ఇంటర్వ్యూ : రామ్ – “వారియర్” సినిమాని మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియర్స్ ఇచ్చేలా చేసాం

ఇంటర్వ్యూ : రామ్ – “వారియర్” సినిమాని మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియర్స్ ఇచ్చేలా చేసాం

Published on Jul 12, 2022 2:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “ది వారియర్” కోసం తెలిసిందే. తెలుగు మరియు తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కి మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా రామ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఇందులో ఏం పంచుకున్నాడో చూద్దాం రండి.

మీరు ముందే చాలా పోలీస్ కథలు విన్నారటగా అవి కాకుండా ఇదే ఎందుకు ఓకే చేశారు?

అవును ముందు చాలా కథలు పోలీస్ బ్యాక్ డ్రాప్ లో విన్నాను కానీ అవన్నీ ఎక్కడో విన్నట్టే చూసినట్టే అనిపించాయి. దీనితో ఇప్పుడప్పుడే చెయ్యకూడదని ఫిక్స్ అయ్యా. తర్వాత లింగుసామి గారు ఓ లైన్ ఉంది చెప్తాను అన్నారు అప్పటికి పోలీస్ స్టోరీ అని తెలీదు. కానీ తాను రివీల్ చేసాక మనసులో అబ్బా అనుకున్నా. కానీ ఒక్కసారి తాను నరేట్ చెయ్యడం స్టార్ట్ చేసాక అనిపించింది. ఇలాంటి స్టోరీ కోసం కదా నేను వెయిట్ చేసింది అని. ఈ సినిమాలో ఎమోషన్ కి నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఓకే చేశాను.

ఓ పెద్ద హిట్ తర్వాత ఏ హీరోకి అయినా కొన్ని సూచనలు ఉంటాయి అలాంటిది అంతగా ఫామ్ లో లేని లింగసామితో చెయ్యడానికి కారణం?

అలాంటివి ఉంటే నేను ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా చేసే వాడిని కూడా కాదు. పూరి గారు అయినా లింగుసామి కి అయినా వాళ్ళ స్క్రిప్ట్స్ తో ట్రెండ్ సెట్టర్స్. కొన్ని కనెక్ట్ అవ్వకపోయినా ప్రతి దాంట్లో వాళ్ళ బ్రిలియెన్స్ కనిపిస్తుంది. అలా పర్ఫెక్ట్ గా ఒకటి కానీ సెట్టయితే ఎలా ఉంటుందో చూస్తాం. వీళ్లంతా డైమండ్స్ లాంటి వాళ్ళు. ఫామ్ లో లేనప్పుడు వాటిపై దుమ్ము పడింది అనుకోవాలి కానీ వాటి షైన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది.

విలన్ రోల్ కి ఆది గారిని మీరే సజెస్ట్ చేసారా లేక డైరెక్టర్ ఆలోచనా?

నేనేం చెప్పలేదు కానీ ఈ సినిమాలో విలన్ రోల్ చేసేది ఎవరు అని నేను కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నాను అంత ఇంపాక్ట్ ఈ విలన్ రోల్ కి ఉంటుంది. అప్పుడు లింగుసామి గారు ఆది పేరు చెప్పారు, నాకు బాగానే అనిపించింది. కానీ అప్పటికే ఆది విలన్ గా చాలా సెలెక్టీవ్ గా ఉన్నాడు. ఇది చేస్తాడా లేదా అనుకున్నాం తనకి కథ చెప్పాక ఎగ్జైట్ అయ్యి వెంటనే ఒప్పుకున్నాడు.

గత కొన్ని రోజులు నుంచి ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఆడియెన్స్ రావట్లేదు అని దీనిపై ఏమంటారు?

అవును 6 వారాలు అయ్యింది కానీ మన తెలుగు ఆడియెన్స్ ని ఆ రేంజ్ లో రప్పించే సినిమాలు ఉంటే వాళ్ళు తప్పకుండా వస్తారు. RRR, కేజీఎఫ్ మహేష్ డి సర్కారు వారి పాట ఇవన్నీ థియేట్రికల్ గా ఆడియెన్స్ ని మెప్పించాయి. అలాగే ఎప్పుడో కరోనా టైం థియేటర్స్ ఓపెన్ చేస్తే ఇండియాలో ఫస్ట్ సినిమాని ఆదరించింది తెలుగు వాళ్లే. అలాంటివాళ్లు సినిమాని ఎప్పటికి ఆదరిస్తారు.

మరి “ది వారియర్” తో ఆడియెన్స్ ని రప్పించడానికి మీరేం చేశారు?

మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ తో ఈ సినిమా డిజైన్ చేసాం. థియేటర్స్ లో ఈ సినిమా చాలా బాగుటుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ గాని సాంగ్స్ గాని థియేటర్స్ లో ఆడియెన్స్ ని కాసేపు అలా ట్రాన్స్ లో ఉంచుతాయి. అందుకే దేవీ కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ట్యూన్స్ కోసం బాగా వర్క్ చేసాడు.

డీఎస్పీ మ్యూజిక్ కోసం చెప్పండి..

మా రోల్స్ వరకు చాలా మేము ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ కథ విన్నాక చాలా ఎగ్జైట్ అయ్యాం అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యి తన ఆఫీస్ కి వెళ్ళాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు అన్ని చెప్పేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదు. డీఎస్పీ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు.

కోవిడ్ టైంలో “వారియర్” అనే టైటిల్ బాగా పాపులర్ అయ్యింది, ఈ సినిమాకి లింకేమన్నా ఉందా?

ఖచ్చితంగా ఉంది. ఆ టైం ఫ్రంట్ లైన్ వారియర్ అనే పదం మా అందరికీ చాలా బాగా నచ్చింది. ఆ కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్లు ఎంతో కష్టపడ్డారు. ఆ టైప్ లోనే మేము కూడా ఈ సినిమాకి వారియర్ అనే టైటిల్ పెట్టాం.

కృతి శెట్టి కోసం చెప్పండి..

కృతి తన వర్క్ పట్ల చాలా డెడికేటెడ్ గా ఉంటుంది. తాను చేసే పనిలో రెస్పెక్ట్ చూపిస్తుంది అది ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఈ విషయంలో ఆ అమ్మాయి పర్ఫెక్ట్.

పాన్ ఇండియా సినిమా కోసం స్పెషల్ గా ఏమన్నా ప్రిపేర్ అవుతారా?

నేనేమి మార్చాలి అనుకోను హిందీలో ఆల్రెడీ అక్కడి తమ సినిమాలు చూస్తారు అప్పుడు మనం కూడా వాళ్ళ లాగే సినిమా చేసి రిలీజ్ చేస్తే రొటీన్ గా ఉంటుంది. హిందీలో రిలీజ్ అని మార్పులు ఏమి ఉండవు తెలుగు సినిమాగానే చేసి రిలీజ్ చెయ్యాలని చూస్తా అంతే. ఇప్పటి వరకు అక్కడ ఆదరణ వచ్చింది ముందు మన నేటివ్ సినిమాలే కదా అందుకే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా అయినా అది తెలుగు సినిమాలాగే చెయ్యాలి అనుకుంటాను.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం అన్నీ డిస్కషన్ లో ఉన్నాయి. బోయపాటి గురై తర్వాత ఇంకా ఏ డైరెక్టర్ తో అని ఫిక్స్ అవ్వలేదు అన్నీ డిస్కషన్ లో మాత్రమే ఉన్నాయి. బ్రేక్స్ కూడా ఏమీ తీసుకోను ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే స్టార్ట్ అవుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు