స్పెషల్ ఇంటర్వ్యూ: మా చిత్రాల కంటే ఏవీ పెద్దవి కావు : రవిబాబు

స్పెషల్ ఇంటర్వ్యూ: మా చిత్రాల కంటే ఏవీ పెద్దవి కావు : రవిబాబు

Published on Nov 10, 2011 11:16 PM IST

సున్నితమైన, స్టైలిష్ సినిమాలు తీయటంలో ఘనత సాధించిన దర్శకుడు రవిబాబు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శకత్వం తో పాటు రవిబాబు ఒక మంచి యాక్టర్ కూడా. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నువ్విలా’ చిత్ర విజయం తో అతని హవా కొనసాగుతోంది. మరో కొత్త చిత్ర షూటింగ్ లో ఉన్న అతన్ని మా ప్రతినిధి మహేష్ కెఎస్ కలిసారు. పోలీసు యూనిఫారం లో ఆయన రూపం పెర్ఫెక్ట్ గా ఉంది.

Q . ముందుగా ‘నువ్విలా’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించినందుకు అభినందనలు.

A . (నవ్వుతూ) థ్యాంక్యూ వెరీమచ్…

Q . ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మీరు కొత్త వాళ్ళతో అద్బుతమైన నటన రాబట్టగలిగారు అదెలా సాధ్యమైంది.? నూతన నటీనటులతో ‘నువ్విలా’ చిత్రం చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ?

A. అజయ్, హవిష్, ప్రసాద్ మంచి ప్రతిభావంతులు. వీరు ఇంతవరకూ కెమెరా ముందు నటించింది తక్కువైనప్పటికీ బాగా చేసారు. వీళ్ళు దొరకటం నా లక్కీ నే కాదు, నాపని సులువైంది కూడా. వీళ్ళని పబ్లిక్ మంచిగా రిసీవ్ చేసుకోవటం ఆనందంగా ఉంది.

Q. కొత్త వారినే ప్రిఫర్ చేయటానికి కారణం..?

A. కొత్త వాళ్ళా.. పాతవారా.. అన్నది కాదు. ఇదంతా స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దానిప్రకారం ఎవరు బావుంటారనుకుంటే వాళ్ళతో చేయాలి. ‘నువ్విలా’ చిత్రం కొత్త వారైతేనే బావుంటుంది.

Q. ‘నువ్విలా’ వంటి అరుదైన సినిమాలు మినహా తక్కువ బడ్జెట్ చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద బోర్లా పట్టానికి కారణం..?

A. లో, హై బడ్జట్ అనే ప్రశ్న కాదు. ‘నువ్విలా’ చిత్రాన్నే తీసుకుంటే ఆ సినిమా టెక్నికల్ వాల్యూస్ కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల కంటే చాల ఎక్కువ. ప్రజలు ఎప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు అది నువ్విలా లో దొరికింది. ప్రేక్షకులు సినిమాని ఆదరించినప్పుడు అది చిన్న.. పెద్ద బడ్జెట్ అని చూడరు. ప్రజలే ఉత్తమ న్యాయ నిర్ణేతలు.

Q. శేఖర్ చంద్ర మీకిష్టమైన సంగీత దర్సకుడిలా ఉంది ఎందుకని..?

A. అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్. సందర్భానుసారంగా సంగీతం అందిస్తాడు. మాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అంతకంటే ఏమికావాలి? మాచిత్రాల కంటే ఏవి గొప్పవి చెప్పండి.?

Q. మీరు స్క్రీన్ పై బావుంటారు. మంచి కామిక్ టైమింగ్ కూడా వుంది. అయినా ఎందుకని మిమ్మల్ని తరచూ తెరపై చూడలేకపోతున్నాం.?

A. (నవ్వుతూ) అస్తమానూ కనిపిస్తే బోర్ కదా. (మళ్ళీ నవ్వుతూ) కానీ.. నాకు నటించటం ఇష్టం. అందుకని ఏదో రోల్ చేయటం నాకిష్టముండదు. అవసరం లేకుంటే నా సినిమాలో నైన నేను నటించను. ఇది నాకు మాత్రమే కాదు ప్రతీ ఆర్టిస్ట్ కూ వర్తిస్తుంది. ప్రస్తుతం నేను పోలీసు పాత్ర చేస్తున్నాను.

Q. పోలీస్ గెట్అప్ లో బావున్నారు. ప్రస్తుతం ఏ చిత్రం లో నటిస్తున్నారు..?

A. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు అయితే, ఇది జానీ గద్దర్ మూవీ రీమేక్.

Q. మీ భవిష్యత్ ప్రాజెక్టులు ఏమిటి?

A. ప్రస్తుతం నా తదుపరి చిత్రం కోసం కథ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ జనవరి 2012 నుండి ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నాము.

Q. మళ్ళీ కొత్తవారితోనేనా ?

A. సరే, అది ఇప్పుడే చెప్పటం కుదరదు. స్క్రిప్ట్ పూర్తి అయ్యాక మాత్రమే నటీనటుల గురించి ఆలోచిస్తాను. చెప్పను కదా .. స్క్రిప్టే కింగ్ అని.

Q. డ్రీం ప్రాజెక్ట్స్ ఏమైనా చేపట్టలను కుంటున్నారా..?

A. (నవ్వులు) నాకు ఏ డ్రీమ్స్ లేవు. ఇలా పనిలో ముందుకు వెళ్ళటమే..

అందండీ రవిబాబు చెప్పింది. అతనికి ఏమి.. ఎలా కావాలో ఖచ్చితం గా తెలిసిన వ్యక్తి రవిబాబు. మన ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే ఆయన షూటింగ్ లో మళ్ళీ బిజీ అయిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు