ఇంటర్వ్యూ : ‘సప్త సాగరాలు దాటి’ భావోద్వేగాలతో కూడిన ఓ అందమైన ప్రయాణం – హీరో రక్షిత్ శెట్టి

ఇంటర్వ్యూ : ‘సప్త సాగరాలు దాటి’ భావోద్వేగాలతో కూడిన ఓ అందమైన ప్రయాణం – హీరో రక్షిత్ శెట్టి

Published on Sep 21, 2023 5:14 PM IST


మంచి కంటెంట్ ఉంటే చాలు పలు సినిమాలు భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అవుతుంటాయి. ముఖ్యంగా మన తెలుగు వారు అయితే కథ, కథనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మరింతగా ఆదరిస్తారు. ఆ విధంగా హృదయానికి హత్తుకునే భావోద్వేగ అంశాలతో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ ఎమోషనల్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ ఏ. ఇటీవల కన్నడ లో మంచి విజయం సొంతం చేసుకున్న ఈ మూవీలో రక్షిత్ శెట్టి కి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని హేమంత్ ఎం రావు తెరకెక్కించారు. రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీని తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ గురించి తన అనుభవాలు పంచుకున్నారు హీరో కం ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి.

 

‘సప్త సాగరాలు దాటి’ మూవీ గురించి చెప్పండి ?
ఇది హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో నిండిన కథ. దర్శకుడు హేమంత్ దీనిని పదేళ్ల క్రితమే రాసుకున్నారు. అనంతరం నాకు చెప్పిన కథని మరింత అద్భుతంగా చిన్న ఇంప్రూవ్ మెంట్స్ తో వాస్తవికత కి దగ్గరగా తెరకెక్కించారు.

 

తెలుగు లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ఎందుకు భావించారు ?
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి చెందిన దివ్య తో నాకు ఎప్పటి నుండో మంచి పరిచయం ఉంది. అయితే కన్నడ లో ఆకట్టుకున్న ఈ మూవీ తప్పకుండా తెలుగు వారికి కూడా బాగా నచ్చుతుందని భావించి ఇద్దరం కలసి తెలుగులో రిలీజ్ చేయడనికి సిద్ధం అయ్యాము.

 

దర్శకుడు హేమంత్ ఎం రావు తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?
ఇటీవల చార్లీ 777 మంచి సక్సెస్ అనంతరం ఒక లవ్ స్టోరీ చేయాలనేది నా ఆలోచన. ఎన్నో ఏళ్లుగా తాను సిద్ధం చేసుకున్న ఈ స్క్రిప్ట్ తో హేమంత్ నా వద్దకు వచ్చారు. ఆయన కథ, కథనాలు చెప్పిన వెంటనే నాకు ఎంతో బాగా నచ్చాయి. గోధి బన్న సాధారణ మైకట్టు సినిమా అనంతరం దీనిని చేయడం జరిగింది.

 

మరి రెండు పార్టులుగా తీయాలి అనేది ఎవరి ఆలోచన ?
నిజానికి ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ప్రకారం రెండు భాగాలు ఉంటే కరెక్ట్ అని దర్శకుడు హేమంత్ కి అనిపించింది. తాను పొయటిక్ వే లో తెరకెక్కించిన విధానం ప్రకారం ఫస్ట్ పార్టీ క్లాసికల్ పొయెట్రీ మాదిరిగా ఉంటె సెకండ్ పార్ట్ రాక్ బ్యాండ్ పోయెట్రీ మాదిరిగా మను, ప్రియల మధ్య ప్రేమను, ఎమోషన్స్ ని ఆవిష్కస్తుంది.

 

సప్త సాగరాలు దాటి టైటిల్ పెట్టడానికి గల కారణం ?
టైటిల్ ఒక అందమైన కన్నడ పద్యం నుండి తీసుకోవడం జరిగింది. ఏడు సముద్రాలు దాటి అనే అర్థం వస్తుంది. మనం భౌతికంగా ఒక ప్రదేశానికి చేరుకోకపోతే ప్రేమ, కుటుంబం మరియు జీవిత లక్ష్యాల సందర్భంలో అక్కడ ఉండాలనే భావన లోతుగా వ్యక్తిగతంగా మరియు అర్థవంతంగా ఉంటుంది.

 

మూవీ యొక్క మ్యూజిక్ గురించి చెప్పండి ?
స్క్రిప్ట్ రాస్తున్న సమయంలోనే కథ, కథనాల్లో భాగంగా ఆకట్టుకునే భావోద్వేగాలతో కూడిన సంగీతాన్ని కూడా ఉపయోగించారు హేమంత్. ఆ విధంగా సీన్స్ యొక్క ప్రభావాన్ని బట్టి ఆడియన్స్ మదిని తాకేలా హృద్యమైన సంగీతాన్ని ఇందులో ఇనుమడింపజేశాము. బీజీఎమ్ తో పాటు ప్రతి సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

 

కర్ణాటకలో తెలుగు సినిమాల ప్రభావం?
కర్నాటకలో తెలుగు చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. చిన్నప్పుడు తెలుగు సినిమాలు విడుదలైన కొన్ని నెలల తర్వాత వీసీఆర్ టేపుల్లో చూసేవాన్ని. ఇంజనీరింగ్ రోజుల్లో, కర్నూలుకి చెందిన నా రూమ్‌మేట్‌ ద్వారా తెలుగు సినిమాల గురించి మరింత తెలుసుకోగలిగాను. వేదం వంటి అద్భుతమైన సినిమా గురించి అలాగే తెలుసుకున్నాను. కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న చిత్రాలు ఆదరణ పొందగలవని నాకు అర్థమైంది.

 

రాబోయే ప్రాజెక్ట్‌లు?
ప్రస్తుతం నా దగ్గర రిచర్డ్ ఆంథోనీ అనే ఒక క్లాసీ గ్యాంగ్‌స్టర్ కథ ఉంది, దాని తర్వాత ఆఫ్టర్ లైఫ్ ఆధారంగా ఒటిటి చిత్రం ఉంది. అలాగే పుణ్య కోటి అనే రెండు భాగాల ప్రాజెక్ట్‌ ఉంది.

 

స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడంపై?
నటుడిగా నేను స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ చిత్ర నిర్మాతగా, నాకు తెలుగు భాషపై దాని సాహిత్యం, జానపదాలపై లోతైన అవగాహన అవసరమని నేను నమ్ముతున్నాను. అన్ని కలిసి వస్తే చేయడనికి రెడీ.

థాంక్యూ ఆల్ ది బెస్ట్

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు