యంగ్ హీరో నితిన్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘హార్ట్ ఎటాక్’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ తో కాసేపు ముచ్చటించాం. ఆయన సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ని, తన రాబోయే సినిమాల గురించి మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) హార్ట్ ఎటాక్ పెయిన్ ఎలా ఉంది? సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
స) హార్ట్ ఎటాక్ ఇచ్చిన పెయిన్ చాలా స్వీట్ గా ఉంది. ఎంజాయ్ అంటే పెద్దగా ఏం లేదండి.. టీం అంతా ఎంతో కష్టపడి పనిచేశాం. సినిమాకి మంచి టాక్ రావడంతో అందరం చాలా ఆనందంగా ఉన్నాం..
ప్రశ్న) వరుస ఫ్లాపులు చూసిన మీరు ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ సక్సెస్ లు మీలో ఏమన్నా మార్పును తీసుకొచ్చాయా?
స) అలా ఏమీ లేదండి, ఈ హ్యాట్రిక్ సక్సెస్ ల తర్వాత కూడా నేను నార్మల్ గానే ఉన్నాను. ఒకవేళ నేను అన్ని ఫెయిల్యూర్స్ చూడకపోయి ఉంటే నా కళ్ళు నెత్తికి ఎక్కేవేమో కానీ అన్ని ఫెయిల్యూర్స్ చూడటం వల్ల సక్సెస్ మరియు ఫెయిల్యూర్ విలువ తెలుసుకున్నాను.
ప్రశ్న) వరుసగా రెండు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేసారు. కానీ హార్ట్ ఎటాక్ లో కాస్త వయొలెన్స్ ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది ఫీలవుతారని ఏమన్నా అనుకున్నారా?
స) అలా ఏమీ లేదండి.. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. అలాగే ఈ మూవీలో వయొలెన్స్ అంటే మరీ ఎక్కువగా రక్తం చూపించేలా లేదండి. హీరో పాత్రని ఎలివేట్ చేయాలంటే విలనిజం కాస్త ఎక్కువ ఉండాలి. ఆప్పుడే యాక్షన్ ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని నేను నమ్ముతాను.
ప్రశ్న) డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరోయిన్ ఆద శర్మ గురించి చెప్పండి?
స) పూరి గారు మిస్టర్ కూల్ డైరెక్టర్. ఎలాంటి టెన్షన్ ఉండదు, కోపం రాదు, ఎంత పెద్ద సమస్య ఉన్న చాలా కూల్ గా ఉంటారు. అలాగే కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కాబట్టి సెట్లో ఆయన హ్యాపీగా ఉంటే షూటింగ్ అంతా చాలా హాయిగా సాగిపోతుందని నమ్ముతాను. అదే నేను పూరి గారిలో చూసాను.
అలాగే ఆద శర్మ చాలా బాగా చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మేమిద్దరం కలిసి చేసిన సీన్స్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఆ అమ్మాయి బాగా చేసిందనే కదా అర్థం.
ప్రశ్న) శాంతి థియేటర్స్ లో సినిమా చూసాక ఎడ్చేసారట. మీరు అంత ఎమోషనల్ అవ్వడానికి గల కారణం ఏమిటి?
స) మా సినిమాకి రిలీజ్ కంటే ముందే ఇండస్ట్రీలో చాలా మంది నెగటివ్ పబ్లిసిటీ చేసారు. కానీ ఆ నెగటివ్ పబ్లిసిటీని తట్టుకొని కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందనే ఆనందంలో వచ్చిన కన్నీళ్ళే తప్ప బాధతో వచ్చినవి కాదండి. అలా ఏడుస్తూ పూరి గారిని హత్తుకుంటే ఆయన కూడా ఏడ్చేశారు.
ప్రశ్న) ఇండస్ట్రీలో నెగటివ్ టాక్ రావడానికి గల కారణం ఏమిటంటారు?
స) ఎవరికీ సినిమా స్టొరీ తెలియదు, ఎవరూ సినిమా చూడలేదు కానీ నెగటివ్ టాక్ తీసుకొచ్చారు. ఎందుకు చేసారనేది కూడా నాకు అర్థం కాలేదు. ఈ మధ్య ఈ కల్చర్ ఇండస్ట్రీలో బాగా ఎక్కువైంది. నా సినిమాకనే కాదు చాలా సినిమాలకు ఇలానే జరుగుతోంది. వారికి నా మీద కోపమో, లేక పూరి గారి మీద కోపం ఉందో నాకు తెలియదు. అలాగే కొంతమంది రివ్యూల్లో రేటింగ్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. నా మనవి ఏంటంటే రివ్యూ అనేది ఆడియన్స్ పరంగా ఇవ్వండి మీ ఒపినియన్ అయితే ఓ పర్సనల్ బ్లాగ్ లో రాసుకోండి. నేను ఇలా ఎందుకంటున్నా అంటే ఆడియన్స్ కి సినిమా నచ్చింది కానీ రివ్యూలు మాత్రం సరిగా లేవు. కావున ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది రాయండి.
ప్రశ్న) పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకరూపంలో చూపించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నారా?
స) అలా ఏం లేదండీ.. నా మొదటి సినిమా జయం నుంచి ఆయన ఫోటో ఎక్కడో ఒక దగ్గర కనపడుతుంది. కానీ ఈ మధ్య పెద్ద హిట్స్ రావడం వల్ల అది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే చాలా మంది ఆయన పేరును వాడుకుంటున్నారని అంటుంటారు. కానీ ఆయనపై నాకున్న అభిమానం ఆయనకి పర్సనల్ గా తెలుసు. అందుకే ఆయన గానీ, నేను గానీ అలా అనుకోం. ఎవరేమనుకున్నా ఆయనంటే నాకు చాలా ఇష్టం, అలాగే సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు నాకు గాడ్. అందుకే ఆయనపై ఉన్న అభిమానాన్ని సినిమాల్లో చూపిస్తుంటాను.
ప్రశ్న) హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న తర్వాత మీ రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసారని వార్తలు వస్తున్నాయి? దీనిపై మీ కామెంట్?
స) ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు నా సొంత బ్యానర్ మూవీస్, కొరియర్ బాయ్ కళ్యాణ్ గౌతమ్ మీనన్ మీద ఉన్న ఇష్టంతో చేసాను. పూరి గారి బ్యానర్ కూడా నా సొంత బ్యానర్ లాంటిదే. అలాగే నేను నెక్స్ట్ చేయనున్న రెండు సినిమాలు కూడా నా సొంత బ్యానర్లోనే చేస్తున్నా, బయట వేరే నిర్మాతలకి చేయడం లేదు కనుక నా రెమ్యునరేషన్ పెరిగే అవకాశమే లేదు.
ప్రశ్న) దీన్నిబట్టి బయటి బ్యానర్స్ లో సినిమా చేయరా?
స) చాలా సినిమాలు ఫ్లాప్స్ చూసాను. అప్పట్లో సినిమా సరిగా రావడం లేదని నాకు తెలుస్తుంది కానీ ఏం చెయ్యలేం. అలాగే ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకోరు. అదే సొంత బ్యానర్ అయితే కథలో మార్పులు చేసుకోవచ్చు, సీన్స్, డైలాగ్స్ కూడా మార్చి రాసుకోవచ్చు. సినిమాని బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. సినిమా మేకింగ్ అంటే బాగా ఆసక్తి ఉన్న నిర్మాతలు ఎవరన్నా వచ్చి తను నాకు సింక్ అయితే కచ్చితంగా బయట బ్యానర్స్ లో కూడా చేస్తాను.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి? అలాగే కొరియర్ బాయ్ కళ్యాణ్ ఎంతవరకు వచ్చింది?
స) ఫిబ్రవరి 9న సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ మూవీ మొదలవుతుంది. అలాగే మార్చి మొదటి వారంలో కరుణాకరన్ సినిమా మొదలవుతుంది. కరుణాకరన్ సినిమా తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల్లాగా బాగా కామెడీగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్.
కొరియర్ బాయ్ కళ్యాణ్ కి నా పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ఇంక ఒక్క సాంగ్ మాత్రమే బాలన్స్ ఉంది. తమిళ్ లో వేరే హీరో చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ వెర్షన్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అవుతుంది.
అంతటితో నితిన్ తో మా ఇంటర్వ్యూని ని ముగించాం..
రాఘవ