ప్రతేక ఇంటర్వ్యూ : పవన కళ్యాణ్ నాకు స్ఫూర్తి -నీలిమ తిరుమలశెట్టి

ప్రతేక ఇంటర్వ్యూ : పవన కళ్యాణ్ నాకు స్ఫూర్తి -నీలిమ తిరుమలశెట్టి

Published on Dec 8, 2011 2:02 PM IST

నీలిమ తిరుమలశెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అరుదైన వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఆమె ఒకరు. ఆమె 123తెలుగు.కాం టీంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె చెప్పిన మాటలు మీకోసం.

ప్ర: మీరు అనుకున్న రోజు రాబోతుంది భయంగా ఫీల్ అవుతున్నారా.

స: (నవ్వుతూ) అలాంటిదేమీ లేదు. సినిమా చాలా బాగా రావడంతో రిలాక్స్ గా ఉన్నాం. పంజా విజయం సాధిస్తుందని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం.

ప్ర: మీరు సినిమా నిర్మాణ రంగంలోకి రావడానికి గల కారణం.

స: పవన్ కళ్యాణ్ గారి వల్లే నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన తో కలిసి యువ రాజ్యం (ప్రజా రాజ్యం యువజన విభాగం) లో పని చేయడం జరిగింది. ఆయన నన్ను ఎప్పుడు ప్రోత్సహించే వారు.ఆయన కొత్త గా ఒక సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నపుడు నా భర్త అయిన నగేష్ మరియు శోభు మంచి స్నేహితులు అలా శోభు గారితో కలిసి ఈ సినిమా తీయాలని అనుకున్నాం.

ప్ర: ఒక పెద్ద స్టార్ హీరో అయిన పవన్ గారితో పంజా సినిమా తీసారు మీ అనుభూతి ఎలా ఉంది.

స: ఈ సినిమా తీసిన అనుభవము నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా నిర్మాణం నాకు బహుమానం లాంటింది మరియు చాలా సంత్రుప్తినిచింది. కానీ కొంత అలసిపోయం. మాకు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం లభించింది. విష్ణు వర్ధన్ అధ్బుతమైన పనితీరు గల నిపుణులలో ఒకడు. సినిమా బాగా రావడానికి ఆయన ఎంతో కృషి చేసారు.

ప్ర: పంజా సినిమాలో బాగా కనిపించే అంశాలు ఏమిటి?

స: పంజా కొత్త అనుభూతినిచ్చే సినిమా. ఈ సినిమాలో టేకింగ్ మరియు క్యారెక్టరైజేషణ్ చాలా కొత్తగా ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీ కి కొన్ని కొత్త స్టైల్ పరిచయం చేసే ప్రయత్నం చేసాం. ప్రతి పాత్ర ని డిఫరెంట్ గా మలచడం జరిగింది. మేము మొదటి కాపీ చూడటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.

ప్ర: బ్రహ్మానందం కామెడీ కామెడీ ట్రాక్ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. దాని గురించి చెప్తారా.

స: పాపా రాయుడు పాట చిత్రీకరించే సమయంలో బాగా ఎంజాయ్ చేసాం. బ్రహ్మానందం ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన సినిమా ద్వితీయార్థంలో వస్తారు. పవన్ మరియు బ్రహ్మానందం మద్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తెర మీద ఈ కాంబినేషన్ అధ్బుతంగా పండుతుంది.

ప్ర: మరి అలీ గురించి చెప్పండి. మీరు ఆయన పాత్రని హైలెట్ చేయడం లేదు దాని వెనుక ఏమైనా బలమైన కారణం ఉందా?

స: (నవ్వుతూ) అలీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. దాని గురించి ఇప్పుడే బహిర్గతం చేయడం బావుండదు. మీరు ఆ పాత్రని తెరపై చూసి ఎంజాయ్ చేయొచ్చు. అతను పవన్ అసోసియేట్ గా సినిమా ప్రథమార్ధంలో కనిపిస్తాడు.

ప్ర: పవన్ ఫ్యాన్స్ పంజా నుంచి బ్లాక్ బస్టర్ ఆశించవచ్చా?

స: ఖచ్చితంగా ఆశించవచ్చు. పంజా సినిమా చూసి బైటికి వచ్చేప్పుడు ఆనందం తో వస్తారు. సినిమాలో మసాల పంచ్ డైలాగ్స్ ఏమి ఉండవు. ట్రైలర్ లో చూపించిన విధంగా బాగా డెప్త్ ఉన్న డైలాగులు ఉన్నాయి. అబ్బూరి రవి అధ్బుతమైన డైలాగులు రాసారు.

ప్ర: సినిమా లో హీరోయిన్ కొత్త వాళ్ళు, పాత హీరోయిన్లని కాదని వీళ్ళని తీసుకోవటం సరైన నిర్ణయం అంటారా.

స: అవును. ఎప్పుడైతే ఒక సినిమా చేద్దాం అనుకున్నామో అప్పుడే కొత్త హీరోయిన్ ని పరిచయం చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ఇంతకముందే నిరూపించుకున్న హీరోయిన్ అయితే వాళ్ళతో పాటు వాళ్ళ గుర్తింపుని కూడా తెచ్చుకుంటారు. మేము ఎలాంటి అంచనాలు లేని ఒక హీరోయిన్ ని పెట్టాలని అనుకున్నాం.

ప్ర: పవన్ కళ్యాణ్ గారు సినిమా మొత్తం గడ్డం తో కనపడటానికి కారణం ఏమిటంటారు

స: విష్ణు వర్ధన్ స్క్రిప్ట్ మొత్తం చేపినపుడే పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించాలి అనుకున్నాం. ఇంతకముందు చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారితో గడ్డంతో ఒక ఫోటో షూట్ చేసాం నచ్చింది. మీకు సినిమా చూసాక అర్ధం అవుతుంది.

ప్ర: పవన్, బ్రహ్మానందం, హీరోయిన్స్ కాకుండా ప్రేక్షకుల ఇంకెవరి గురించి ఎదురు చూడవచ్చు

స: ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన అడివి శేష్ చాలా బాగా చేసాడు. జాకీ ష్రాఫ్ మరియు అతుల్ కులకర్ణి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ప్ర: డైరెక్టర్ గా విష్ణు వర్ధన్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు?

స: తను టాప్ క్లాస్ దర్శకుడు. అందరి నుండి అద్బుతమయిన పెర్ఫార్మెన్స్ రప్పించుకున్నాడు. కోల్కత, పొల్లాచ్చి ఇలా చాలా ప్రదేశాలలో షూట్ చేసినా తెలుగు నేటివిటీని మిస్ కాకుండా తీసాడు.

ప్ర: మీ భవిష్యత్ ప్రణాళిక?

స: నాకు ఈ ఇండస్ట్రీ అంటే ప్రేమ. రెండు కథలు డిస్కషన్ లో వున్నాయి. వెంటనే తమిళ్ లో భారీగా విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి చూస్తున్నాం.

ఈ మాటతో ఇంటర్వ్యూ పూర్తి చేసాము. నీలిమ గారికి భారీ విజయం దక్కాలని 123తెలుగు.కాం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు