ఇంటర్వ్యూ : నాని – “టక్ జగదీష్” తర్వాత నుంచి ఇంకా కొత్త నానీని డెఫినెట్ గా చూస్తారు.

ఇంటర్వ్యూ : నాని – “టక్ జగదీష్” తర్వాత నుంచి ఇంకా కొత్త నానీని డెఫినెట్ గా చూస్తారు.

Published on Sep 9, 2021 1:18 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “టక్ జగదీష్” నేరుగా ఓటిటి లో రిలీజ్ కి సన్నద్ధం అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం రేపు వినాయక చవితి కానుకగా ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. పలు కారణాల చేత థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నాని తాజా ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. మరి దానిలో ఇంకెలాంటి ఆసక్తికర విషయాలు చెప్పారో చూద్దాం రండి.

చెప్పండి శివ గారు “టక్ జగదీష్” మీకు ఎలా కుదిరింది?

నేను అప్పటికి ఏదో సినిమా డబ్బింగ్ లో ఉన్నాను, అప్పటికే శివ ది మజిలీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కూడా అయ్యిపోయింది. ఆ టైం లో నాకు కాల్ చేసి ఇలా కథ ఉంది అనుకుంటున్నాం అని చెప్పారు. అప్పటికి నేను కొన్ని కథలు అందాకా వద్దు అనుకుంటూ ఇలా కాదు డైరెక్ట్ గా కలుద్దాం అని చెప్పి మీట్ అయ్యాను. అప్పుడు తాను జస్ట్ ఓపెనింగ్ లైన్ మాత్రం చెప్పాడు పూర్తి సినిమా కూడా కాదు.. ఒక బ్లాంక్ లో నాజర్ గారి వాయిస్ ఓవర్ తో డైలాగ్ ఉంటుంది అది విని నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది. పైగా నేను కొత్త జానర్ కోసం చూస్తున్నాను ఇంకా శివ బంధాలను చాలా బాగా హ్యాండిల్ చెయ్యగలడు లాస్ట్ సినిమాల్లో లవ్ ని ఎలా చూపించాడో అలనాటి డైరెక్టర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎలా చూపిస్తాడో అని గట్టు నమ్మకం ఉంది అందుకే ఈ రెండు కారణాలు కుదిరి టక్ జగదీష్ టేకప్ అయ్యింది.

సినిమాకి ముందే “టక్ జగదీష్” అని పెట్టారా లేక వేరే కారణం ఉందా?

ముందే మేము టక్ జగదీష్ అని పెట్టలేదు. అది జస్ట్ సినిమాలో ఒక పాత్ర పేరు మాత్రమే.. అలా ఎందుకు పెట్టాం అంటే శివ ఎప్పుడు చాలా నాచురల్ గా మన ఊర్లలో మన స్నేహితులని బంధువులని పిలుచుకుంటామో అలాంటి ఫీల్ తోనే పెడతాడు ఈ సినిమాలో అందరికి కూడా లానే ఉంటాయి. సపోజ్ కొంత మందికి ఆల్రెడీ ఉన్న పేర్లే చాలా ఉంటాయి కానీ ఏ జగదీష్ అంటే ఏం చెప్తాం? అందుకే వారికి ఒక ఐడెంటీ లా ఒక్కో పేరు పెడతాం అలా టక్ జగదీష్. అలాగే ఈ సినిమాలో అసలు టక్ జగదీష్ ఎందుకు? ఎప్పుడు టక్ లోనే ఎందుకు ఉంటాడు అనే దానికి సెకండాఫ్ లో ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. అది కంప్లీట్ గా ఒక రైటర్ గా శివ సీన్ అంతే..

శివ గారు మీకేదో ట్విస్ట్ చెప్పారట దానికి మీరు బాగా ఇంప్రెస్ అయ్యారటగా?

అది ట్విస్ట్ అంటే.. ట్విస్ట్ అని చెప్పలేము కానీ ఆ పర్టిక్యులర్ గా ఒక ఎమోషన్ దగ్గర ఇలాంటి సినిమాల్లో ఒక వ్యక్తి ఇది కాదు వేరే అని చూపించడం చాలా కొత్తగా ఉంటుంది. దానిని శివ చాలా బాగా హ్యాండిల్ చేసాడు..

మరి రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ల పాత్రలు ఎలా ఉంటాయి?

రీతూ రోల్ వచ్చి సినిమాలో చిన్న టోన్ చేంజ్ చేసే రోల్ లా ఉంటుంది. జగదీష్ కి తన రోల్ లవ్ ట్రాక్ లా. కానీ ఐశ్వర్య రోల్ మాత్రం ఈ సినిమా ఆయువు పట్టులాంటిది అని చెప్పాలి. ఎందుకంటే తన ఎమోషన్ నే టక్ జగదీష్ తీసుకెళ్తాడు తనకి మేనకోడలుగా తాను కనిపిస్తుంది. ఇద్దరివీ కూడా సెపరేట్ ట్రాక్స్.. నాకు తెలిసి సినిమా షూట్ లో కూడా వారిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు అనుకుంటా.!

లాస్ట్ రెండు సినిమాల నుంచి చూస్తే మీ నుంచి ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టు ఉంది?

ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఒక్క కామెడీ అనే కాదు ఏ సినిమా చూసినా కూడా ఒక ఆడియెన్ ని రెండున్నర గంటల పాటు థియేటర్స్ లో కూర్చోపెట్టి లాస్ట్ కి మంచి సినిమా చూసామే అనుకునేలా చెయ్యాలి. లాస్ట్ నా ‘జెర్సీ’ ఉంది సీరియర్ ఉంది అన్నారు కానీ దానికి కూడా ఎంతోమంది కనెక్ట్ అయ్యినవారు ఎమోషనల్ గా ఉన్నారుగా? నేను అలానే అనుకుంటాను ఎప్పుడూ నాకు కొత్త టెస్ట్ కావాలి అనుకుంటా రెగ్యులర్ రోల్స్ అయితే చేసెయ్యగలను ఎగ్జైట్మెంట్ అనిపించదు. ఇప్పుడు వచ్చే శ్యామ్ సింగ రాయ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. టక్ జగదీష్ తర్వాత నుంచి ఖచ్చితంగా చెప్తున్నాను ఒక కొత్త నానీని మీరు చూస్తారు.

మీరు నో చెప్పి హిట్టయిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా?

నేను నో చెప్పి అని కాదు కానీ ఇవి హిట్ అవుతాయి అని తెలిసి కూడా వదిలేసిన సినిమాలు ఉన్నాయి. అప్పట్లో డైరెక్టర్ అట్లీ ‘రాజా రాణి’ నా దగ్గరకి తీసుకొచ్చాడు పైగా ఆ సినిమాపై చాలా క్లియర్ గా ఉన్నాడు. కానీ నేను రెండు సినిమాల్లో బిజీ సో అప్పుడు నేను చెయ్యాలి అంటే ఏడాది ఆగాల్సి వస్తుంది అన్నా సో వద్దు నా కోసం అంత వెయిటింగ్ ప్రొసీడ్ అయ్యిపోమన్న ఇంకా ‘ఎఫ్ 2’ ఇలా చాలా సినిమాలే వచ్చాయి.

మన మిగతా స్టార్ హీరోస్ నుంచి యంగ్ హీరోస్ కూడా రీమేక్స్ చేస్తున్నారు మీకు అలాంటి ప్లానింగులు ఉన్నాయా?

లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంక రీమేక్ సినిమాలు చెయ్యను. స్టార్టింగ్ లో భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం చేశాను కానీ తర్వాత నిర్ణయం మార్చుకున్నా ఆల్రెడీ ఎక్కడో చేసినవి నేను చెయ్యడం కాకుండా నన్ను నేను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవాలని అనుకుంటున్నా అందుకే రీమేక్స్ చెయ్యకూడదని ఫిక్స్ అయ్యా. మనం సినిమాలు చేద్దాం మన సినిమాలు వాళ్ళు రీమేక్ చేసుకుంటారు.

ఇప్పుడు అందరి నుంచి పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి. మీ నుంచి ఏమన్నా?

నా ఉద్దేశంలో పాన్ ఇండియన్ సినిమా అని కాదు కానీ ఇపుడు ట్రెండ్ అంతా ఒక రకంగా మారిపోయింది. నేనే ఉన్నాను ఇది వరకు వేరే భాషల సినిమాలు చూసేవాడిని కాదు కానీ ఇప్పుడు సబ్ టైటిల్స్ పెట్టుకొని ఫ్రెంచ్ సినిమాలు చూస్తున్నా ఆలా అర్ధం అయ్యిపోతుంది. ఇంకా లేటెస్ట్ గా మనీ హెయిస్ట్ అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఒరిజినల్ చూసాను మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ డబ్ లో చూడలేకపోతున్నా అందరు ఇలానే చూస్తున్నారు. ఇంకో రెండేళ్లలో ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు ఒరిజినల్ సినిమానే వాళ్ళ సబ్ టైటిల్స్ లో చూసినప్పుడు ఇంకా పాన్ ఇండియన్ సినిమా ఏముంది? నేను అలా ఫీల్ అవుతున్నా.

మరి మీ నుంచి ఓటిటి టైప్ సినిమాలు కానీ సిరీస్ లు కానీ ఆశించొచ్చా?

లేదు నేను కంప్లీట్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైనర్ ని మాత్రమే నాకు ఓటిటి పై ఆలోచనలు ఏం లేవు.. ఇంకా ఇప్పుడు టక్ జగదీష్ కి ఇంటర్వెల్ లేదనే బాగా ఫీల్ అవుతున్నా.. ఆ హై ఇచ్చే అంశం అయితే థియేటర్స్ లో బాగా ఇచ్చే వాళ్ళం కానీ ఇందులో అలాంటివి ఏం ఉండవుగా.

మరి మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు కోసం చెప్పండి

హిట్ 2 చేస్తున్నాం అడివి శేష్ తో అది 70 పర్సెంట్ అలా కంప్లీట్ అయ్యింది. ఇంకా దేనిని పెద్ద ఫ్రాంచైజ్ లా చెయ్యాలి అనుకుంటున్నాం. అంటే హిట్ 2 ని మించి హిట్ 3, 4 అలా ఈ ఫ్రాంచైజ్ పెద్దగా వెళ్తుంది. మీట్ క్యూట్ కూడా కంప్లీట్ అయ్యింది దానిని డిజిటల్ గానే అనుకుంటున్నాం. ఇది మాత్రం సర్ప్రైజింగ్ గా ఉంటుంది..

మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం ఏమన్నా చెప్పండి?

ప్రెజెంట్ శ్యామ్ సింగ రాయ్ ని అయితే ఈ ఏడాది ఎండింగ్ కి ప్లాన్ చేస్తున్నాం. థియేటర్స్ ఎంత త్వరగా ఓపెన్ అయితే దాన్ని అంత త్వరగా ప్రెజెంట్ చేస్తా. ఇక అంటే సుందరానికి మూడో స్కెడ్యూల్ లో ఉన్నాం చాలా బాగా వస్తుంది. వచ్చే ఏడాది నుంచి అంటే సుందరానికి నుండి రీసౌండ్ సాలిడ్ గా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు