారు. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముస్కాన్ సేథీ ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

సినిమాలో నా పాత్ర పేరు రాధా. చాలా సంప్రదాయబద్దంగా ఉండే పాత్ర. చుట్టుపక్కల వారికి సహాయం చేసే గుణం ఉన్న అమ్మాయి పాత్ర. నిర్మల్ అంటే చేతి కళలకు ప్రసిద్ధి. నిర్మల్ బొమ్మలకు మంచి పేరుంది. కానీ ప్రజెంట్ మార్కెట్లో వాటికి ఆదరణ తగ్గింది. ఆ బొమ్మలు చేసేవారి జీవనోపాధి దెబ్బతింది. అలాంటి వారు తిరిగి నిలదొక్కుకోవడానికి సహాయం చేసే పాత్రలో నటించాను.

 

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

నిజానికి శ్రీనివాస్ రెడ్డిగారితో ఇదే నా మొదటి సినిమా. ‘రాగల 24 గంటల్లో’దీని తర్వాతే చేశాను. కానీ అదే ముందు విడుదలైంది. దీన్ని 2020 ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ లాక్ డౌన్ వలన కుదరలేదు. అందుకే ఆలస్యమైంది.

 

ఈ విలేజ్ అమ్మాయి పాత్ర కోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు ?

ఇందులో నేను టీచర్ పాత్రలో కూడ కనిపిస్తాను. డాన్స్ టీచర్ పాత్ర. ఈ పాత్ర కోసం డాన్స్ కూడ నేర్చుకోవాల్సి వచ్చింది. స్వర్ణ అనే డ్యాన్స్ మాస్టర్ భరతనాట్యం నేర్పించింది. డిక్షన్ బాగా రావడానికి డైరెక్టర్ ఒక టీచర్ ను పెట్టారు. షూటింగ్ తర్వాత గంట రెండు గంటలు విలేజ్ డిక్షన్ ఎలా మాట్లాడాలో నేర్పించేవారు. పల్లెటూరి అమ్మాయిలా కనబడటానికి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాను.

 

మీకు ఛాలెంజింగా అనిపించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ?

ఒక పాట కోసం మాత్రం చాలా కష్టపడ్డాం. ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 8 అయింది. రోజు మొత్తం సెట్లోనే ఉన్నాం. ఆరోజు చాలా కష్టం అనిపించింది. అయినా పాటను పూర్తిచేశాం.

 

సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారు ?

సినిమా మీద, కథ మీద చాలా నమ్మకం ఉంది. ప్రేక్షకులు వెళ్లి సినిమాను చూస్తే తప్పకుండా నచ్చుతుంది. అనవసరమైన కామెడీ ఉండదు. స్వీట్ లవ్ స్టోరీ. చాలామంచి కథ. ప్రతిదానికీ లాజిక్ ఉంటుంది. కథలో సీరియస్ నెస్ ఉంటుంది. లోకల్ చేతి వృత్తులవారికి సపోర్ట్ చేయడమనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది.

 

మీకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉన్నాయా ?

ఇది కూడ నా డ్రీం పాత్రల్లో ఒకటి. మహేష్ బాబుగారు, చిరంజీవిగారు, రవితేజగార్లతో వర్క్ చేయాలని ఉంది. విలేజ్ పాత్ర చేయాలనేది కూడ నా కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది.

 

ఓటీటీ, వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారా ?

రెండు వెబ్ సిరీస్ లు చేశాను. కానీ సినిమాకు, వాటికి తేడా ఉంది. ఒకేసారి ఒక సినిమా చూడటం డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. మంచి సినిమాలు కూడా ఓటీటీల్లోకి వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో నటించడం నాకు ఇష్టమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు