ఇంటర్వ్యూ : శివకార్తికేయన్ – “ప్రిన్స్” లో నాది చాలా యూనిక్ క్యారెక్టర్

ఇంటర్వ్యూ : శివకార్తికేయన్ – “ప్రిన్స్” లో నాది చాలా యూనిక్ క్యారెక్టర్

Published on Oct 19, 2022 5:24 PM IST

తమిళ నాట వరుస బ్లాక్ బస్టర్స్ తో మోస్ట్ లవబుల్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ కెరీర్ లో మంచి పీక్ లోకి వెళ్తున్నాడు. మరి అలా తాను చేసిన లేటెస్ట్ చిత్రం “ప్రిన్స్”. మన తెలుగు దర్శకుడు అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న తాను లేటెస్ట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి టాలీవుడ్ ఎంట్రీ పై ఈ సినిమాపై ఎలాంటి విషయాలు తాను పంచుకున్నాడో చూద్దాం రండి.

 

చెప్పండి తెలుగులో మీ ఎంట్రీ “ప్రిన్స్” తో ఎలా సాధ్యం అయ్యింది?

ఒక ఆర్టిస్ట్ గా అన్ని చోట్ల సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని, ప్రశంసలు అందుకోవాలని వుంటుంది. ప్రిన్స్ విషయానికి వస్తే.. ఫన్ సినిమాలు తగ్గిపోతున్నాయి. నా వరకూ కామెడీ సినిమాలు చేయడం చూడటం చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్ ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా నచ్చింది. తర్వాత అది ‘ప్రిన్స్’ గా మారింది. ప్రిన్స్ యూనివర్షల్ సబ్జెక్టు. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటాయి.

 

డైరెక్టర్ చెప్పిన దాంట్లో ఏ పాయింట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది?

అనుదీప్ చేసిన ‘జాతిరత్నాలు’ చూశాను. అనుదీప్ రాసుకునే పాత్రల్లో స్వచ్చమైన అమాయకత్వం వుంటుంది. పాత్రలు ఊహించని విధంగా రియాక్ట అవుతాయి. ప్రిన్స్ స్టొరీ ఐడియా చాలా ఎక్సయిట్ చేసింది. ఒక ఇండియన్ బ్రిటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా వుంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎక్సయిట్ చేసింది. ఇందులో సత్యరాజ్ గారి పాత్ర కూడా నన్ను ఎగ్జైట్ చేసింది. సత్యరాజ్ పాత్ర తన కొడుకుతో ”మన కులం, మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు” అని చెబుతుంది. చాలా యూనిక్ క్యారెక్టర్ ఇది.

 

మరి తెలుగులో డబ్బింగ్ మీరే చెప్పారా ?

లేదండీ. తెలుగు భాషపై పూర్తిగా పట్టురానిదే డబ్బింగ్ చెప్పకూడదని నా అభిప్రాయం. డైలాగ్ మాడ్యులేషన్ చాలా ముఖ్యం. అది భాషపై పట్టు సాధిస్తేనే వస్తుంది. అనుదీప్ తో కొంచెం తెలుగు మాట్లాడుతుంటాను. అయితే సొంతగా డబ్బింగ్ చెప్పే అంతా తెలుగు ఇంకా రాలేదు.

 

వరుణ్ డాక్టర్ లో మీ కామెడీ చాలా యూనిక్ గా ఉంటుంది, ఈ సినిమాలో ఎలా ఉంటుంది మరి?

వరుణ్ డాక్టర్ డార్క్ కామెడీ. నిజానికి నిజ జీవితానికి పోలిక లేని సినిమా. నా పాత్రలో చిన్న స్మైల్, ఎమోషన్ కూడా వుండదు. కానీ దాని నుండే హ్యుమర్ పుడుతుంది. రియల్ లైఫ్ లో అలా నవ్వకుండా ఒక్క అరగంట కూడా ఉండలేను.(నవ్వుతూ) ప్రిన్స్ క్యారెక్టర్ తో రిలేట్ చేసుకోగలను. అనుదీప్ తనదైన బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ప్రతి సీన్ ని అనుదీప్ తెలుగులో నటించి చూపించిన తర్వాతే యాక్ట్ చేసేవాడిని.

 

మొదటి సారి తెలుగు ప్రాజెక్ట్ చెయ్యడం ఆ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది?

ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్ గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్ లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన వుంది. విజయ్, వంశీ పైడిపల్లి గారితో సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ – శంకర్ గారు కలసి పని చేస్తున్నారు. రెండు పరిశ్రమలో కలసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సౌత్ పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో వుంది.

 

మీరు ఎలాంటి కథలు అయితే ఓకే చేస్తారు?

ఒక కథ ఎంపిక చేసినప్పుడు గత చిత్రం గురించి అలోచించను. గత చిత్రంలో కామెడీ వర్క్ అవుట్ అయ్యిందని మళ్ళీ అవే ఎలిమెంట్స్ వుండే కథ ఎంపిక చేయాలని అనుకోను. కథలో సెల్లింగ్ పాయింట్ చూస్తాను. ప్రేక్షకులు ఈ కథని ఎందుకు చూడాలి, ఇందులో కొత్తదనం ఏమిటి, విమర్శకులు దిన్ని ఎలా చూస్తారు ? ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటాను

 

మీ పదేళ్ల సినీ కెరీర్ కోసం చెప్పండి

టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సోలో హీరోగా ఎదిగాను. ప్రతి అనుభవం నా కెరీర్ కి ఉపయోగపడింది. ఈ పదేళ్ళలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను.

 

మీకు నాని గారికి చాలా మంది పోల్చి చెప్తారు దానికోసం చెప్పండి

అవును. నాని గారు కూడా యాంకర్ గా సహాయ దర్శకుడిగా పని చేశారు. నేను కూడా పని చేశాను. ప్రేక్షకులు కూడా మేము సిమిలర్ గా కనిపిస్తామని చెబుతుంటారు. నాని గారిది కూడా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం.

 

ప్రిన్స్ నిర్మాతలు గురించి చెప్పండి

సురేష్ ప్రొడక్షన్ లెజెండ్రీ ప్రొడక్షన్ హౌస్. తమిళ్ లో కూడా గొప్ప గొప్ప సినిమాలు చేసిన చరిత్ర వారిది. సురేష్ ప్రొడక్షన్ లో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కారణం సునీల్ గారు. బీగినింగ్ నుండి చాలా ప్రోత్సహించారు. శాంతి టాకీస్ అరుణ్ చాలా సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ ని చేశాను.

 

తెలుగులో ఏ దర్శకులతో అయితే వర్క్ చెయ్యాలి అనుకుంటున్నారు?

రాజమౌళి గారు. ఆయనతో కలసి పని చేయాలని అందరికీ వుంటుంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం మా వీరన్ చేస్తున్నా అది తెలుగులో ‘మహావీరుడు’ గా వస్తుంది. దీనితో పాటుగా ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాను. దానితో ఓ ఫాంటసీ డ్రామా కూడా ఉంది. దీనితో పాటుగా మరికొన్ని ఇంకా చర్చల్లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు