దర్శకునిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టాలనుకున్న తను , నిర్మాతగా తన కోరిక నెరవేర్చుకున్నానంటున్నారు ‘సోలో’ చిత్ర నిర్మాత సిహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్. నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సోలో’ సినిమా లో హైలట్ ఏమిటంటే.. మూవీ మొత్తం, ప్రతీ సన్నివేశం హైలట్ గానే ఉంటుంది అంటోన్న శ్రీనివాస్ తో 123 తెలుగు.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ .
ప్ర . విడుదలకు సిద్దంగా ఉన్న మీ ‘సోలో’ సినిమాపై అంచనాలు ఎలా వున్నాయి. ?
స. ‘సోలో’ సినిమా ఖచ్చితంగా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది. హీరో నారా రోహిత్ కెరీర్ కు ఈ సినిమా కొత్త మలుపు కాబోతుంది. ఇంతకుముందు కంటే రోహిత్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడు. ఇక మణిశర్మ మెలోడీస్ ఈ చిత్ర విజయానికి ఎంతో దోహద పడతాయి. నేను ఈ సినిమాను ఎలా అనుకున్నానో సరిగ్గా అలానే వచ్చింది. ఈ సినిమా యూనిట్ మొత్తానికే మంచి పేరు తీసుకువస్తుంది.
ప్ర. ఈ సినిమాలో హైలెట్స్ గురించి చెప్పండి ?
స . మూవీ మొత్తం హైలెట్ గానే ఉంటుంది. ప్రతిక్షణం ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తూ, ఎక్కడా బోర్ అనిపించదు. ఫ్యామిలీ మొత్తం కలసి సంతోషంగా చూసే విధంగా సినిమా తీర్చిదిద్దాం. సెన్సార్ వ్యతిరేకించే ఏ చిన్న సన్నివేశం కూడా ఈ మూవీలో ఉండదు.
ప్ర . అసలు ఈ సినిమా చేయాలన్న పట్టుదల మీకెలా వచ్చింది.?
స . బేసిక్ గా చదువుకునే రోజులనుంచీ నాకు సినిమాలంటే చాలా ఇష్టం. డైరెక్టర్ అవ్వాలనే కోరికతో పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కూడా అడ్మిషన్ తీసుకున్నా. కొన్ని కారణాలతో బిజినెస్ లో సెటిల్ అయ్యి, ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలో ప్రవేశించాలన్న నా కోరికను నెరవేర్చుకున్నా.
ప్ర. ఇండస్ట్రీ లో మీ ఫ్రెండ్స్, నిర్మాత కావటానికి ఇన్స్పిరేషన్ ఎవరు ?
స . రామానాయుడు గారు నాకు రోల్ మోడల్. వారి ఫ్యామిలీ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. డివివి దానయ్య, సుమన్, శ్రీహరి మంచి తోడ్పాటునిచ్చారు.
ప్ర . ఈ మూవీ లో హీరో, హీరోయిన్ పనితీరుపై మీ అభిప్రాయం.
స . నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్, నటనలో పరిణితి ఈ సినిమాలో అబ్బుర పరిచే విధంగా ఉంటాయి. ఈ సినిమా తో ఆయన హవా మొదలవుతుంది. రోహిత్ వాయిస్ అద్భుతం. హీరోయిన్ నిషా అగర్వాల్ కు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఎంతో బాగా నటించింది.
ప్ర . ‘సోలో’ టైటిల్, ట్యాగ్ లైన్ ఎంచుకోవటం లో ప్రత్యేకత ఏమిటి..?
స. ఈ మూవీ కి సోలో టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది. వెనుకా ముందూ ఎవరూలేని ఒకని ప్రేమ కథే ఈ సినిమా. హీరో క్యారక్టర్ ఈ సినిమా లో చాలా విభిన్నంగా ఉంటుంది. ఆద్యంతం హ్యాపీ గా సాగే చిత్రమిది. అలీ, ఎంఎస్ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి కడుపుబ్బా నవ్విస్తారు. జయసుధ – ప్రకాష్ రాజ్ సంభాషణ ఆకట్టుకుంటుంది.
ప్ర . సినిమా లో టెక్నికల్ వాల్యూస్ గురించి..?
స. ఎడిటింగ్ మార్తాండ్, మణిశర్మ ఎన్నో అమూల్యమైన సలహాలు అందించారు. డిటిఎస్ మిక్శింగ్ అనూహ్యంగా ఉంది.
ప్ర. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి ?
స. రెండో సినిమా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇందులో అల్లరి నరేష్, శర్వానంద్, శ్రీయ, బ్రహ్మానందం, అలీ, కోవై సరళ ప్రధాన తారాగణం. ఇప్పటికే షూటింగ్ చాలా వరకూ పూర్తి అయింది.
ప్ర. ‘సోలో’ నిర్మిస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు. ?
స. షూటింగ్ స్పాట్ లో నేనసలు లేను. మొత్తమంతా దర్శకుడు పరశురామే చూసుకున్నారు.
ప్ర. జీవిత లక్ష్యం, హాబీలు, అలవాట్ల గురించి చెప్పండి.?
స . మొదట నేను బిజినెస్ పర్సన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా, వైజాగ్ ఈస్ట్ ఇన్ఛార్జ్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నా. సినీ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది.
ప్ర. ‘సోలో’ సినిమా సమాజానికి ఏమైనా సందేశం ఇవ్వనుందా?
స . కచ్చితంగా ఇది సందేశాత్మక సినిమానే. ఉమ్మడి కుటుంభం యొక్క ఉపయోగాలు చెబుతూ, ప్రేమపేరుతో తల్లి దండ్రులను ఇబ్బందుల పాలు చేయకుండా, ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఈ సినిమా చెబుతుంది. లేచిపోవటం, పారిపోవటం వంటి తప్పుత్రోవ పట్టకుండా యువతకు దిక్సూచి ఈ సినిమా.
ప్ర. సొసైటీ లో సినిమాల పాత్ర ఎలా ఉండాలంటారు.?
స. మెకానికల్ అయిపోయిన ప్రస్తుత జీవనంలో కాసేపైనా ప్రేక్షకులకు వినోదం అందిచాగాలగాలి. యువత మంచి మార్గాన పయనిచేందుకు సినిమా మార్గదర్శి కావాలి. దేనిలోనైన మంచిని తీసుకుని చెడుని విడనాడితే సమాజం పురోగమిస్తుంది.
నారాయణ – ఎవి